AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Green Chilli Benefits: పచ్చిమిర్చితో పుష్కలమైన ప్రయోజనాలు.. తెలిస్తే ఎగబడి తింటారంతే..!

పచ్చి మిర్చి.. ప్రతి వంటింట్లోనూ తప్పని సరిగా ఉండే ఒక కూరగాయ. ఇది ఆహారం రుచిని మెరుగుపరచడానికి దాదాపు ప్రతి వంటకంలో మిరపకాయను ఉపయోగిస్తారు. రుచిలో కారంగా ఉండే, ఈ పచ్చిమిర్చి.. ఆరోగ్యానికి పుష్కలమైన ప్రయోజనాలు అందిస్తుందని మీకు తెలుసా..? అవును మిరపకాయలో అనేక పోషకాలు నిండివున్నాయి. పచ్చిమిరపకాయలలో విటమిన్ ఏ, విటమిన్ బి 6, విటమిన్ సి, ఐరన్, కాపర్, ప్రోటీన్, పొటాషియం, కార్బోహైడ్రేట్ వంటి అనేక పోషకాలు ఉంటాయని అంటున్నారు. మీ రోజువారి ఆహారంలో పచ్చిమిరపకాయలు ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Jul 23, 2025 | 1:44 PM

Share
పచ్చి మిరపకాయలు ఆహారంలో భాగంగా తీసుకుంటే...గుండెకు మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది , ఇది ధమనులు మూసుకుపోయే ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఐరన్, పొటాషియం, విటమిన్ C, A, B5 వంటి పుష్కలమైన పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా క్యాప్సైసిన్ అనే పదార్థం జీవక్రియను వేగవంతం చేసి జీర్ణక్రియను మెరుగుపరిచే గుణాలను కలిగి ఉంది.

1 / 5
పచ్చిమిర్చి తినడం ద్వారా వృద్ధాప్య సమస్యను తగ్గించవచ్చు. ఇందులో యాంటీ-ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్ సెల్ డ్యామేజ్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా, ఇది అకాల వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. పచ్చిమిర్చి చర్మానికి చాలా ప్రయోజనకరంగా పనిచేస్తుంది.  మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని తాజాగా, కాంతివంతంగా ఉంచుతుంది.

2 / 5
పచ్చిమిర్చి తినడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. దీనివల్ల కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. కొవ్వును కరిగించడం వల్ల బరువు సులభంగా తగ్గుతుంది. అందువల్ల, మిరపకాయలు తినడం వల్ల బరువు తగ్గడంలో చాలా సహాయపడుతుంది. కాబట్టి మీ ఆహారంలో పచ్చిమిర్చిని చేర్చుకోండి.

3 / 5
పచ్చిమిర్చి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీన్ని తినడం వల్ల పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనివల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు, ఉబ్బరం మొదలైనవి తగ్గుతాయి. అయితే, అల్సర్ వంటి ఏదైనా సమస్య ఉంటే, మిరపకాయలు తినకుండా ఉండాలి.

4 / 5
మిరపకాయలు తినడం వల్ల మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. దీన్ని తినడం వల్ల సంతోషకరమైన హార్మోన్లు విడుదలవుతాయి. అందువల్ల, దీన్ని తినడం వల్ల మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. అంతేకాదు.. ఇందులో ఉండే కాస్పేసిన్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే విటమిన్ E సహజమైన నూనెలను అందిస్తూ తేమను కాపాడుతుంది. విటమిన్ A ఎక్కువగా ఉండడం వల్ల కంటి చూపును మెరుగుపరిచే గుణాలు కలిగి ఉంది.

5 / 5