Green Tea: ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగుతున్నారా..? జాగ్రత్త!
ప్రస్తుతం ఎక్కువ మంది చాయ్ ప్రియులు గ్రీన్ టీ అలవాటు చేసుకుంటున్నారు. ఎందుకంటే.. గ్రీన్ టీ అనేది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. బరువు తగ్గాలనే ప్రయత్నంలో ఉన్నవారు ఎక్కువగా గ్రీన్ టీ తీసుకుంటున్నారు. ఇది యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. కొవ్వును కాల్చేస్తుంది. మీ చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను క్లీయర్ చేస్తుంది. కానీ, గ్రీన్ టీ విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు ఆరోగ్యనిపుణులు. లేదంటే సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. గ్రీన్‌టీ తాగేందుకు సరైన సమయం, మోతాదు ఇక్కడ తెలుసుకుందాం...
Updated on: Jul 24, 2025 | 10:48 AM

గ్రీన్ టీలో టానిన్లు ఉంటాయి. ఇవి కడుపు ఆమ్లతను పెంచుతాయి. మీకు వికారం లేదా ఉబ్బరం కలిగిస్తాయి. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో టానిన్లు, పాలీఫెనాల్స్ ఉంటాయి. అయితే, ఉదయం ఖాళీ కడుపున తీసుకోవడం వల్ల మన కడుపులో యాసిడ్ స్థాయిలు పెరిగిపోతాయి. అంతేకాదు, ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం వల్ల అజీర్తికి కూడా చేస్తుంది.

ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణక్రియ మందగించే అవకాశం ఉంది. ఇది గ్యాస్ట్రిక్, యాసిడిటీ వంటి సమస్యలు రావొచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే కడుపులో యాసిడ్ స్థాయి పెరిగి గ్యాస్, మలబద్ధకం, మైగ్రేన్ వంటి సమస్యలు రావచ్చు.

గ్రీన్ టీలో కాఫీన్ ఉండటం వల్ల ఖాళీ కడుపుతో తాగితే కడుపులో అసౌకర్యం, హార్ట్‌బీట్ వేగం కావడం లేదా ఆందోళనగా అనిపించే అవకాశం ఉంటుంది. ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే అందులోని కాఫీన్ కారణంగా నిద్రపట్టకపోవడం, మానసిక అసౌకర్యం, అలసట వంటి సమస్యలు ఏర్పడవచ్చు.

గ్రీన్ టీలోని టానిన్ శరీరంలో ఐరన్‌ను తగ్గిస్తుంది. దీనివల్ల మీరు బలహీనంగా ఉంటారు. గ్రీన్ టీలో ఉండే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు శరీర ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాదు, చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడంలో సహాయపడతాయి.

గ్రీన్ టీ ఉదయం ఖాళీ కడుపున తీసుకోకూడదు. భోజనం తర్వాత లేదా టిఫిన్‌తో పాటు గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. ఇదే సమయంలో దాని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పూర్తిగా ప్రభావితం కావడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఇది మన శరీరానికి తక్షణ శక్తి కూడా అందిస్తుంది. అయితే, రాత్రి కూడా తిన్న తర్వాత తీసుకోవచ్చు. కానీ, ఖాళీ కడుపున మాత్రం గ్రీన్ టీ తీసుకోకూడదు.




