ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు.. డాక్టర్‌తో పని లేకుండానే..

రక్తపోటును అదుపులో ఉంచుకోవడం వల్ల స్ట్రోక్, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. అంటే ఆపిల్‌ తీసుకోవడం ద్వారా మధుమేహం, రక్తపోటు రెండూ అదుపులో ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు కొన్ని రకాల పండ్లను మాత్రమే తినాల్సి ఉంటుంది.

ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు.. డాక్టర్‌తో పని లేకుండానే..
Fruits cl
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 24, 2024 | 6:39 PM

మనం తినే ఆహారాలు నేరుగా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. మన ఆహారంలో సీజనల్ పండ్లు, కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం ఎంతో అవసరం.. ఇది మన శరీరానికి అవసరమైన చాలా పోషకాలను అందిస్తుంది. సీజనల్‌గా లభించే అన్ని రకాల పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందులో ఆపిల్ అతి ముఖ్యమైనది. అంతేకాదు.. రోజుకో ఆపిల్‌ తింటే.. డాక్టర్‌తో పనిలేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆపిల్‌ తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది. దీన్నితీసుకోవడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. షుగర్ లెవల్స్ కూడా పెరగవు.

ఆపిల్‌ పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చే సమస్యలను తగ్గిస్తాయి. ఇది అనేక దీర్ఘకాలిక వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది. అంతేకాదు.., ఆపిల్స్‌ ఫైబర్‌కు మంచి మూలం, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆపిల్స్ తినడం వల్ల అందులోని కాల్షియం మీ ఎముకలు, దంతాలు బలంగా ఉండేలా సహాయపడుతుంది. అలాగే మన ఊపిరితిత్తుల ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాదు.. ఆపిల్స్ తినటం వల్ల వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులు కొన్ని రకాల పండ్లను మాత్రమే తినాల్సి ఉంటుంది. అలాటి సమయంలో యాపిల్ తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తరచూగా చెబుతుంటారు. పీచుపదార్థాలు ఎక్కువగా ఉండి, చక్కెర తక్కువగా ఉండే ఆపిల్ గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి. ఆపిల్స్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలకు ఆరోగ్యం. వేసవిలో ఆపిల్స్‌ తినడం వల్ల డీహైడ్రేషన్ వచ్చే సమస్య కూడా తగ్గిపోతుంది.

చాలా మందిలో మధుమేహంతో పాటు అధిక రక్తపోటు కూడా ముప్పుగా మారుతోంది. ఈ సమస్యకు ఆపిల్స్ తినడం కూడా మేలు చేస్తుంది. ఆపిల్స్‌ తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుకోవడం వల్ల స్ట్రోక్, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. అంటే ఆపిల్‌ తీసుకోవడం ద్వారా మధుమేహం, రక్తపోటు రెండూ అదుపులో ఉంటాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే