AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cholesterol: ఈ నాలుగు మసాలాలు వాడితే చాలు.. ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే..! నో టెన్షన్‌, హార్ట్ అటాక్..

చెడు కొలెస్ట్రాల్ గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్.. డిమెన్షియా ఉన్నవారిలో ఆల్కహాల్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. కాబట్టి మన వంటగదిలో ఉపయోగించే కొన్ని రకాల మసాల దినుసులను మన ఆహారంలో భాగం చేసుకోవడం చాలా మంచిది.

Cholesterol: ఈ నాలుగు మసాలాలు వాడితే చాలు.. ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే..! నో టెన్షన్‌, హార్ట్ అటాక్..
Common Spices
Jyothi Gadda
|

Updated on: Apr 24, 2024 | 5:52 PM

Share

మన ఆరోగ్యం విషయంలో మనం తినే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, ఇక్కడ మనం తింటున్న ఆహారం ఎంత పోషకమైనది అనేది ముఖ్యం. అలాంటి ఆహారాల్లో ఆయుర్వేద ప్రకారం కొన్ని రకాల మసాలా దినుసులు మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతి వంటగదిలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు, మూలికల ద్వారా అనేక అంటువ్యాధులకు చెక్ పెట్టవచ్చు. మరికొన్ని మసాలాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అలాంటి మసాల దినుసులను గురించి ఇక్కడ తెలుసుకుందాం..

సుగంధ ద్రవ్యాలు యాంటీ ఆక్సిడెంట్ల స్టోర్ హౌస్. వీకొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే కొన్ని సాధారణ వంటగది మసాలా దినుసులలో దాల్చినచెక్క కూడా ఒకటి. ఇందులో చెడు కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. చెడు కొలెస్ట్రాల్ గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్.. డిమెన్షియా ఉన్నవారిలో ఆల్కహాల్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. కాబట్టి మన వంటగదిలో ఉపయోగించే కొన్ని రకాల మసాల దినుసులను మన ఆహారంలో భాగం చేసుకోవడం చాలా మంచిది.

అల్లం: ప్రతివంటింట్లోనూ తప్పనిసరిగా ఉపయోగించే మసాలా అల్లం. సాధారణంగా అల్లం లేకుండా దాదాపు ఏ వంటకం పూర్తి కాదని చెప్పాలి.వవ అల్లంతో అనేక అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు నయమవుతాయి. అల్లం కడుపు నొప్పి, అజీర్ణం, వికారం వంటి సమస్యలను నయం చేస్తుంది. అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కాలేయ పనితీరును మెరుగుపరచడమే కాకుండా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

వెల్లుల్లి: ఆరోగ్యంగా ఉండేందుకు వెల్లుల్లి ఎంతగానో సహకరిస్తుంది. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తపోటును అదుపులో ఉంచుతాయి. అదనంగా, ఇది కరోనరీ ధమనులలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.

మిరియాలు: మిరియాలలో కూడా అనేక పోషక విలువలు ఉన్నాయి. ముఖ్యంగా యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి బరువు తగ్గడంలో సహాయపడతాయి.

ధనియాలు: ధనియాలు రుచిగా ఉండటమే కాకుండా జీర్ణ సమస్యలను కూడా నయం చేస్తుంది. ఆహారంలో ధనియాలను రెగ్యులర్ వాడుతూ ఉండటం ఆరోగ్యానికి చాలు మేలు చేస్తుందని చెబుతున్నారు. ధనియాలు తినడం వల్ల గుండె సమస్యలు, అధిక రక్తపోటు, షుగర్ వంటివి అదుపులో ఉంటాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..