Breakfast: బ్రేక్‌ఫాస్ట్‌లతో రోగనిరోధక శక్తి పెంచుకోండి.. ఒమిక్రాన్‌ని అంతం చేయండి..
Breakfast: కరోనా వైరస్ దరిచేరకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తి చాలా ముఖ్యమైనది. బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా ఈ రోజుల్లో అనేక వ్యాధులు
Breakfast: కరోనా వైరస్ దరిచేరకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తి చాలా ముఖ్యమైనది. బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా ఈ రోజుల్లో అనేక వ్యాధులు సంభవిస్తున్నాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి పోషకాలు పుష్కలంగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. ఇందులో విటమిన్ సి, డి సమృద్ధిగా ఉండాలి. అయితే మన గురించి మనం అప్రమత్తంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉండగలం. అల్పాహారం అనేది రోజులో మొదటగా తినే ఫుడ్. ఇది అనేక విధాలుగా మన ఆరోగ్యంపై మంచి, చెడు ప్రభావాలను చూపిస్తుంది. అలాంటి కొన్ని ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌ల గురించి తెలుసుకుందాం.
1. ఎగ్ పరాటా
ఎగ్ పరాటా ఈ రోజుల్లో అందరికి చాలా ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్. దాని రుచి అద్భుతంగా ఉంటుంది. గుడ్లలో ఉండే ప్రోటీన్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎగ్ పరాటా చేయడానికి మీకు కావలసిందల్లా కొంచెం మైదా, ఉప్పు, కొన్ని మసాలాలు, కొంత శ్రమ. రోటీలు చేసే పెనంపై తేలికగా కాల్చాలి. పిండి కొంచెం ఉబ్బినప్పుడు అందులో గుడ్డు మిశ్రమాన్ని వేసి నూనెతో కాల్చాలి. మీ పరాటా తినడానికి సిద్ధంగా ఉంటుంది.
2. చీజ్ కేక్
పన్నీర్‌లో విటమిన్ డి, ప్రొటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పన్నీర్ బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి కొంచెం శనగ పిండి, పన్నీర్, మసాలా దినుసులు, రుచి ప్రకారం ఉప్పును ఉంటే సరిపోతుంది. ఇప్పుడు శెనగపిండిలో ఉప్పు వేసి బాణలిపై వేయించాలి. నూనెతో కొద్దిగా కాల్చిన తర్వాత పన్నీర్ మిశ్రమాన్ని అందులో పోసి మళ్లీ బేక్ చేయాలి. పెద్దలకే కాదు పిల్లలకు కూడా ఇది రుచిగా ఉంటుంది. ఈరోజు నుంచి అల్పాహారంలో దీన్ని ప్రయత్నించండి.
3. ఇడ్లీ
మీకు ప్రతిరోజు ఇడ్లీని తయారు చేసే ఓపిక ఉంటే మీ అల్పాహారంలో కచ్చితంగా చేర్చుకోండి. ఇడ్లీ తినడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇడ్లీ చేయడానికి నానబెట్టిన బియ్యాన్ని గ్రైండ్ చేయాలి. మీకు కావాలంటే రుచి ప్రకారం ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు స్టీమర్‌లో ఆవిరి మీద ఉడికించి ఆపై చట్నీతో సర్వ్ చేస్తే సరిపోతుంది.
4. ఓట్స్ గంజి
ఇది మీకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. విశేషమేమిటంటే ఓట్స్ గంజిని కూరగాయలు, మసాలా దినుసులు కలిపి తయారు చేస్తే దాని రుచి రెట్టింపు అవుతుంది. వైద్యులు లేదా నిపుణులు కూడా అల్పాహారం కోసం ఓట్స్ తినమని సిఫార్సు చేస్తారు. ఈ బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి ఓట్స్‌ని పాన్‌పై వేసి కొద్దిగా అందులో నూనె వేసి వేయించి, అన్ని కూరగాయలను కలపాలి. ఇప్పుడు అందులో నీళ్లు పోసి కాసేపు ఉడికించాలి. కొద్ది సమయంలో మీ ఓట్స్ రెసిపీ సిద్దంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.