విద్యార్థులకు శుభవార్త.. ఆన్‌లైన్ జర్నలిజం కోర్సును ప్రారంభించిన ఇగ్నో.. జనవరి 31 చివరి తేదీ..

IGNOU MJMC: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) ప్రస్తుతం అనేక కొత్త ప్రోగ్రామ్‌లను ప్రారంభిస్తోంది. MBA,

విద్యార్థులకు శుభవార్త.. ఆన్‌లైన్ జర్నలిజం కోర్సును ప్రారంభించిన ఇగ్నో.. జనవరి 31 చివరి తేదీ..
Ignou 2022

IGNOU MJMC: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) ప్రస్తుతం అనేక కొత్త ప్రోగ్రామ్‌లను ప్రారంభిస్తోంది. MBA, PG డిప్లొమా ఆన్‌లైన్ కోర్సు తర్వాత ఇప్పుడు ఇగ్నో మాస్టర్ ఇన్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ (MJMC) కోర్సును ప్రారంభించింది. జనవరి 2022 సెషన్ నుంచి MAJMC అడ్మిషన్ కోసం రిజిస్ట్రేషన్‌ను కూడా ప్రారంభించింది. ఈ కోర్సు ఆన్‌లైన్‌లో ఉంటుంది. దీని కోసం అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అడ్మిషన్ తీసుకోవచ్చు. ప్రవేశం కోసం అభ్యర్థులు ఇగ్నో వెబ్‌సైట్‌ ignouadmission.samarth.edu.in లో నమోదు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 31.

IGNOU MAJMC కోర్సు 2 సంవత్సరాల వ్యవధిని కలిగి ఉంటుంది. దీనిని స్కూల్ ఆఫ్ జర్నలిజం, న్యూ మీడియా స్టడీస్ నిర్వహిస్తుంది. కోర్సు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. ప్రోగ్రామ్ ఆన్‌లైన్‌లో ఉన్నందున, కంప్యూటర్, ఇంటర్నెట్‌కు ప్రాప్యత, వర్డ్ ప్రాసెసింగ్‌కు సంబంధించిన ప్రాథమిక జ్ఞానం అవసరం. అభ్యర్థులు వార్షిక కోర్సు ఫీజుగా రూ.200, రూ . 12,500 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.

ఎలా దరఖాస్తు చేయాలి.. http://ignouadmission.samarth.edu.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. హోమ్‌పేజీలో ‘న్యూ రిజిస్ట్రేషన్ కోసం క్లిక్ చేయండి’. అడిగిన ఆధారాలను నమోదు చేయండి మీ లాగిన్ ఆధారాలను పొందండి. అభ్యర్థి పేరు, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్‌కండి. IGNOU జనవరి సెషన్ 2022 దరఖాస్తు ఫారమ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఫారమ్‌ను నింపండి. అడిగిన పత్రాలను అప్‌లోడ్ చేయండి. దరఖాస్తు ఫీజు చెల్లించి ఫారమ్‌ను సమర్పించండి. భవిష్యత్ సూచనల కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.

MAJMC కింద జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్‌, రిపోర్టింగ్ టెక్నిక్స్, ప్రింట్ మీడియా, బ్రాడ్‌కాస్ట్, ఆన్‌లైన్ జర్నలిజం, మీడియా అండ్ సొసైటీ కోసం రైటింగ్, ఎడిటింగ్, మీడియా ఎథిక్స్ లా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా, అడ్వర్టైజింగ్, పబ్లిక్ రిలేషన్స్ ఇతరత్రా కోర్సులను అందిస్తారు.

U19 World Cup: 27 పరుగులకే 5 వికెట్లు పడగొట్టాడు.. ఫలితంగా తొలి మ్యాచ్‌లో ఘన విజయం..

ఈ ప్రభుత్వ పథకంలో డబ్బు సులువుగా రెట్టింపు.. అంతేకాదు సురక్షితం కూడా..?

Credit Card Charges: క్రెడిట్‌ కార్డ్‌ ఆలస్య చెల్లింపుపై ఏ బ్యాంకు ఎంత ఛార్జ్‌ చేస్తుందో తెలుసా..?

Click on your DTH Provider to Add TV9 Telugu