ఈ ప్రభుత్వ పథకంలో డబ్బు సులువుగా రెట్టింపు.. అంతేకాదు సురక్షితం కూడా..?

Post Office: మీరు భవిష్యత్‌లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే పోస్టాఫీసులోని ప్రభుత్వ పథకాలలో చేయవచ్చు. ఇందులో మంచి రాబడిని పొందుతారు.

ఈ ప్రభుత్వ పథకంలో డబ్బు సులువుగా రెట్టింపు.. అంతేకాదు సురక్షితం కూడా..?
Savings

Post Office: మీరు భవిష్యత్‌లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే పోస్టాఫీసులోని ప్రభుత్వ పథకాలలో చేయవచ్చు. ఇందులో మంచి రాబడిని పొందుతారు. అలాగే పెట్టుబడి పెట్టిన డబ్బు కూడా సురక్షితంగా ఉంటుంది. ఒకవేళ మీరు బ్యాంకులో డిపాజిట్‌ చేస్తే వడ్డీ తక్కువగా ఉంటుంది. అంతేకాదు డిఫాల్ట్‌ అయితే కేవలం ఐదు లక్షల రూపాయల మొత్తాన్ని మాత్రమే తిరిగి పొందుతారు. కానీ పోస్టాఫీసులో అలా కాదు ఎందుకంటే ఈ పథకాలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. తక్కువ మొత్తంతో పెట్టుబడి ప్రారంభించే అవకాశం ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు పథకాలలో కిసాన్ వికాస్ పత్ర అంటే KVP కూడా చేర్చారు. ఈ పథకం గురించి వివరంగా తెలుసుకుందాం.

ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ కిసాన్ వికాస్ పత్రలో సంవత్సరానికి 6.9 శాతం వడ్డీ రేటు చెల్లిస్తున్నారు. పెట్టుబడి మొత్తం 124 నెలల్లో అంటే 10 సంవత్సరాల 4 నెలల్లో రెట్టింపు అవుతుంది. ఈ పథకంలో కనీసం రూ. 1,000 పెట్టుబడి పెట్టాలి. ఈ పథకంలో గరిష్ట పెట్టుబడికి పరిమితి లేదు. ఎంతైనా డిపాజిట్‌ చేయవచ్చు. పోస్ట్ ఆఫీస్ కిసాన్ వికాస్ పత్ర పథకంలో ఒక వయోజన వ్యక్తి గరిష్టంగా ముగ్గురు పెద్దలతో ఉమ్మడి ఖాతాను తెరవవచ్చు. ఇది కాకుండా మైనర్ తరపున సంరక్షకుడు ఖాతాను తెరవవచ్చు. ఈ పథకం కింద 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మైనర్ కూడా తన పేరుపై ఖాతాను ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది.

కిసాన్ వికాస్ పత్రలో డిపాజిట్ చేసిన మొత్తం డిపాజిట్ చేసిన తేదీ నుంచి ఎప్పటికప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించిన వడ్డీ జమవుతూ ఉంటుంది. కిసాన్ వికాస్ పత్రాన్ని తనఖా పెట్టవచ్చు లేదా సెక్యూరిటీగా బదిలీ చేసుకునే సదుపాయం ఉంటుంది. దీని కోసం వ్యక్తి ఆమోద పత్రాన్ని సంబంధిత పోస్టాఫీసుకు సమర్పించాలి. ఇది కాకుండా ప్రభుత్వం లేదా ప్రైవేట్ కార్పొరేషన్, ప్రభుత్వ కంపెనీ, స్థానిక అధికారం లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీతో బదిలీ లేదా తనఖా కూడా పెట్టుకోవచ్చు.

Credit Card Charges: క్రెడిట్‌ కార్డ్‌ ఆలస్య చెల్లింపుపై ఏ బ్యాంకు ఎంత ఛార్జ్‌ చేస్తుందో తెలుసా..?

అందమైన రూపం.. అద్భుత డ్యాన్స్‌ కలబోస్తే ఆమె.. నటన కోసం పాఠశాలనే విడిచిపెట్టిన ‘సితార’

Mutual Fund: మ్యూచువల్ ఫండ్స్‌ ద్వారా డబుల్‌ ప్రాఫిట్‌.. పిక్స్‌డ్‌ డిపాజిట్ల కంటే చాలా రెట్లు ఎక్కువ.. ఎలాగంటే..?

Click on your DTH Provider to Add TV9 Telugu