Credit Card Charges: క్రెడిట్‌ కార్డ్‌ ఆలస్య చెల్లింపుపై ఏ బ్యాంకు ఎంత ఛార్జ్‌ చేస్తుందో తెలుసా..?

Credit Card Charges: ఇటీవల కాలంలో వివిధ బ్యాంకులు వివిధ సేవలకు ఛార్జీలను పెంచాయి. మీరు క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే హెచ్‌డిఎఫ్‌సి

Credit Card Charges: క్రెడిట్‌ కార్డ్‌ ఆలస్య చెల్లింపుపై ఏ బ్యాంకు ఎంత ఛార్జ్‌ చేస్తుందో తెలుసా..?
Credit Card
Follow us
uppula Raju

|

Updated on: Jan 15, 2022 | 9:36 AM

Credit Card Charges: ఇటీవల కాలంలో వివిధ బ్యాంకులు వివిధ సేవలకు ఛార్జీలను పెంచాయి. మీరు క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఎస్‌బిఐ కార్డ్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఎంత ఛార్జ్‌ చేస్తున్నాయో తెలుసుకోండి. క్రెడిట్ కార్డ్ ప్రత్యేకత ఏంటంటే షాపింగ్ బిల్లును చెల్లించడానికి మీకు 50 రోజుల వడ్డీ రహిత వ్యవధి లభిస్తుంది. అయితే గడువు తేదీ తర్వాత చెల్లిస్తే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని ఆలస్య చెల్లింపు రుసుము అంటారు. ఆలస్య చెల్లింపు రుసుమును ఆయా బ్యాంకులు విధిస్తాయి.

ICICI క్రెడిట్ కార్డ్: ఆలస్య చెల్లింపు రుసుము, ముందస్తు నగదు లావాదేవీల రుసుము, చెక్ రిటర్న్ రుసుము, ఆటో డెబిట్ రిటర్న్ రుసుములను పెంచాలని బ్యాంక్ నిర్ణయించింది. కొత్త ఛార్జీ 10 ఫిబ్రవరి 2022 నుంచి వర్తిస్తుంది. అయితే ఎమరాల్డ్ క్రెడిట్ కార్డుపై ఛార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఇది కాకుండా బకాయి మొత్తం రూ.100 కంటే తక్కువగా ఉంటే ఛార్జీలు వర్తించవు. రూ.100-500 మధ్య బకాయి ఉంటే రూ.100, రూ.501-5000 వరకు బ్యాలెన్స్ ఉంటే రూ.500, రూ.5001-10000 వరకు బకాయి ఉంటే రూ.750, రూ.10001-25 వేల వరకు బకాయి ఉంటే రూ.900, 25001 రూ.50 వేల నుంచి రూ.1000 వరకు, రూ.50 వేల కంటే ఎక్కువ బకాయి ఉన్నట్లయితే, రూ.1200 ఆలస్య చెల్లింపు ఛార్జీగా వసూలు చేస్తుంది.

SBI క్రెడిట్ కార్డ్ ఛార్జీలు: మీకు స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే 500 కంటే తక్కువ చెల్లించాల్సిన మొత్తానికి ఆలస్య రుసుము ఉండదు. 501-1000 రూపాయలకు ఆలస్య చెల్లింపు రుసుము 400 రూపాయలు, 1001-10 వేల రూపాయలు ఉంటే 1300 రూపాయల వరకు ఉంటుంది. నగదు ఉపసంహరణపై ఈ ఛార్జీ కనీసం రూ. 500 లేదా ఉపసంహరించుకున్న మొత్తంలో 2.5%, ఏది ఎక్కువ అయితే అది విధిస్తుంది. ఓవర్‌లిమిట్ ఛార్జీ 2.5 శాతం, గరిష్టంగా రూ.600 ఉంటుంది. చెక్ రిటర్న్ ఫీజు రూ.500 వరకు ఉంటుంది.

HDFC క్రెడిట్ కార్డ్ ఛార్జీలు: మీకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే రూ.100 కంటే తక్కువ చెల్లింపుపై ఛార్జీ ఉండదు. రూ.100-500 వరకు రూ.100, రూ.501-5000 వరకు రూ.500, రూ.5001-10000 వరకు రూ.600, రూ.10001-25000 వరకు రూ.800, రూ.25001-50000 రూ. 1100, 50 వేల కంటే ఎక్కువ బకాయిలు ఉంటే రూ.1300. చెల్లించాలి.

యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఛార్జీలు: మీరు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే రూ.300 వరకు బ్యాలెన్స్‌పై ఎటువంటి ఛార్జీ ఉండదు. ఆలస్య చెల్లింపు రుసుము రూ.300-500 బకాయిలపై రూ.100, రూ.501-1000 బకాయిలపై రూ.500, రూ.1001-10000 వరకు బకాయిలకు రూ.1000 ఆలస్య చెల్లింపు రుసుము చెల్లించాలి. నగదు ఉపసంహరణ కోసం మొత్తం ఉపసంహరణ మొత్తంలో 2.5% ఛార్జ్ చేస్తారు. ఇది కనిష్టంగా రూ.500 అవుతుంది.

Insurance: కొవిడ్‌ నుంచి కోలుకున్నవారు ఇన్సూరెన్స్‌ పాలసీ పొందడం కష్టమే..! ఎందుకో తెలుసా..?

అందమైన రూపం.. అద్భుత డ్యాన్స్‌ కలబోస్తే ఆమె.. నటన కోసం పాఠశాలనే విడిచిపెట్టిన ‘సితార’

Mutual Fund: మ్యూచువల్ ఫండ్స్‌ ద్వారా డబుల్‌ ప్రాఫిట్‌.. పిక్స్‌డ్‌ డిపాజిట్ల కంటే చాలా రెట్లు ఎక్కువ.. ఎలాగంటే..?

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!