అందమైన రూపం.. అద్భుత డ్యాన్స్‌ కలబోస్తే ఆమె.. నటన కోసం పాఠశాలనే విడిచిపెట్టిన ‘సితార’

Bhanupriya : అందమైన రూపం.. అద్భుత డ్యాన్స్‌ కలబోస్తే ఆమె. నటన కోసం పాఠశాలనే విడిచిపెట్టింది. సహజనటిగా ఎదిగి తనకంటూ ఓ ఇమేజ్‌ని

అందమైన రూపం.. అద్భుత డ్యాన్స్‌ కలబోస్తే ఆమె.. నటన కోసం పాఠశాలనే విడిచిపెట్టిన 'సితార'
Bhanupriya

Bhanupriya : అందమైన రూపం.. అద్భుత డ్యాన్స్‌ కలబోస్తే ఆమె. నటన కోసం పాఠశాలనే విడిచిపెట్టింది. సహజనటిగా ఎదిగి తనకంటూ ఓ ఇమేజ్‌ని సృష్టించుకుంది. ఆమె ఎవరో కాదు సౌత్‌ సూపర్‌ స్టార్ భానుప్రియ. ఈ రోజు తన 58 వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఈమె సోషల్ మీడియాని వాడదు. దానిపై ఎలాంటి ఆసక్తి కూడా చూపదు. భానుప్రియ అనేక తమిళ, తెలుగు, కన్నడ చిత్రాలలో నటించింది. ఈమె మంచి ట్రెండ్‌ డాన్సర్‌తో పాటు సింగర్‌ కూడా. భానుప్రియ 155 కంటే ఎక్కువ చిత్రాలలో నటించింది. ఈ నటి దక్షిణాదిలోనే కాకుండా అనేక హిందీ చిత్రాలలో కూడా పనిచేసింది. భానుప్రియ కేవలం 17 ఏళ్లకే నటన ప్రపంచంలోకి అడుగుపెట్టింది. 1983లో విడుదలైన ‘మెల్ల పెసుంగళ్’ ఆమె తొలి చిత్రం. ఈ నటి 90వ దశకంలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

సినిమాల కోసం చదువుని వదిలేసింది..

భానుప్రియ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆమె స్కూల్‌లో చదువుతున్నప్పుడే ఆమెకి మొదటి సినిమా అవకాశం వచ్చింది. ఎందుకంటే అప్పటికే ఆమెకి డ్యాన్స్ తెలుసు కాబట్టి వారి పని సులువు అవుతుందనుకున్నారు. కానీ ఫోటోషూట్ సమయంలో ఆమె చాలా చిన్నదానిలా కనిపించడంతో ఆ చిత్రానికి తీసుకోలేదు. అయితే మళ్లీ స్కూల్‌కి వెళితే అందరూ ఎగతాళి చేస్తారనే భావనతో భానుప్రియ చదువు మానేసింది. ఇంతలో భానుప్రియ ఫోటోషూట్‌లు ఆమెకు మరిన్ని సినిమా అవకాశాలను తెచ్చిపెట్టాయి. దీంతో ఇండస్ట్రీలో ఆమె విజయాన్ని ఎవరూ అడ్డుకోలేకపోయారు.

భానుప్రియ మొదటి సినిమా పెద్దగా ఆడలేదు కానీ ఆమెకు వాసమి గురు ‘సితార’ ఆఫర్ వచ్చింది. ఈ సినిమా మంచి హిట్‌గా నిలిచింది. సితార ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డును అందుకుంది. ఈ నటి 1986లో ‘దోస్తీ దుష్మణి’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తరువాత ఆమె ‘ఇన్సాన్ కి పుకార్’, ‘దవా పెంచ్’, ‘పూర్ కా దాతా’, ‘కసమ్ వర్ది కి’ వంటి అనేక చిత్రాలలో నటించింది. తనకు ఓ ఎన్నారై అబ్బాయి అంటే ఇష్టమని, ఇద్దరి కుటుంబాలు పెళ్లికి సిద్ధంగా లేవని భానుప్రియ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తర్వాత భాను 1998లో కాలిఫోర్నియాలో పెళ్లి చేసుకుంది. 2005లో ఈమెకు ఒక కుమార్తె జన్మించింది. అయితే పెళ్లయిన ఏడేళ్ల తర్వాత అంటే 2007లో భర్తతో విడాకులు తీసుకుంది.

Insurance: కొవిడ్‌ నుంచి కోలుకున్నవారు ఇన్సూరెన్స్‌ పాలసీ పొందడం కష్టమే..! ఎందుకో తెలుసా..?

Mutual Fund: మ్యూచువల్ ఫండ్స్‌ ద్వారా డబుల్‌ ప్రాఫిట్‌.. పిక్స్‌డ్‌ డిపాజిట్ల కంటే చాలా రెట్లు ఎక్కువ.. ఎలాగంటే..?

Diabetes: మధుమేహ వ్యాధిగ్రస్తులకు శుభవార్త.. 30 నిమిషాల్లో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించవచ్చు..!

Published On - 9:16 am, Sat, 15 January 22

Click on your DTH Provider to Add TV9 Telugu