AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: మధుమేహ వ్యాధిగ్రస్తులకు శుభవార్త.. 30 నిమిషాల్లో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించవచ్చు..!

Diabetes: మధుమేహం అనేది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేసే ఒక ఆరోగ్య పరిస్థితి. దీనివల్ల ఇతర రోగాలు సంభవిస్తున్నాయి.

Diabetes: మధుమేహ వ్యాధిగ్రస్తులకు శుభవార్త.. 30 నిమిషాల్లో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించవచ్చు..!
Gymnema
uppula Raju
|

Updated on: Jan 15, 2022 | 7:45 AM

Share

Diabetes: మధుమేహం అనేది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేసే ఒక ఆరోగ్య పరిస్థితి. దీనివల్ల ఇతర రోగాలు సంభవిస్తున్నాయి. దీనికి ఇప్పటివరకు కచ్చితమైన మందు అంటూ ఏదీలేదు. జిమ్నెమా సిల్వెస్ట్రే అనేది మలేరియా, పాముకాటు నివారణకు ఉపయోగించే ఒక మొక్క. ఇప్పుడు ఇది యాంటీ-డయాబెటిక్ లక్షణాలకు గుర్తింపు పొందింది. దీనిపై పరిశోధకులు మరింత పరిశోధన చేస్తున్నారు. ఒక పరిశోధనలో ఈ మొక్క రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుందని నిరూపణ అయింది. ఇది 22 మంది రోగులపై అధ్యయనం చేయడం ద్వారా తేలింది.

టైప్ 2 డయాబెటిస్ ఉన్న వ్యక్తులు 18 నుంచి 20 నెలల పాటు ప్రతిరోజూ 400 mg జిమ్నెమా లీఫ్ సారం తీసుకుంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్‌లో 29 శాతం తగ్గుదల ఉందని పరిశోధనలు వెల్లడించాయి. ఈ మొక్కలో జిమ్నెమిక్ యాసిడ్ అనే రసాయనం ఉందని ఇది చక్కెర రుచిని అణిచివేస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఇది మధుమేహం చికిత్సలో ఉపయోగకరంగా ఉంటుందని భావించారు. ఎందుకంటే ఇది కోరికలను తగ్గిస్తుంది. జిమ్నెమా సిల్వెస్ట్రే చక్కెర కోరికలను తగ్గించడమే కాకుండా శరీరంలోకి చక్కెర, కొవ్వు శోషించబడే రేటును కూడా తగ్గిస్తుంది. దీనివల్ల ఊబకాయం, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ చికిత్సకు ఉపయోగపడుతుంది. ఈ ప్రభావాలు 30 సెకన్లలోపు ప్రారంభమవుతాయి. అరగంట వరకు ఉంటాయి.

జిమ్నెమా సిల్వెస్ట్రే అనేది ఇన్సులిన్ సెన్సిటైజర్. దీనిని డయాబెటిస్ రోగులపై అధ్యయనం చేశారు. గుర్మార్ లేదా గుర్మోర్ ఆకులలో రెసిన్లు, అల్బుమిన్, క్లోరోఫిల్, కార్బోహైడ్రేట్లు, టార్టారిక్ యాసిడ్, ఫార్మిక్ యాసిడ్, బ్యూట్రిక్ యాసిడ్, ఆంత్రాక్వినోన్ ఉన్నాయి. గుర్మార్ అనేది ఆయుర్వేద వైద్యంలో వేల సంవత్సరాలుగా ఉపయోగించే ఒక తీగజాతికి చెందిన మొక్క ఈ ఔషధం సంప్రదాయకంగా మలేరియా, పాముకాటుకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. అదే సమయంలో ఇది యాంటీ-డయాబెటిక్ లక్షణాలకు కూడా ప్రసిద్ది చెందింది. జిమ్నెమా సిల్వెస్ట్రే హైపోగ్లైకేమియాకు కారణం కాకుండా గ్లూకోజ్-తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది ఆకలిని, తీపి కోరికలను తగ్గిస్తుంది. జిమ్నెమా సిల్వెస్ట్రే, బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

PF Transfer: రెండు, మూడు ఉద్యోగాలు మారారా..? పీఎఫ్‌ బదిలీ గురించి ముఖ్యమైన వివరాలు తెలుసుకోండి..

Pakistan: భూకంపంతో వణికిపోయిన పాకిస్తాన్.. రిక్టర్‌ స్కేల్‌పై 5.6 తీవ్రత..

Indian Passport: పాస్‌పోర్ట్‌ ఉన్నవారికి శుభవార్త.. వీసా లేకుండా 59 దేశాలు తిరగవచ్చు.. ఎలాగంటే..?