Indian Passport: పాస్‌పోర్ట్‌ ఉన్నవారికి శుభవార్త.. వీసా లేకుండా 59 దేశాలు తిరగవచ్చు.. ఎలాగంటే..?

Indian Passport: మీరు భారతీయులైతే మీకు భారతీయ పాస్‌పోర్ట్ ఉంటే ఇది శుభవార్తే అని చెప్పవచ్చు. వాస్తవానికి హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ విడుదల

Indian Passport: పాస్‌పోర్ట్‌ ఉన్నవారికి శుభవార్త.. వీసా లేకుండా 59 దేశాలు తిరగవచ్చు.. ఎలాగంటే..?
Passport

Indian Passport: మీరు భారతీయులైతే మీకు భారతీయ పాస్‌పోర్ట్ ఉంటే ఇది శుభవార్తే అని చెప్పవచ్చు. వాస్తవానికి హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ విడుదల చేసిన 2022 ర్యాంకింగ్స్‌లో భారతీయ పాస్‌పోర్ట్‌కి 83వ స్థానం లభించింది. గతేడాది భారత్ 90వ స్థానంలో నిలిచింది. తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ 7 స్థానాలు మెరుగుపరుచుకుంది. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రపంచంలోని మొత్తం 199 దేశాల ర్యాంకింగ్‌ను విడుదల చేస్తుంది. ఇందులో ర్యాంక్‌ ఎంత మెరుగ్గా ఉంటే ఆ దేశ పాస్‌పోర్ట్ అంత శక్తి వంతమైనదని అర్థం. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో జపాన్, సింగపూర్ పాస్‌పోర్ట్‌లు మొదటి స్థానంలో ఉన్నాయి. కాబట్టి ఈ రెండు దేశాల పాస్‌పోర్ట్‌లు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లు.

భారతదేశ పాస్‌పోర్ట్‌తో వీసా లేకుండా ఎన్ని దేశాల్లో ప్రయాణం చేయవచ్చు హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) డేటా ఆధారంగా పాస్‌పోర్ట్‌ల ర్యాంకింగ్‌ను విడుదల చేస్తుంది. మీరు వీసా లేకుండా కేవలం పాస్‌పోర్ట్‌తో ఎన్ని దేశాలకు ప్రయాణించవచ్చనే విషయాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు జపాన్, సింగపూర్ పాస్‌పోర్ట్‌లతో ప్రపంచంలోని 192 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. కాబట్టి ఈ రెండు దేశాల పాస్‌పోర్ట్‌లు ర్యాంకింగ్‌లో మొదటి స్థానంలో ఉన్నాయి. అందువల్ల జపాన్, సింగపూర్ పాస్‌పోర్ట్‌లు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లు.

ఈ ర్యాంకింగ్‌లో భారతదేశ పాస్‌పోర్ట్ 83వ స్థానంలో ఉంది. భారతీయ పాస్‌పోర్ట్ ద్వారా ప్రపంచంలోని 59 దేశాల్లో వీసా ఫ్రీ ప్రయాణం చేయవచ్చు. గత సంవత్సరం భారతదేశ పాస్‌పోర్ట్ 90వ స్థానంలో ఉన్నప్పుడు మొత్తం 58 దేశాలకు వీసా రహిత ప్రయాణాన్ని అనుమతించింది. ఇప్పుడు ఒమన్ భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్‌లను వీసా లేకుండా ప్రయాణించడానికి అనుమతించింది. భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు ఈ దేశాలలో వీసాలేకుండా ప్రయాణించవచ్చు.

కుక్ దీవులు, ఫిజీ, మార్షల్ దీవులు, మైక్రోనేషియా, నియు, పలావు దీవులు, సమోవా, తువాలు, వనాటు, ఇరాన్, జోర్డాన్, ఒమన్, ఖతార్, అల్బేనియా, సెర్బియా, బార్బడోస్, బ్రిటిష్ వర్జిన్ దీవులు, డొమినికా, గ్రెనడా, హైతీ, జమైకా, మోంట్‌సెరాట్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్, ట్రినిడాడ్ మరియు టొబాగో, భూటాన్, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మకావు, మాల్దీవులు, మయన్మార్, నేపాల్, శ్రీలంక థాయిలాండ్, తైమూర్-లెస్టే, బొలీవియా, ఎల్ సాల్వడార్, బోట్స్వానా, కేప్ వెర్డే దీవులు, కొమోరెస్ దీవులు, ఇథియోపియా, గాబన్, గినియా-బిస్సావు, మడగాస్కర్, మౌరిటానియా, మారిషస్, మొజాంబిక్, రువాండా, సెనెగల్, సీషెల్స్, సోమల్ టోగోనాజానియా, సెరా లియోన్ , మరియు ట్యునీషియా, ఉగాలో మీరు ఉచితంగా ప్రయాణించవచ్చు.

క్లాత్‌ మాస్క్‌ వాడుతున్నారా.. N95 మాస్క్ వాడుతున్నారా..! పరిశోధనలో షాకింగ్‌ నిజాలు..

BSNL: నాలుగు కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టిన BSNL .. జియో, ఎయిర్‌టెల్‌కి గట్టి పోటీ..

Booster Shot Scam: బూస్టర్ డోస్‌ స్కామ్‌.. వీరిని అస్సలు నమ్మకండి.. లేదంటే డబ్బులు మాయం..

Click on your DTH Provider to Add TV9 Telugu