Booster Shot Scam: బూస్టర్ డోస్‌ స్కామ్‌.. వీరిని అస్సలు నమ్మకండి.. లేదంటే డబ్బులు మాయం..

Booster Shot Scam: 60 ఏళ్లు పైబడిన పౌరుల కోసం ప్రభుత్వం ముందుజాగ్రత్తగా బూస్టర్ డోస్ అందించడం ప్రారంభించింది. ఓమిక్రాన్ కేసులు

Booster Shot Scam: బూస్టర్ డోస్‌ స్కామ్‌.. వీరిని అస్సలు నమ్మకండి.. లేదంటే డబ్బులు మాయం..
Booster Shot Scam
Follow us

|

Updated on: Jan 12, 2022 | 3:42 PM

Booster Shot Scam: 60 ఏళ్లు పైబడిన పౌరుల కోసం ప్రభుత్వం ముందుజాగ్రత్తగా బూస్టర్ డోస్ అందించడం ప్రారంభించింది. ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రజలు బూస్టర్ డోస్‌ పొందడానికి హడావిడిగా ఉన్నారు. అయితే సైబర్ నేరగాళ్లు ఇదే అదనుగా వారిని మోసం చేసే పనిలో పడ్డారు. బూస్టర్ డోస్‌కి సంబంధించిన వివరాలను అందించే నెపంతో వ్యక్తుల నుంచి కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. అనంతరం బాధితుడి బ్యాంకు ఖాతా నుంచి డబ్బులను కాజేస్తున్నారు.

బూస్టర్ డోస్‌ స్కామ్ ఎలా జరుగుతుంది మోసగాళ్లు ముందుగా మీకు కాల్ చేసి తమను తాము ప్రభుత్వ ఉద్యోగులుగా చెప్పుకుంటారు. వీరు ఎక్కువగా సీనియర్ సిటిజన్లను ఎంచుకుంటారు. ఫోన్‌లో రెండు డోసుల టీకాలు పూర్తి చేశారా అని అడుగుతారు. కొన్ని సందర్భాల్లో మీకు సంబంధించిన పూర్తి సమాచారం కలిగి ఉంటారు. మీ పేరు, వయస్సు, చిరునామా, ఇతర వివరాలు అన్ని తెలియజేసి నిజమైనవారిలా నమ్మిస్తారు. అంతేకాదు మీరు టీకా వేసుకున్న తేదీని కూడా చెబుతారు.

తర్వాత బూస్టర్ డోస్‌ పొందడానికి ఆసక్తి కలిగి ఉన్నారా లేదా అని అడుగుతారు. స్లాట్‌ను బుక్ చేయాలని చెప్పి తేదీ, సమయాన్ని నిర్దారిస్తాడు. అనంతరం మీ మొబైల్‌కి వచ్చే OTP అడుగుతాడు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఈ OTP మీ ఖాతా నుంచి డబ్బు కాజేయడానికి ఉపయోగిస్తారు. మీరు వారికి OTP చెప్పగానే మీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు కట్‌ అయినట్లు మీకు మెస్సేజ్ వస్తుంది.

ఈ స్కామ్‌కి బలి కాకుండా ఎలా ఉండాలి ప్రభుత్వం ఫోన్ కాల్స్ ద్వారా వ్యాక్సిన్ స్లాట్‌లను బుక్ చేయదని తెలుసుకోండి. మీరు కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం స్లాట్‌ను బుక్ చేయాలనుకుంటే http://cowin.gov.inని సందర్శించవచ్చు. ఆరోగ్య సేతు మొబైల్ అప్లికేషన్ ద్వారా సందర్శించవచ్చు. ఒకవేళ మీరు వీటి ద్వారా స్లాట్‌ను బుక్ చేయలేకపోతే ఏదైనా టీకా కేంద్రంలోకి వెళ్లి బూస్టర్ డోస్ పొందవచ్చు. ప్రజలు సాధారణంగా OTPతో పాటు వచ్చే సందేశాన్ని తప్పకుండా చదవాలి. మీరు మీ వన్-టైమ్ పాస్‌వర్డ్‌ను ఎవరితోనూ చెప్పకూడదని గుర్తుంచుకోండి.

హైహీల్స్ వేసుకునే మహిళలు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి..! ఏంటంటే..?

చికెన్, మొక్కజొన్న సూప్‌తో జలుబుకి చెక్..! ఇంట్లోనే ఇలా తయారుచేయండి..?

కొత్త ఫోన్ కొనేముందు ఒక్కసారి ఆలోచించండి.. ఈ 5 విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ