చికెన్, మొక్కజొన్న సూప్‌తో జలుబుకి చెక్..! ఇంట్లోనే ఇలా తయారుచేయండి..?
Sweet Corn Chicken Soup: చలికాలం వేడి వేడిగా ఏదైనా తినాలని ఉంటుంది. శరీరాన్ని లోపలి నుంచి ఎంత ఆరోగ్యంగా ఉంచుకుంటే అంత ఎక్కువ
Sweet Corn Chicken Soup: చలికాలం వేడి వేడిగా ఏదైనా తినాలని ఉంటుంది. శరీరాన్ని లోపలి నుంచి ఎంత ఆరోగ్యంగా ఉంచుకుంటే అంత ఎక్కువ వ్యాధులు మన నుంచి దూరమవుతాయి. ఈ సీజన్‌లో ప్రజలు తరచుగా జలుబు సమస్యను ఎదుర్కొంటారు. దాని నుంచి బయటపడటానికి హోమ్ రెమిడీస్ సహాయం తీసుకుంటారు.అయితే మీరు మొక్కజొన్, చికెన్ సూప్‌తో కూడా జలుబుకి చెక్ పెట్టొచ్చు. చాలా మంది దీనిని బయటి నుంచి ఆర్డర్ చేయడానికి ఇష్టపడతారు. మొక్కజొన్న చికెన్ సూప్ తయారీకి గంట సమయం పడుతుంది. మీకు కావలసిందల్లా ఉల్లిపాయలు, క్యారెట్లు, సెలెరీ, స్వీట్ కార్న్, వెన్న, చికెన్ స్టాక్‌తో తురిమిన చికెన్. మీరు దీన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం ఇంట్లోనే తయారు చేయవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు మూడు కప్పుల చికెన్ స్టాక్, 250 గ్రాములు తురిమిన చికెన్, లిటిల్ స్వీట్ కార్న్, తరిగిన పచ్చి ఉల్లిపాయ, అల్లం-వెల్లుల్లి, ఒక గుడ్డు, ఒక టీస్పూన్ మొక్కజొన్న పిండి, రుచికి సరిపడ ఉప్పు
ఎలా చేయాలి
1. ఒక పాత్రలో నూనె వేసి వేడయ్యాక అందులో తరిగిన ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.
2. కాసేపు వేగిన తర్వాత అందులో చికెన్ ముక్కలు వేసి ఒక నిమిషం ఉడికించాలి.
3. ఇప్పుడు అందులో స్వీట్ కార్న్ వేసి చికెన్ స్టాక్ కూడా వేయాలి.
4. అలాగే అందులో కొన్ని నీళ్లు పోసి మరిగించాలి.
5. అలాగే కార్న్‌ఫ్లోర్‌ను మధ్యలో వేయాలి. ఇది సూప్ చిక్కగా రావడానికి సహాయపడుతుంది.
6. ఒక గుడ్డును అందులో కొట్టి, చెంచాతో బాగా కలపాలి.
7. తక్కువ మంటపై కొద్దిసేపు ఉడికించాలి. అంతే మీ సూప్ సిద్ధంగా ఉంటుంది.