కొత్త ఫోన్ కొనేముందు ఒక్కసారి ఆలోచించండి.. ఈ 5 విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి..

New Phone: భారతీయ మొబైల్ మార్కెట్‌లో లెక్కలేనన్ని స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు రూ.5000 నుంచి రూ.లక్ష వరకు అందుబాటులో ఉన్నాయి.

కొత్త ఫోన్ కొనేముందు ఒక్కసారి ఆలోచించండి.. ఈ 5 విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి..
Phone
Follow us
uppula Raju

|

Updated on: Jan 12, 2022 | 12:10 PM

New Phone: భారతీయ మొబైల్ మార్కెట్‌లో లెక్కలేనన్ని స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు రూ.5000 నుంచి రూ.లక్ష వరకు అందుబాటులో ఉన్నాయి. వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి. పీచర్స్‌, ధరలు కూడా వేరుగా ఉంటాయి. అయితే కొత్త స్మార్ట్‌ ఫోన్ కొనేవారు ఎటువంటి ప్లాన్ లేకుండా హడావిడిగా కొనేస్తారు. దానివల్ల ఒక్కోసారి నష్టం ఏర్పడవచ్చు. అందకే మొబైల్‌ కొనేవారు కచ్చితంగా నాలుగు విషయాలను గుర్తుపెట్టుకోవాలి. అవేంటో తెలుసుకుందాం.

1. బడ్జెట్‌ను సెట్ చేయండి

కొత్త మొబైల్ ఆలోచన మనసులో ఉంటే ముందుగా మీ బడ్జెట్ ఎంత అని ఆలోచించండి. వాస్తవానికి తరచుగా ప్రజలు తమ బడ్జెట్ కంటే ఎక్కువగా ఫోన్‌లను కొనుగోలు చేస్తారు. తర్వాత దాని వాయిదాలను చెల్లించడానికి ఇబ్బంది పడుతారు. అందువల్ల ఏ ఫోన్ కొనాలి, ఎంతలో కొనాలనే ఒక ఆలోచన కచ్చితంగా ఉండాలి.

2. వాటి అవసరం ఉందా..

ఏదైనా స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే ముందు ఆ ఖరీదైన ఫోన్ మీ అవసరాన్ని తీరుస్తుందా లేదా అందులో మీ ఉపయోగం లేని ఫీచర్లు ఏమైనా ఉన్నాయా ఆలోచించండి. చాలా మంది వ్యక్తులు ఫోన్‌లో క్వాలిటీ వీడియోలు, సినిమాలు చూడకపోయినా కూడా నెట్‌ఫ్లిక్స్ లాంటివాటికి సపోర్ట్‌ చేసే HDR 10 ఫోన్‌ని తీసుకుంటారు.

3. గేమింగ్ ఫోన్‌ కొనేముందు ఆలోచించండి

భారతదేశంలోని చాలా మంది యువత ఫోన్‌లో గేమ్‌లు ఆడతారు కొంతమంది వృద్ధులు కూడా PUBG వంటి బ్యాటిల్ గ్రౌండ్‌ను ఆస్వాదిస్తారు. అప్పుడు గేమింగ్ ఫోన్ వారికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు. కానీ గేమింగ్ చేసే వారు వాటికి బానిసలు కాకూడదు. అందుకే గేమింగ్ ఫోన్‌లను తీసుకోవడం మానుకుంటే మంచిది.

4. సెక్యూరిటీ ఫీచర్లు ఏంటి..?

మీరు ఫోన్‌లో బ్యాంకింగ్ మొదలైనవాటిని ఉపయోగించాలనుకుంటే ఫోన్‌లో ఉన్న సెక్యూరిటీ ఫీచర్‌లను తెలుసుకోండి. ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐరిష్ స్కానర్, ఫేస్ లాక్ వంటి ఫీచర్లు ఉన్నాయా లేదా చెక్‌ చేసుకోవాలి.

5. ఆఫ్‌లైన్‌ ఫోన్లు

Oppo, Vivo వంటి ఫోన్‌లు ఆఫ్‌లైన్ మార్కెట్లో బలమైన డిజైన్‌లను అందించడానికి ప్రయత్నిస్తాయి. అంతేకాదు అనేక బ్రాండ్‌లు బలమైన స్పెసిఫికేషన్‌లపై దృష్టి పెడతాయి. వాటి గురించి పూర్తిగా తెలుసుకొని మాత్రమే కొనుగోలు చేయాలి.

Eyes: చలికాలంలో కళ్లు జాగ్రత్త.. పట్టించుకోకపోతే ఈ సమస్యలు తప్పవు.. అవేంటంటే..?

NEET PG కౌన్సెలింగ్ షురూ.. డాక్యుమెంట్లు, ఫీజు గురించి తెలుసుకోండి..

వర్క్ ఫ్రమ్ హోమ్‌ చేసేవారు అలర్ట్‌..! ఎక్కువ మంది దీని భారిన పడుతున్నారు..?