NEET PG కౌన్సెలింగ్ షురూ.. డాక్యుమెంట్లు, ఫీజు గురించి తెలుసుకోండి..
NEET PG కౌన్సెలింగ్ 2021 ఈరోజు (జనవరి 12) నుంచి ప్రారంభమవుతుంది. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) mcc.nic.in లో నమోదు ప్రక్రియను
NEET PG కౌన్సెలింగ్ 2021 ఈరోజు (జనవరి 12) నుంచి ప్రారంభమవుతుంది. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) mcc.nic.in లో నమోదు ప్రక్రియను ప్రారంభిస్తుంది . NEET PG 2021లో అర్హత సాధించిన అభ్యర్థులు రూల్ నంబర్, పుట్టిన తేదీ ఆధారాలను ఉపయోగించి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నీట్ పీజీ కౌన్సెలింగ్ 2021 షెడ్యూల్ , నమోదు ప్రక్రియ జనవరి 12 నుంచి జనవరి 17, 2022 వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు జనవరి 13 నుంచి జనవరి 17, రాత్రి 11:55 గంటల వరకు ఎంపికలను పూర్తి చేయాలి.
MD, MS, డిప్లొమా, PG DNB కోర్సుల కోసం నమోదు చేసుకునే అభ్యర్థులు రెండు రకాల రిజిస్ట్రేషన్ ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. UR/EWS అభ్యర్థులకు నాన్ రీఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1000, SC/ST/OBC/PwD అభ్యర్థులు రూ. 500, డీమ్డ్ యూనివర్సిటీ అభ్యర్థులు రూ. 5,000. చెల్లించాల్సి ఉంటుంది. అలాగే UR/EWS అభ్యర్థులు రూ. 25,000 రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి, SC/ST/OBC/PwD కేటగిరీ అభ్యర్థులు రూ. 10,000, డీమ్డ్ యూనివర్సిటీ అభ్యర్థులకు రూ. 2 లక్షలు చెల్లించాలి. కేటాయించిన కళాశాలలో చేరిన తర్వాత లేదా కౌన్సెలింగ్ సమయంలో అభ్యర్థికి సీటు రాకుంటే సెక్యూరిటీ డిపాజిట్ అభ్యర్థులకు తిరిగి చెల్లిస్తారు.
అవసరమైన డాక్యుమెంట్లు
అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయంలో సీట్ల కేటాయింపు సమయంలో MCC అడిగిన డాక్యుమెంట్లను సమర్పించవలసి ఉంటుంది. కింది పత్రాల సెట్‌ను దగ్గరు ఉంచుకుంటే మంచిది.
1. NEET PG 2021 ఫలితం/స్కోర్‌కార్డ్
2. NEET PG 2021 అడ్మిట్ కార్డ్
3. విద్యా ధృవీకరణ పత్రాలు
4. కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే)
5. PwD సర్టిఫికేట్ (అవసరమైతే)
6. ID రుజువు పత్రాలు
అడ్మిషన్/సీట్ అలాట్‌మెంట్ సమయంలో అవసరమైన పత్రాల జాబితా
MCC అడ్మిషన్ సమయంలో అవసరమైన డాక్యుమెంట్ల వివరణాత్మక జాబితాను షేర్ చేసింది. వాటిలో కొన్ని
1. MCC జారీ చేసిన NEET PG 2021 కేటాయింపు లేఖ
2. NBE జారీ చేసిన NEET PG అడ్మిట్ కార్డ్
3. NEET PG ఫలితం/NBE జారీ చేసిన ర్యాంక్ లెటర్
4. MBBS/BDS 1వ, 2వ, 3వ ప్రొఫెషనల్ పరీక్షల మార్క్ షీట్‌లు
5. MBBS/BDS డిగ్రీ సర్టిఫికేట్/ప్రొవిజనల్ సర్టిఫికేట్
6. ఇంటర్న్‌షిప్ కంప్లీట్ సర్టిఫికేట్