వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు అలర్ట్..! ఎక్కువ మంది దీని భారిన పడుతున్నారు..?
Work From Home: ఈ కరోనా సమయంల చాలా కంపెనీలు తమ ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేస్తున్నారు.
Work From Home: ఈ కరోనా సమయంల చాలా కంపెనీలు తమ ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేస్తున్నారు. దీనివల్ల కొన్ని ప్రయోజనాలు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. దీనివల్ల ప్రజల జీవనశైలి అధ్వాన్నంగా మారుతోంది. శారీరక శ్రమ తగ్గిపోయి అనేక రోగాలు వారిని పట్టి పీడిస్తున్నాయి. ఈ వ్యాధులలో థైరాయిడ్, మధుమేహం, అధిక చక్కెర పేర్లు వినిపిస్తున్నాయి. ఈ వ్యాధులే కాకుండా చాలా సాధారణమైన వ్యాధి కూడా ఒకటి ఉంది. అది అందరిని తన గుప్పిట్లోకి తీసుకుంటోంది. అదే ఊబకాయం. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు దీని కారణంగా బరువు విపరీతంగా పెరుగుతారు. తర్వాత మోకాళ్ల నొప్పులు ఎదుర్కొంటారు. ఇలాంటి సమయంలో ఏం చేయాలో తెలుసుకుందాం.
1. అతి నిద్ర
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది. కానీ చాలా సార్లు ప్రజలు 9 నుంచి 10 గంటలు లేదా అంతకంటే ఎక్కువ నిద్రపోతారు. వర్క్ ఫ్రం హోం చేయడం వల్ల ఎక్కువసేపు పనిచేయడంతో చాలా అలసిపోతారు. దీంతో మీకు తెలియకుండానే ఎక్కువ సేపు నిద్రపోతారు. ఇది ఊబకాయానికి దారి తీస్తుంది.
2. తక్కువ నీరు
అన్ని రకాల వ్యాధుల నుంచి బయటపడటానికి నీరు ప్రభావవంతంగా పనిచేస్తుంది. బరువు తగ్గాలని ప్రయత్నించే వారు కూడా ఎక్కువ నీరు తాగాలని సూచిస్తారు. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ సమయంలో ప్రజలు పనిలో బిజీగా ఉండి నీరు తాగరు. తక్కువ నీరు తాగితే బరువు పెరుగుతారు గుర్తుంచుకోండి.
3. ఒకే చోట కూర్చొవడం
వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల ఒకే చోట కూర్చొని పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలు గంటల తరబడి ల్యాప్‌టాప్ లేదా పిసి ముందు కూర్చుంటారు. పని ఒత్తిడి కారణంగా ఒకే చోట కూర్చుంటున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మధ్యమధ్యలో విరామం తీసుకోవాలి తద్వారా శరీరం చురుకుగా ఉంటుంది. లేదంటే బరువు పెరుగుతారు. ఊబకాయం బారిన పడుతారు.
4. తిన్న తర్వాత నడవడం
చాలా మంది ప్రజలు ఆహారం తిని నేరుగా పీసీ వద్దకు వెళ్లడం, లేదా ల్యాప్‌టాప్ పట్టుకొని కూర్చుంటారు. ఇది మంచి పద్దతి కాదు. ఆహారం తిన్న తర్వాత దాదాపు 10 నిమిషాల పాటు నడవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే బరువు పెరుగుతారు. అంతేకాదు తిన్న ఆహారం కూడా సరైన సమయంలో జీర్ణం కాకుండా ఉంటుంది.