AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: గర్ల్‌ఫ్రెండ్‌తో స్టంట్‌ చేస్తే ఇలాగే ఉంటది.. ముక్కు, మూతి పగిలిపోతాయి.. పరేషాన్ వీడియో..

Viral Video: ప్రతిరోజు సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో కొన్ని వింతగా ఉంటే మరికొన్ని చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి.

Viral Video: గర్ల్‌ఫ్రెండ్‌తో స్టంట్‌ చేస్తే ఇలాగే ఉంటది.. ముక్కు, మూతి పగిలిపోతాయి.. పరేషాన్ వీడియో..
Boy Stunting
uppula Raju
|

Updated on: Jan 12, 2022 | 8:10 AM

Share

Viral Video: ప్రతిరోజు సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో కొన్ని వింతగా ఉంటే మరికొన్ని చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఇంకొన్ని చాలా భయంకరంగా ఉంటాయి. తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తుంది. ఈ వీడియో ఒక అబ్బాయి, ఒక అమ్మాయికి సంబంధించినది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలుసుకుందాం.

ప్రపంచ వ్యాప్తంగా బైక్‌లతో స్టంట్స్‌ చేయడం యూత్‌కి బాగా అలవాటైంది. అది ఒక స్టైల్‌గా ఫీలవుతున్నారు. కానీ తేడా వస్తే ప్రాణాలకే ప్రమాదం. తాజాగా ఒక అమ్మాయి, అబ్బాయి బైక్ స్టంట్‌కి సంబందించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియోలో ఒక అబ్బాయి. తన గర్ల్‌ఫ్రెండ్‌ బైక్‌పై జాలీగా వెళ్లడం మనం గమనించవచ్చు. కొంతదూరం వెళ్లిన తర్వాత అబ్బాయి బైక్‌ స్టంట్‌ చేయడానికి ప్రయత్నిస్తాడు. దీంతో ఇద్దరు ఘోరంగా రోడ్డుపై కిందపడిపోవడం మనం వీడియోలో చూడవచ్చు. అబ్బాయి అతి తెలివి వల్ల బైక్‌ తో పాటు ఇద్దరు దారుణంగా కిందపడిపోతారు.

బైక్‌ స్టంట్‌ అనేది ఒక ఆటకాదు. ఎలాంటి స్టంట్ చేయాలన్నా చాలా ప్రాక్టీస్ అవసరం. అప్పుడే వారికి పర్ఫెక్షన్ వస్తుంది. చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు పోతాయి. వీడియో చూసిన నెటిజన్లు చాలా దారుణంగా స్పందిస్తున్నారు.కొంతమంది తెలివి ఎక్కువైతే ఇలాగే ఉంటుందని అన్నారు. మరికొంతమంది కామెంట్ సెక్షన్‌లో లాఫింగ్ ఎమోజి పోస్ట్‌ చేశారు. కేవలం ఐదు సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు చాలా మంది వీక్షించారు. ఇందులో చాలామంది దీనిని లైక్‌ చేశారు. మీరు కూడా ఈ వీడియో చూస్తే మీ స్పందన తెలియజేయండి.

ఇల్లు అమ్మేసి బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టాడు.. నేడు ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఎదిగాడు..

Omicron: ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌.. అవయవాలపై పెద్ద దెబ్బ.. పరిశోధనలో షాకింగ్‌ నిజాలు..

IND vs SA: తొలిరోజు ముగిసిన ఆట.. సౌతాఫ్రికా ఒక వికెట్‌ నష్టానికి 17 పరుగులు