Omicron: ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌.. అవయవాలపై పెద్ద దెబ్బ.. పరిశోధనలో షాకింగ్‌ నిజాలు..

Omicron: ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రజలను వేగంగా తన ఆధీనంలోకి తీసుకుంటోంది. దీంతో జనాలు విపరీతమైన

Omicron: ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌.. అవయవాలపై పెద్ద దెబ్బ.. పరిశోధనలో షాకింగ్‌ నిజాలు..
Omicron
Follow us
uppula Raju

|

Updated on: Jan 12, 2022 | 6:59 AM

Omicron: ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రజలను వేగంగా తన ఆధీనంలోకి తీసుకుంటోంది. దీంతో జనాలు విపరీతమైన భయాలు, ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఇప్పటివరకు ఒమిక్రాన్ ప్రమాదకరమైనదా కాదా అనే అనుమానాలు అందరిలో నెలకొన్నాయి. దానికి ఈ పరిశోధనతో తెరపడినట్లయింది. వాస్తవానికి ఒమిక్రాన్ లక్షణాలు సాధారణంగానే ఉంటాయి. ఇది ఎటువంటి హాని కలిగించదు. కానీ అనారోగ్యానికి గురైన వ్యక్తులకు సోకితే మాత్రం ప్రమాదమని పరిశోధనలో తేలింది. అది ఏ విధంగా అనేది తెలుసుకుందాం.

ఒమిక్రాన్‌పై జర్మన్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. ఒమిక్రాన్ లక్షణాలు చూపించకపోయినా సోకిందంటే శరీరంపై దాని ప్రభావం కచ్చితంగా ఉంటుందని తేలింది. తేలికపాటి ఇన్ఫెక్షన్ కూడా శరీర భాగాలను దెబ్బతీస్తుందని కనుగొన్నారు. అధ్యయనం కోసం, 45 నుంచి 74 సంవత్సరాల వయస్సు గల మొత్తం 443 మందిని విస్తృతంగా పరిశీలించారు. ఇందులో ఒమిక్రాన్ సోకిన వారిలో అవయవ నష్టం జరుగుతుందని తేల్చారు.

యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. ఊపిరితిత్తుల పనితీరు మూడు శాతం తగ్గినట్లు కనుగొన్నారు. వాయుమార్గానికి సంబంధించిన సమస్యలు కూడా కనిపించాయి. తేలికపాటి లక్షణాలు, తక్కువ లక్షణాలతో సోకిన వారిపై చేసిన ఈ అధ్యయనంలో గుండెపై కూడా ఎఫెక్ట్‌ చూపిస్తుందని తేలింది. గుండె పంపింగ్ శక్తిలో సగటు తగ్గింపు 1 నుంచి 2 శాతం వరకు నమోదైంది. అయితే రక్తంలో ప్రోటీన్ స్థాయి 41 శాతం పెరిగినట్లు కనుగొన్నారు. ఇది గుండెపై ఒత్తిడిని సూచిస్తుంది.

పరిశోధనలో శాస్త్రవేత్తలు ఆందోళన కలిగించే మరో విషయం తెలుసుకున్నారు. అది కాళ్ళ సిరల్లో ఎక్కువ రక్తం గడ్డకట్టడం. అధ్యయనం ఫలితాల ప్రకారం లెగ్ వెయిన్ థ్రాంబోసిస్, అంటే కాళ్ళ సిరలలో రక్తం గడ్డకట్టడం, తేలికపాటి లేదా తక్కువ లక్షణాలు ఉన్న వ్యక్తులలో రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా కనిపించింది. లెగ్ సిరల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ఏర్పడే ప్రతిష్టంభన చాలా ప్రమాదకరం ఎందుకంటే కొన్నిసార్లు ఈ గడ్డ విడిపోయి పల్మనరీ ట్యూబ్‌లో అడ్డంకిగా ఏర్పడుతుంది. ఇది రోగికి ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉంటాయి.

IND vs SA: తొలిరోజు ముగిసిన ఆట.. సౌతాఫ్రికా ఒక వికెట్‌ నష్టానికి 17 పరుగులు

Amazon Republic Day Sale 2022: అమెజాన్ గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్.. నమ్మశక్యం కాని ఆఫర్లు..

సీనియర్ సిటిజన్లకు గుడ్‌న్యూస్‌.. త్వరలో ఆ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరిగే అవకాశం..