ఇల్లు అమ్మేసి బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టాడు.. నేడు ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఎదిగాడు..

Changpeng Zhao: ఖర్చుల కోసం పిజ్జా హోటల్‌లో పనిచేసిన వ్యక్తి నేడు ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఎదిగాడు. ఇల్లు అమ్మేసి బిట్‌కాయిన్‌లో పెట్టుబడి

ఇల్లు అమ్మేసి బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టాడు.. నేడు ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఎదిగాడు..
Changpeng

Changpeng Zhao: ఖర్చుల కోసం పిజ్జా హోటల్‌లో పనిచేసిన వ్యక్తి నేడు ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఎదిగాడు. ఇల్లు అమ్మేసి బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టి బిలియనీర్‌గా మారాడు. ఈ రోజు గూగుల్ వ్యవస్థాపకుడు లారీ పేజ్, ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ సరసన చేరాడు. అతడు మరెవరో కాదు చాంగ్‌పెంగ్‌ జావో (Changpeng Zhao). బినాన్స్ క్రిప్టో కరెన్సీ వ్యవస్థాపకుడు. జావో సంపద ఇప్పుడు 96 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. Binance కాయిన్ గత సంవత్సరం దాదాపు 1,300 శాతం పెరిగింది.

ఇప్పుడు జావో ఏకంగా యునైటెడ్ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)లో రాజకుటుంబీకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా పక్కన ఏకంగా ఓ అపార్ట్‌మెంట్‌నే సొంతం చేసుకున్నారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో భోజనాలు, వ్యాపార మంతనాలు చేస్తున్నారు. అలాగని ఆయన విలాసవంతమైన జీవితమేం గడపట్లేదు. కనీసం కారు కూడా లేదు. ఖరీదైన వాచ్‌లు, గ్యాడ్జెట్‌ల జోలికి అసలే వెళ్లరు. అతని పద్దతులు, సిద్దాంతులు వేరుగా ఉంటాయి. అయితే క్రిప్టో కరెన్సీ ఎప్పుడు ఎవ్వరిని మిలియనీర్‌గా మారుస్తుందో తెలియడం లేదు. దీనిని అర్థం చేసుకోవడానికి చాలామంది తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. కొందరేమో బాగా సంపాదిస్తుంటే మరికొందరేమో ఉన్నది పోగొట్టుకుంటున్నారు. కానీ జావోకి మాత్రం కలిసివచ్చిందనే చెప్పాలి.

బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ నివేదిక ప్రకారం.. ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజీల్లో ‘బినాన్స్‌’ (Binance) ఒకటి. దీని అధిపతి చాంగ్‌పెంగ్‌ జావో ప్రపంచ కుబేరుల్లో 11వ స్థానాన్ని సాధించాడని వెల్లడించింది. జావో నికర సంపద విలువను 96 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.7.2 లక్షల కోట్లు)గా బ్లూమ్‌బర్గ్‌ లెక్కగట్టింది. ఫలితంగా ఒరాకిల్‌ సహ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్‌ (107 బిలియన్‌ డాలర్లు-10వ స్థానం), రిలయన్స్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ (93 బిలియన్‌ డాలర్లు- 12వ స్థానం) మధ్య జావో చోటు పొందారు. టెక్‌ సంపన్నులు ఎలాన్‌ మస్క్‌, జెఫ్‌ బెజోస్‌, బిల్‌ గేట్స్‌, మార్క్‌ జుకర్‌బర్గ్‌ల సరసన జావో చేరడానికి, క్రిప్టో కరెన్సీల జోరు దోహదపడింది. క్రిప్టో వర్గాలు జావోను ‘సీజడ్ (CZ)’గా వ్యవహరిస్తుంటాయి. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన క్రిప్టో బిలియనీర్‌ కూడా జావోనే.

Omicron: ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌.. అవయవాలపై పెద్ద దెబ్బ.. పరిశోధనలో షాకింగ్‌ నిజాలు..

Amazon Republic Day Sale 2022: అమెజాన్ గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్.. నమ్మశక్యం కాని ఆఫర్లు..

RRB NTPC రిజల్ట్‌ డేట్‌ ప్రకటన.. CBT-2 షెడ్యూల్ కూడా తెలుసుకోండి..

Click on your DTH Provider to Add TV9 Telugu