Whatsapp Shortcuts: మీరు వాట్సాప్‌ ఉపయోగిస్తున్నారా..? ఈ షార్ట్‌కట్ కీ గురించి తెలుసుకోండి..!

Whatsapp Shortcuts: ప్రస్తుతం ప్రతి ఒక్కరు వినియోగించే స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్‌ తప్పనిసరి. ఇది లేకుండా ఉండలేని పరిస్థితిగా మారిపోయింది..

Whatsapp Shortcuts: మీరు వాట్సాప్‌ ఉపయోగిస్తున్నారా..? ఈ షార్ట్‌కట్ కీ గురించి తెలుసుకోండి..!
Follow us

|

Updated on: Jan 12, 2022 | 4:27 PM

Whatsapp Shortcuts: ప్రస్తుతం ప్రతి ఒక్కరు వినియోగించే స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్‌ తప్పనిసరి. ఇది లేకుండా ఉండలేని పరిస్థితిగా మారిపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వాట్సాప్‌ ఉపయోగించేవారు చాలా మంది ఉన్నారు. అయితే వర్క్‌ ఫ్రం హోం విధానం ఎక్కువైన తర్వాత వాట్సాప్‌ వినియోగం బాగా పెరిగింది. ఆఫీస్‌ వర్క్‌ కోసం డెస్క్‌టాప్‌లో ట్యాబ్‌లను ఓపెన్‌ చేసుకోవడంతో పాటు ‘వెబ్‌ వాట్సాప్‌’ను ఓ భాగం చేసుకుంటూ ఉంటాము. అయితే మెసేజ్ వచ్చిన ప్రతిసారి ఓపెన్‌ చేస్తుంటారు. దీని వల్ల సమయం వృథా అయ్యే అవకాశం ఉంది. అలాకాకుండా ముఖ్యమైన సందేశం వస్తేనే చూసుకోవడానికి నోటిఫికేషన్‌ అలర్ట్‌ను పెట్టుకోవచ్చు. అంతేకాకుండా వాట్సాప్‌ వెబ్ కోసం ప్రత్యేకంగా కొన్ని షార్ట్‌కట్‌లు ఉన్నాయి. అవి ఏమిటో ఓ సారి చూద్దాం..

మార్క్‌ యాజ్‌ అన్‌రీడ్‌: వాట్సాప్‌ గ్రూపుల్లో ఏదైనా మెసేజ్‌ వచ్చినప్పుడు ఓపెన్‌ చేసి చూస్తుంటాము. అప్పుడు పంపిన వ్యక్తికి మనం ఆ మెసేజ్‌ను చూసినట్లు తెలిసిపోతుంది. అలాకాకుండా మెసేజ్‌ను చూడకుండా ఉండేలా కూడా చేయవచ్చు. ctrl+alt+shift+u క్లిక్‌ చేస్తే అన్‌రీడ్‌ మోడ్‌లోకి మారిపోతుంది.

సెర్చ్‌ చాట్‌: వాట్సాప్‌ గ్రూపుల్లోని చాటింగ్‌ సెక్షన్‌లో సెర్చ్‌ చేసుకోవడం సులభంగా చేసుకోవచ్చు. చాటింగ్ సెక్షన్‌ కోసం ctrl+alt+shift+f క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

న్యూ గ్రూప్‌, న్యూ చాట్‌: అయితే కొత్తగా గ్రూప్‌ క్రియేట్‌ చేసుకునేందుకు ctrl+alt+shift+N క్లిక్‌ చేయాలి. ఇక న్యూ చాట్‌ కోసం ctrl+alt+N ప్రెస్ చేయాల్సి ఉంటుంది.

ఎగ్జిట్‌ గ్రూప్‌: ఏదైనా గ్రూపు నుంచి బయటకు వెళ్లిపోవాలంటే సాధారణంగా గ్రూప్‌లోని మూడు చుక్కలపై క్లిక్‌ చేసి ఎగ్జిట్‌ గ్రూప్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ctrl+alt+Backspace ప్రెస్ చేస్తే సరిపోతుంది. వ్యక్తిగత చాట్‌లో మెసేజ్‌లను క్లియర్‌ చేసుకోవడానికి దీనిని వాడుకోవచ్చు.

మ్యూట్‌ : ఒక గ్రూప్‌ నుంచి వచ్చే నోటిఫికేషన్స్‌ను మ్యూట్‌ చేయాలంటే సింపుల్‌. ctrl+alt+shift+M ప్రెస్‌ చేస్తే సరిపోతుంది.

ఇన్‌క్రీజ్‌ లేదా డిక్రీజ్‌ స్పీడ్‌ ఆప్‌ సెలెక్టెడ్‌ వాయిస్‌ మెసేజ్‌ : మీరు ఎంచుకున్న వాయిస్ మెసేజ్‌ స్పీడ్‌ను పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి కూడా ఆప్షన్‌ ఉంది. shift+. ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

పిన్‌ చాట్‌: సాధారణంగా ముఖ్యమైన వాట్సాప్‌ గ్రూపులు ఉంటే మనకు ఎప్పుడు ముందు కనిపించేలా పిన్‌ చాట్‌ చేస్తుంటాము. ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని కోసం షార్ట్‌కట్‌లో ctrl+alt+shift+p క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

సెట్టింగ్స్‌ : వాట్సాప్‌ సెట్టింగ్‌లోకి వెళ్లాలంటే ఏవేవో నొక్కాల్సిన అవసరం లేదు. ముందుగా మెనూలోకి వెళ్లి సెట్టింగ్స్‌పై క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. అలాంటిదేమి ఉండకుండా డైరెక్ట్‌గా వెళ్లాలంటే ctrl+alt+, క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

ప్రొఫైల్‌ అండ్‌ ఎబౌట్‌ : యూజర్‌ ప్రొఫైల్‌ అండ్‌ ఎబౌట్‌ సెక్షన్‌కు వెళ్లేందుకు సింపుల్‌గా ఉంటుంది. ctrl+alt+P క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

ఆర్కివ్‌ చాట్‌: మామూలుగా డెస్క్‌టాప్‌లో ఏదైనా గ్రూప్‌ను గానీ, వ్యక్తిగత చాటింగ్‌ను ఆర్కివ్‌ చేయాలంటే సులభం చేసుకోవచ్చు. అందుకు ctrl+alt+e క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

ఇవి కూడా చదవండి:

Mobile Airplane Mode: విమాన ప్రయాణంలో ఫోన్‌లను స్విచ్‌ఆఫ్‌, ఫ్లైట్ మోడ్‌లో ఎందుకు పెడతారు..? కారణాలు ఏమిటి..?

Clouds: మేఘాలు ఎంత బరువు ఉంటాయి..? అవి ఎందుకు కింద పడవు.. బరువు తెలుసుకోవడం ఎలా..?

బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి