Mobile Airplane Mode: విమాన ప్రయాణంలో ఫోన్‌లను స్విచ్‌ఆఫ్‌, ఫ్లైట్ మోడ్‌లో ఎందుకు పెడతారు..? కారణాలు ఏమిటి..?

Mobile Airplane Mode:విమానాలలో ప్రయాణించేటప్పుడు ఫోన్‌లు స్విచ్‌ ఆఫ్‌ చేయడం, లైదా ప్లైట్‌మోడ్‌లో పెట్టడం తప్పనిసరి. అయితే..

Mobile Airplane Mode: విమాన ప్రయాణంలో ఫోన్‌లను స్విచ్‌ఆఫ్‌, ఫ్లైట్ మోడ్‌లో ఎందుకు పెడతారు..? కారణాలు ఏమిటి..?
Follow us
Subhash Goud

|

Updated on: Jan 11, 2022 | 8:56 AM

Mobile Airplane Mode:విమానాలలో ప్రయాణించేటప్పుడు ఫోన్‌లు స్విచ్‌ ఆఫ్‌ చేయడం, లైదా ప్లైట్‌మోడ్‌లో పెట్టడం తప్పనిసరి. అయితే విమానయానపు తొలి నాళ్ళలో మొబైల్ ఫోన్ల వలన విమానంలోని ఎలక్ట్రానిక్ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోయే ప్రమాదం ఉందని భావించారు. అందువలన విమానంలో ఫోన్లను వాడడం నిషేధించారు. అయితే ఇప్పుడు విమానాల సాంకేతిక వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందింది. ఒక్క మొబైల్ ఫోనుతో విమానంలోని ఎలక్ట్రానిక్స్ ను పాడుచేసి దాన్ని కూల్చగలిగితే టెర్రరిస్టుల పని ఎంతో సులభమై ఉండేది. అదృష్టవశాన ఇప్పటి విమానాల ఎలక్ట్రానిక్ వ్యవస్థలు మొబైల్ ఫోన్ల ఇంటర్ ఫెరన్స్ ను తట్టుకొని పనిచేయగలవు. మొబైల్ సిగ్నళ్లు ఉపయోగించుకొనే బ్యాండ్, వేవ్ స్పెక్ట్రమ్ లు వేరు. విమానం యొక్క కమ్యూనికేషన్ చానెళ్లు వేరు. విమానంలో మొబైల్ ఫోన్ వాడడం వలన ఇప్పటివరకు ఒక్క విమానం కూడా ప్రమాదానికి గురికాలేదు. అయినా ఇప్పటికీ మొబైల్ వాడకంపై నిషేధం ఎత్తివేయలేదు. అందుకు కారణాలు ఉన్నాయి.

ఫోన్‌లు ఎందుకు ఆఫ్‌ చేయాలి..

విమానంలో మొబైల్ ఫోన్ వాడితే ఎలక్ట్రానిక్ వ్యవస్థ పాడై విమానం కూలిపోదుగానీ, పైలట్లు ఏటీసీతో మాట్లాడేటప్పుడు కొంత ‘నాయిస్’ ను సృష్టించగలవు. వాతావరణం బాగా లేనప్పుడు రేడియో, టీవీలలో గరగరమని వచ్చే ధ్వని లాంటిది వచ్చి సంభాషణ స్పష్టంగా వినిపించక పోవచ్చు. ఇది పైలట్లకు చాలా చీకాకు కలిగించే వ్యవహారం. అందుకే లాండింగ్, టేక్ ఆఫ్ సమయాలలో మొబైల్ ఫోన్లను ఆఫ్‌ చేయమని చెబుతారు. విమానంలో ప్రయాణించేటప్పుడు ఫోన్‌లను ఆఫ్‌ చేయడం తప్పనిసరి. విమానంలో మొబైల్ ఫోన్లు వాడడం మంచిది కాదు.

సాధారణంగాపరికరాలు, మొబైల్ టవర్ మధ్య సిగ్నల్ ప్రసారం ఉంటుంది. విమాన ప్రయాణంలో కూడా ఈ రేడియో సిగ్నల్స్ కొనసాగుతాయి. అందువల్ల, ప్రయాణికులు విమాన ప్రయాణానికి ముందు ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేయడం లేదా ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచడం మంచిది. ఇలా చేసిన తర్వాత సిగ్నల్ ప్రసారం ఆగిపోతుంది.

బ్రిటానికా వెబ్‌సైట్ ప్రకారం.. చాలా ఎయిర్‌లైన్స్ ఈ రేడియో సిగ్నల్‌ల ఉనికి విమానంలోని పరికరాలు, సెన్సార్లు, నావిగేషన్, అనేక ఇతర ముఖ్యమైన సిస్టమ్‌లను ప్రభావితం చేస్తుందని భావిస్తుంటారు. అందుకే ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచడం మంచిది. ఇలా చేయడం వల్ల విమాన ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఇప్పుడున్న టెక్నాలజీలో విమానంలో ఉపయోగించే సున్నితమైన ఎలక్ట్రానిక్ పరికరాలను రేడియో ఫ్రీక్వెన్సీ ప్రభావితం చేయలేని విధంగా రూపొందించినప్పటికీ, ముందు జాగ్రత్తగా ఫోన్‌లను ఆఫ్‌ చేయడం, ఫ్లైట్‌ మోడ్‌లో పెట్టమని సూచిస్తారు. 2000లో స్విట్జర్లాండ్, 2003లో న్యూజిలాండ్‌లో జరిగిన విమాన ప్రమాదాలకు మొబైల్ ఫోన్ ప్రసారమే కారణమని భావిస్తున్నారు.

చైనాలో కఠినమైన నిబంధనలు:

దీనికి సంబంధించి చైనాలో కఠినమైన నిబంధనలు ఉన్నాయి. చైనాలోని సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ విమాన ప్రయాణానికి సంబంధించి కఠినమైన నిబంధనలను విధించింది. విమానంలో ఎలక్ట్రానిక్ పరికరాలను ఆఫ్ చేయడంలో వైఫల్యం జరిమానా లేదా జైలు శిక్ష కూడా విధించబడుతుంది.

ఇవి కూడా చదవండి:

Clouds: మేఘాలు ఎంత బరువు ఉంటాయి..? అవి ఎందుకు కింద పడవు.. బరువు తెలుసుకోవడం ఎలా..?

Best Power Banks: ప‌వ‌ర్ బ్యాంక్ కొనాల‌ని ప్లాన్ చేస్తున్నారా.? అయితే బెస్ట్ ఫీచర్స్‌తో కూడిన వీటిపై ఓ లుక్కేయండి..