Eyes: చలికాలంలో కళ్లు జాగ్రత్త.. పట్టించుకోకపోతే ఈ సమస్యలు తప్పవు.. అవేంటంటే..?

Winter Effect Eyes: తరచుగా జలుబుకు గురయ్యేవారు చలికాలంలో జాగ్రత్తగా ఉంటారు. ఆహారంలో రకరకాల మార్పులు చేస్తారు. అంతేకాదు చర్మం,

Eyes: చలికాలంలో కళ్లు జాగ్రత్త.. పట్టించుకోకపోతే ఈ సమస్యలు తప్పవు.. అవేంటంటే..?
Eyes
Follow us
uppula Raju

|

Updated on: Jan 12, 2022 | 11:22 AM

Winter Effect Eyes: తరచుగా జలుబుకు గురయ్యేవారు చలికాలంలో జాగ్రత్తగా ఉంటారు. ఆహారంలో రకరకాల మార్పులు చేస్తారు. అంతేకాదు చర్మం, జుట్టు గురించి కూడా ఆలోచిస్తారు. కానీ కళ్లని మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు. దీనివల్ల చాలామంది కళ్ల ఇన్‌ఫెక్షన్‌కి గురవుతారు. వాస్తవానికి చలి కళ్ళను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. అయితే ఇది ఎలా జరుగుతుందో, దీనికి తీసుకోవాల్సిన నివారణలు ఏంటో తెలుసుకుందాం.

చలికాలం రాగానే రోజంతా హీటర్లు, మంటలు మొదలైన వాటి ద్వారా వేడిని ఉత్పత్తి చేస్తారు. వీటి వల్ల కళ్లు పొడిబారుతాయి. అంతేకాదు దురద తదితర సమస్యలు ఏర్పడుతాయి. కళ్లు పొడిబారడం అనేది చలికాలంలో ఎక్కువగా ఉండే సమస్య. ఇలా జరిగినప్పుడు కన్నీళ్ల ఉత్పత్తి తగ్గుతుంది. దీని కారణంగా కళ్ళు అధ్వాన్నంగా మారుతాయి. వాస్తవానికి కళ్ళు మృదువుగా, శుభ్రంగా ఉండాలంటే కన్నీళ్ల అవసరం చాలా ఉంటుంది.

సాధారణంగా చలి కాలంతో తేమ తగ్గుతుంది. చలిని నివారించడానికి ప్రజలు ఇంట్లో ఉష్ణోగ్రతను పెంచడం ప్రారంభిస్తారు ఇది తేమను తగ్గించేలా చేస్తుంది. వాతావరణంలో తేమ తగ్గడంతో శరీరంలో తేమ తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది కళ్లపై ప్రభావం చూపుతుంది. దీని తర్వాత కళ్లు పొడిబారడం వంటి సమస్యలు మొదలవుతాయి. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. మీ అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల చలికాలంలో కళ్లను వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు.

ఎక్కువ ద్రవ పదార్థాలను తీసుకోవాలి. ఇది మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇది మన కళ్ళలో తేమను నిలుపుకోవడానికి సహాయపడుతాయి. మీ ముఖంపై నేరుగా వేడిని అప్లై చేయకండి. ఎందుకంటే ప్రత్యక్ష వేడి కారణంగా మన కళ్ళలోని తేమ ఆరిపోతుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేదా బలమైన చలిగాలులు వీస్తున్నప్పుడు అది నేరుగా కళ్లపై పడకుండా నిరోధించండి. దీని కోసం కళ్లకు గాగుల్స్ ధరించండి. అలాగే చల్లని వాతావరణంలో కళ్లని తరుచుగా శుభ్రం చేయడం వల్ల ఇన్ఫెక్షన్, దురదను నివారించవచ్చు.

చలికాలంలో నోటి నుంచి ఆవిర్లు ఎందుకు వస్తాయో తెలుసా..! దీని వెనుకున్న ఆరోగ్య మిస్టరీ తెలుసుకోండి..?

NEET PG కౌన్సెలింగ్ షురూ.. డాక్యుమెంట్లు, ఫీజు గురించి తెలుసుకోండి..

వర్క్ ఫ్రమ్ హోమ్‌ చేసేవారు అలర్ట్‌..! ఎక్కువ మంది దీని భారిన పడుతున్నారు..?