చలికాలంలో నోటి నుంచి ఆవిర్లు ఎందుకు వస్తాయో తెలుసా..! దీని వెనుకున్న ఆరోగ్య మిస్టరీ తెలుసుకోండి..?

Mouth Steam: చలికాలం అందరికి నచ్చకపోవచ్చు.. కానీ కొంతమంది చాలా ఇష్టపడుతారు. ముఖ్యంగా చలికాలంలో చాలామంది అనారోగ్యానికి గురవుతారు.

చలికాలంలో నోటి నుంచి ఆవిర్లు ఎందుకు వస్తాయో తెలుసా..! దీని వెనుకున్న ఆరోగ్య మిస్టరీ తెలుసుకోండి..?
Winter
Follow us

|

Updated on: Jan 12, 2022 | 10:59 AM

Mouth Steam: చలికాలం అందరికి నచ్చకపోవచ్చు.. కానీ కొంతమంది చాలా ఇష్టపడుతారు. ముఖ్యంగా చలికాలంలో చాలామంది అనారోగ్యానికి గురవుతారు. దీనికి వాతావరణ పరిస్థితులు కావొచ్చు లేదంటే రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం కావొచ్చు. సాధారణంగా చలికాలంలో ఉదయం నిద్ర లేవగానే నోటి నుంచి వేడి వేడి ఆవిర్లు బయటికి వస్తాయి. ఇవి చూడటానికి పొగల మాదిరిగా ఉంటాయి. కానీ ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికైనా తెలుసా..? దీని వెనుకున్న ఆరోగ్య మిస్టరీ ఏంటో తెలుసుకుందాం.

సాధారణంగా మానవ శరీరాల సగటు ఉష్ణోగ్రత 18.6 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు దగ్గరగా ఉంటుంది. అయితే చలికాలంలో మనం శ్వాసను విడిచిపెట్టినప్పుడు అదే వేడి దాంతో పాటు బయటకు వస్తుంది. ఇలా బయటికి వచ్చినప్పుడు ఆ వేడి గాలి బయట ఉన్నచల్లటి గాలితో బాష్పీభవనం జరుపుతుంది. దీనివల్ల ఆవిరి రూపంలో మనకు కనిపిస్తుంది. కానీ ఇది తెలియని వ్యక్తులు దీని గురించి రకరకాల కారణాలు చెబుతుంటారు. నిజానికి వేసవి కాలంలో బయట ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రత కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆవిర్లు అప్పుడు కనిపించవు. కేవలం చలికాలంలో మాత్రమే వస్తాయి.

అయితే ఈ ఆవిర్లు చాలా శీతల ప్రాంతాల్లో అధికంగా వస్తాయి. మామూలుగా చలికాలంలో ఉదయం లేచినప్పుడు వాతావరణం చల్లగా ఉంటుంది. ఆ సందర్భంలో నోటినుంచి ఆవిర్లు కనిపిస్తాయి. కొద్ది సేపటి తర్వాత అవి ఉండవు. కానీ అతి శీతల ప్రాంతాల్లో ఇవి రోజు మొత్తం నోటి నుంచి వస్తూనే ఉంటాయి. ఎందుకంటే అక్కడి వాతావరణం మన శరీర ఉష్ణోగ్రత కంటే చాలా చల్లగా ఉంటుంది. అందుకే నోటి నుంచి ఆవిర్లు వస్తూనే ఉంటాయి.

NEET PG కౌన్సెలింగ్ షురూ.. డాక్యుమెంట్లు, ఫీజు గురించి తెలుసుకోండి..

వర్క్ ఫ్రమ్ హోమ్‌ చేసేవారు అలర్ట్‌..! ఎక్కువ మంది దీని భారిన పడుతున్నారు..?

చాణక్య నీతి: ప్రపంచంలో ఈ ఐదుగురు వ్యక్తులకు ఎవరితో సంబంధం లేదు.. వారి పనే వారికి ముఖ్యం..?