AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైహీల్స్ వేసుకునే మహిళలు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి..! ఏంటంటే..?

High Heels: హైహీల్స్ ఎత్తు తక్కువగా ఉన్నవారిని కనబడేలా చేయడమే కాకుండా వారి వ్యక్తిత్వాన్ని ఆకట్టుకునేలా చేస్తుంది. ఈ కారణంగా చాలామంది

హైహీల్స్ వేసుకునే మహిళలు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి..! ఏంటంటే..?
Heels
uppula Raju
|

Updated on: Jan 12, 2022 | 1:03 PM

Share

High Heels: హైహీల్స్ ఎత్తు తక్కువగా ఉన్నవారిని కనబడేలా చేయడమే కాకుండా వారి వ్యక్తిత్వాన్ని ఆకట్టుకునేలా చేస్తుంది. ఈ కారణంగా చాలామంది మహిళలు, యువతులు హీల్స్ ధరించడానికి ఇష్టపడతారు. సాధారణంగా అన్ని రకాల దుస్తులపై హీల్స్ స్టైల్‌గా, అందంగా కనిపిస్తాయి. కొంతమంది 4 నుంచి 6 అంగుళాల హైహీల్స్ ధరిస్తారు. కానీ ఇది అందరికీ సాధ్యం కాదు. సాధారణంగా మహిళలు హై హీల్స్‌ వేసుకుంటే బ్యాలెన్స్ చేయగలగాలి ఎందుకంటే పడిపోతే చాలా దారుణంగా ఉంటుంది. హైహీల్స్‌ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.

1. హైహీల్స్‌ పరిమాణంపై శ్రద్ధ వహించండి

సాధారణ పాదరక్షలను ధరించేటప్పుడు కొంచెం పెద్ద లేదా చిన్న సైజుతో ఇబ్బంది ఉండదు. ఎలాగోలా సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ హైహీల్స్ విషయంలో ఇది జరుగదు. ఎలాంటి సర్దుబాట్లు చేయడం కుదరదు. అంతేకాదు ఇది చాలా ప్రమాదకరం కూడా. హైహీల్స్ ఎల్లప్పుడూ ఖచ్చితమైన సైజులో ఉండాలి. చిన్న హైహీల్స్‌ మీకు ఇబ్బందికరంగా ఉంటాయి. పెద్ద హైహీల్స్‌ వదులుగా ఉంటాయి. కాబట్టి బ్యాలెన్స్ చేయడం కష్టంగా ఉంటుంది.

2. సరైన ఆకృతిని ఎంచుకోవాలి

మార్కెట్‌లో మీరు అనేక రకాల హై హీల్స్‌ను చూస్తారు. కాబట్టి మీకు సౌకర్యవంతంగా ఉండే హీల్స్‌ను ఎంచుకోవడం ముఖ్యం. మీరు మొదటి సారి హైహీల్స్ వేసుకుంటున్నట్లయితే ఎత్తు, సైజ్‌ జాగ్రత్తగా ఎంచుకొని తీసుకుంటే మంచిది.

3. ఎత్తు తక్కువుంటే బెస్ట్

మీరు హై హీల్స్ ధరించడం కొత్త అయితే ముందుగా 4 నుంచి 6 అంగుళాల ఎత్తు ఉండే హైహీల్స్ వేసుకునే బదులు కాస్త తక్కువ ఎత్తు హీల్స్ ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే వీటితో మీరు సులభంగా నడుస్తారు. ఎటువంటి ఇబ్బంది ఉండదు.

4. ఇన్సోల్స్‌ ఉపయోగించండి

మీరు ఎటువంటి సమస్య లేకుండా ఎక్కువ కాలం హైహీల్స్ ధరించాలనుకుంటే ఇన్సోల్స్ ఉపయోగించవచ్చు. ఇవి సాధారణంగా సిలికాన్ లేదా ఫాబ్రిక్‌తో తయారు చేస్తారు. ఇవి మీ పాదాలను ముందుకు కదలకుండా నిరోధిస్తాయి నొప్పి, పొక్కులను తగ్గించడంలో సహాయపడతాయి.

చికెన్, మొక్కజొన్న సూప్‌తో జలుబుకి చెక్..! ఇంట్లోనే ఇలా తయారుచేయండి..?

కొత్త ఫోన్ కొనేముందు ఒక్కసారి ఆలోచించండి.. ఈ 5 విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి..

Eyes: చలికాలంలో కళ్లు జాగ్రత్త.. పట్టించుకోకపోతే ఈ సమస్యలు తప్పవు.. అవేంటంటే..?