Winter Skin Care: స్వెటర్ వేసుకుని నిద్రపోతున్నారా ?.. అయితే వెంటనే అలవాటు మార్చుకోండి.. ఎందుకంటే..

సీజన్స్ మారుతున్న కొద్ది మన శరీరంలో మార్పులు జరుగుతుంటాయి. వర్షకాలం, చలికాలం, వేసవిలో అనేక అనారోగ్య

Winter Skin Care: స్వెటర్ వేసుకుని నిద్రపోతున్నారా ?.. అయితే వెంటనే అలవాటు మార్చుకోండి.. ఎందుకంటే..
Sweaters
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 13, 2022 | 11:00 AM

సీజన్స్ మారుతున్న కొద్ది మన శరీరంలో మార్పులు జరుగుతుంటాయి. వర్షకాలం, చలికాలం, వేసవిలో అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ముఖ్యంగా శీతాకాలంలో చర్మాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు ఎక్కువగా శ్రద్ధ చూపిస్తుంటాం. చలిని తట్టుకునే విధంగా దుస్తులు ధరిస్తుంటారు. స్వెటర్స్, గ్లౌజ్, క్యాప్స్ ఇలా రకారకాల వింటర్ వేర్ ధరిస్తూ శరీరాన్ని కాపాడుకుంటాం. అయితే చాలా మందికి రాత్రిళ్లు స్వెటర్ వేసుకుని నిద్రపోవడం అలవాటు ఉంటుంది. దీంతో చలి నుంచి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. కానీ స్వెటర్స్ వేసుకుని నిద్రపోయే వారు వెంటనే మీ అలవాటును మార్చుకోండి. లేకకపోతే ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. చలికాలంలో స్వెటర్స్ వేసుకుని నిద్రపోవడం అస్సలు మంచిది కాదు. ఎందుకో తెలుసుకోండి.

నివేగిరవ ప్రకారం రాత్రిళ్లు స్వెటర్స్ వేసుకుని నిద్రపోవడం వలన శరీరం నుంచి అధిక వేడి వెలువడుతుంది. దీంతో చర్మం పొడిబారుతుంది. ఆ తర్వాత చర్మంపై దద్దుర్లు రావడం వంటి సమస్య మొదలవుతుంది. అంతేకాకుండా రాత్రిళ్లు చిన్నపిల్లలు వెచ్చని బట్టలు ధరించడం వలన శరీరం డీహైడ్రేషన్‏కు గురవతుంది. అలాగే రాత్రిపూట స్వెటర్స్ ధరించడం వలన చర్మ అలెర్జీ ఏర్పడుతుంది. దీంతో చర్మం మంట వస్తుంది. కాబట్టి ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. రాత్రిపూట ఉన్ని దుస్తులకు దూరంగా ఉండడం మంచిది.

రాత్రిపూట శరీరాన్ని ఎక్కువగా కప్పి ఉంచడం వలన చెమటలు పట్టడం వలన రక్తపోటు తగ్గడంతోపాటు కళ్లు తిరగడం జరుగుతుంది. అంతేకాదు చాలా మందికి నిద్ర సమస్యలు వస్తాయి. రాత్రిపూట బిగుతుగా ఉన్న ఉన్ని బట్టలు ధరిస్తే శ్వాస సమస్య కలుగుతుంది. ఉన్ని బట్టలు వాటిపై మెత్తటి స్వెటర్లు కూడా ఆస్తమ సమస్యను పెంచుతాయి. అలాగే అలెర్జీ రావడం వలన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.

కేవలం స్వెటర్స్ మాత్రమే కాకుండా.. వెచ్చని సాక్స్ ధరించడం కూడా మానేయాలి. సాక్స్ ధరించడం వలన చెమట పట్టడం వలన బ్యాక్టిరియా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నిద్రించే సమయంలో స్వెటర్స్, సాక్స్ లకు దూరంగా ఉండాలి,

Also Read: Pooja Hegde: బుట్ట‌బొమ్మ స్టెప్‌ను సృష్టించింది తామే అంటోన్న పూజా.. అర్హ‌తో ఆస‌క్తిక‌ర‌మైన వీడియో..

Teaser Talk: అస‌లు మ‌నిషి చ‌ర్మంతో వ్యాపారం ఏంటి..? ఆసక్తిరేపుతోన్న హ‌న్సిక కొత్త సినిమా టీజ‌ర్‌..

Nidhi Agarwal : అందాల నిధికి కాబోయేవాడికి ఆ క్వాలిటీస్ ఉండాలట.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అమ్మడు

Bhamakalapam: ఆకట్టుకుంటున్న ప్రియమణి న్యూలుక్.. ఆహాలో రాబోతున్న భామా కలాపం..