Handy Tricks: ఈ చిన్న టెక్నిక్స్ మీ రోజువారీ పనుల్లో వచ్చే ఇబ్బందుల్లో పెద్ద రిలీఫ్.. ట్రై చేసి చూడండి..

మనం తరచూ ఇంట్లో చిన్న చిన్న విషయాలకు పెద్దగా టెన్షన్ పడిపోతాం. కొన్ని ఇబ్బందుల గురించి ఎక్కువగా అలోచించేస్తాం. ఏదైనా వస్తువు చిన్న ఇబ్బంది పెట్టినా హైరానా పడిపోయి మెకానిక్(Mechanic) కోసం పరుగులు తీస్తాం.

Handy Tricks: ఈ చిన్న టెక్నిక్స్ మీ రోజువారీ పనుల్లో వచ్చే ఇబ్బందుల్లో పెద్ద రిలీఫ్.. ట్రై చేసి చూడండి..
Handy Tricks

మనం తరచూ ఇంట్లో చిన్న చిన్న విషయాలకు పెద్దగా టెన్షన్ పడిపోతాం. కొన్ని ఇబ్బందుల గురించి ఎక్కువగా అలోచించేస్తాం. ఏదైనా వస్తువు చిన్న ఇబ్బంది పెట్టినా హైరానా పడిపోయి మెకానిక్(Mechanic) కోసం పరుగులు తీస్తాం. సాధారణంగా మనం తరచుగా ఇంట్లో ఎదుర్కునే సమస్యల్లో చాలా వాటిని చిన్న చిన్న టెక్నిక్స్(Techniques) తో ఇట్టే తరిమేయవచ్చు. ఆ టెక్నిక్స్ తెలిస్తే మన దైనందిన పనులు చాలా సులభంగా పూర్తీ అవుతాయి. ఇప్పడు అటువంటి చిన్న చిన్న టెక్నిక్స్ కొన్నిటిని గురించి తెలుసుకుందాం.

  • కత్తెర అంచు తరచుగా పదును కోల్పోయినట్టు అయిపోతుంది. దీన్ని మళ్ళీ చక్కగా చేయడానికి చిన్న టెక్నిక్ ఉంది. సిల్వర్ పేపర్ మార్కెట్లో దొరుకుతుంది. దీనిని ఎప్పుడూ ఇంటిలో ఉంచుకోండి. ఎప్పుడైనా కత్తెర పదును తగ్గినట్టు అనిపిస్తే వెంటనే సిల్వర్ పేపర్ ను మడతలుగా మడిచి.. దానిని కత్తెరతో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించండి. అంతే.. వెంటనే మీ కత్తెర పదునుగా తాయారు అవుతుంది,.
  • మీ గదిలో దుర్వాసన వస్తోందా? వర్షాకాలంలోనూ.. శీతాకాలంలోనూ ఇది సహజం. టెన్షన్ వద్దు.. మీరు గదిని సువాసన భరితంగా చేయాలనుకుంటే, నారింజ కొవ్వొత్తిని వెలిగించండి. ఇది తయారు చేయడం చాలా సులభం. నారింజను మధ్యకు కోయండి .. దాని పై తొక్కను రెండు గిన్నెలు లా ఏర్పడే విధంగాలోపలి తొనలను తొలగించండి. ఇప్పుడు ఆ నారింజ దొప్పలలో నూనె లేదా మైనం వేసి వత్తిని ఉంచి కాల్చండి. గది తాజా వాసన వస్తుంది.
  • బూట్లు దుర్వాసన వస్తుంటే.. వాటి లోపల టీ-బ్యాగ్‌లను ఉంచండి. వాటిని అలానే రాత్రిపూట వదిలివేయండి. వాసన పోతుంది. లేదంటే బేకింగ్ సోడా కూడా వేసి ఉంచుకోవచ్చు. సోడాను ఒక గుడ్డ సంచిలో నింపి దానిని అలానే షూస్ లో పెట్టేయండి. ఉదయానికి మళ్ళీ ఫ్రెష్ గా సిద్ధం అయిపోతాయి.
  • కేక్‌ను కట్ చేసి ఫ్రిజ్‌లో ఉంచిన తర్వాత , అది కట్ చేసిన వైపు పొడిగా లేదా పాతదిగా అనిపించడం ప్రారంభమవుతుంది. కేక్‌ను తాజాగా ఉంచడానికి, కత్తిరించిన భాగం చుట్టూ బ్రెడ్‌ను రాయండి. దీంతో కేక్ తాజాగా ఉంటుంది. బ్రెడ్‌ను అప్లై చేయడానికి మీరు టూత్‌పిక్ సహాయం తీసుకోవచ్చు.
  • ఇనుప కత్తులు, కత్తెరలు వాడకపోవడం వల్ల తుప్పు పట్టేస్తాయి. మళ్ళీ ఎప్పుడన్నా వాడాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, తరిగిన ఉల్లిపాయలను వాటిపై రుద్దండి. కాసేపు రుద్దితే తుప్పు పోతుంది. తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి.
  • ఫర్నిచర్ నుంచి గీతలు తొలగించడానికి, ఒక భాగం వెనిగర్‌ను రెండు భాగాల కనోలా నూనెతో కలపండి. ఆయిల్ మిశ్రమంలో గుడ్డను ముంచి ఫర్నిచర్ మీద అప్లై చేయండి. ఫర్నిచర్ షైన్ తిరిగి వస్తుంది .. గుర్తులు పోతాయి.
  • బాత్రూంలో అద్దం మీద తరచుగా పొగమంచు ఉంటుంది. టూత్‌పేస్ట్ లేదా షేవింగ్ ఫాగ్‌తో రుద్దండి, ఆపై నీటితో శుభ్రం చేసుకోండి. గాజు మెరుస్తుంది. ఈ ప్రక్రియ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ చేయవచ్చు.
  • బట్టలు ఇస్త్రీ చేయడం వల్ల మరకలు పడతాయి లేదా కొంత సమయం తర్వాత దాని రంగు మారుతుంది. అటువంటి పరిస్థితిలో, దానిని శుభ్రం చేయడానికి, బ్రష్‌లో టూత్‌పేస్ట్‌ను పూయండి .. దానిని మరకలపై తేలికగా రుద్దండి. తర్వాత కొంత సమయం తర్వాత తడి గుడ్డతో తుడవండి. మరకలు చాలా వరకు క్లియర్ అవుతాయి.

ఇవి కూడా చదవండి: UP Elections 2022: బీజేపీలో కొలిక్కివస్తున్న అభ్యర్థుల ఎంపిక.. సీఎం యోగి ఎక్కడి నుంచంటే..?

UP Elections: యూపీలో పెరుగుతున్న జంపింగ్ జపాంగ్‌లు.. బీజేపీకి మరో మంత్రి రాంరాం!

Click on your DTH Provider to Add TV9 Telugu