AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్లాత్‌ మాస్క్‌ వాడుతున్నారా.. N95 మాస్క్ వాడుతున్నారా..! పరిశోధనలో షాకింగ్‌ నిజాలు..

N95 Mask: పండుగ పూట ఒమిక్రాన్ పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇప్పుడున్న పరిస్థితిలో వ్యాక్సిన్‌లు, బూస్టర్ డోస్‌లు, మాస్క్‌లు జీవితంలో

క్లాత్‌ మాస్క్‌ వాడుతున్నారా.. N95 మాస్క్ వాడుతున్నారా..! పరిశోధనలో షాకింగ్‌ నిజాలు..
N95 Mask
uppula Raju
|

Updated on: Jan 14, 2022 | 6:47 AM

Share

N95 Mask: పండుగ పూట ఒమిక్రాన్ పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇప్పుడున్న పరిస్థితిలో వ్యాక్సిన్‌లు, బూస్టర్ డోస్‌లు, మాస్క్‌లు జీవితంలో అత్యంత అవసరం. టీకాలు ఇన్‌ఫెక్షన్ తీవ్రతను తగ్గిస్తాయి, కానీ ఇన్‌ఫెక్షన్ నుంచి రక్షించవు. సామాజిక దూరం, మాస్కులు మాత్రమే ఇన్ఫెక్షన్ నుంచి రక్షించగలవు. మాస్క్‌లపై తాజా అధ్యయనం ప్రకారం.. క్లాత్‌ మాస్క్‌లు ధరించడం వల్ల పెద్ద ప్రమాదాన్ని ఆహ్వానిస్తున్నట్లే. మీరు ఒమిక్రాన్ సోకిన వ్యక్తిని కలిసినట్లయితే మీ మాస్క్‌ మిమ్మల్ని ఎంత సమయం సురక్షితంగా ఉంచగలదో శాస్త్రవేత్తలు నిర్దారించారు. కాబట్టి ఇన్‌ఫెక్షన్‌ను తగ్గించడానికి ఏ మాస్క్ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందో తెలుసుకుందాం.

అమెరికాకు చెందిన సిడిసి (CDC) అంటే సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వివిధ రకాల మాస్క్‌లపై ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. దాని ఫలితాల ఆధారంగా మాస్క్‌లు ధరించని వ్యక్తులు ఎంతకాలం ఇన్‌ఫెక్షన్‌కు గురవుతారని చెప్పింది. మాస్క్ ధరించకపోవడం వల్ల ఒక వ్యక్తికి వైరస్‌కి గురైతే అతడితో పరిచయం ఉన్న వ్యక్తులకు కేవలం 15 నిమిషాల్లో వైరస్ సోకుతుంది. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి క్లాత్‌ మాస్క్‌ ధరించి ఉంటే ఒక వైరస్ సోకిన వ్యక్తి మాస్క్‌ లేకుండా ఉంటే అప్పుడు ఇన్ఫెక్షన్‌కి కేవలం 20 నిమిషాలు పడుతుంది. ఒకవేళ వైరస్‌ సోకిన వ్యక్తి క్లాత్‌ మాస్క్ ధరించి ఉంటే, అలాగే ఆరోగ్యంగా ఉన్న ఇతర వ్యక్తులు కూడా క్లాత్ మాస్క్‌ ధరించి ఉంటే 27 నిమిషాల్లో వారికి ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉందని తేల్చారు.

అదేవిధంగా వైరస్ సోకిన వ్యక్తి మాస్క్‌ లేకుండా ఉంటే ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి N-95 మాస్క్ ధరిస్తే సుమారు రెండున్నర గంటల పాటు రక్షణ ఉంటుంది. ఇన్ఫెక్షన్‌ను నివారించడంలో క్లాత్‌ మాస్క్‌లు అతి తక్కువ ప్రభావం చూపుతున్నాయి. అలాగే N-95 మాస్క్‌లు అత్యంత ప్రభావవంతమైనవిగా తేలాయి. కాబట్టి 4-5 లేయర్ N95 మాస్క్‌లను ఉపయోగించడం మంచిది. ACGIH అంటే అమెరికన్ కాన్ఫరెన్స్ ఆఫ్ గవర్నమెంటల్ ఇండస్ట్రియల్ హైజీనిస్ట్స్ ప్రకారం.. N-95 మాస్క్ క్లాత్ మాస్క్ కంటే కనీసం 7 రెట్లు ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది. సర్జికల్ మాస్క్ కంటే 5 రెట్లు ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది. అయితే క్లాత్ మాస్క్‌లు పూర్తిగా పనికిరానివని దీని అర్థం కాదు ఎందుకంటే రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేని వ్యక్తులు లేదా ఎక్కువసేపు N-95 మాస్క్‌లు ధరించడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండే వ్యక్తులు క్లాత్‌ మాస్క్‌లను ధరించవచ్చు.

BSNL: నాలుగు కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టిన BSNL .. జియో, ఎయిర్‌టెల్‌కి గట్టి పోటీ..

Booster Shot Scam: బూస్టర్ డోస్‌ స్కామ్‌.. వీరిని అస్సలు నమ్మకండి.. లేదంటే డబ్బులు మాయం..

Trends: సంక్రాంతి పండుగకి ‘ట్రెండ్స్’ ముగ్గులపోటీ.. ఎంపికైన వారికి బహుమతులు