Covid Vaccination: కొవిడ్ వ్యాక్సినేషన్‌లో తెలంగాణ సరికొత్త రికార్డ్.. మొదటి డోస్‌ను 100% పూర్తి..
తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. కోవిడ్ వ్యాక్సినేషన్ మొదటి డోస్‌ను 100 శాతం పూర్తి చేసిన తొలి పెద్ద రాష్ట్రంగా తెలంగాణ రికార్డు నెలకొల్పిందని వైద్యఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు..
తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. కోవిడ్ వ్యాక్సినేషన్ మొదటి డోస్‌ను 100 శాతం పూర్తి చేసిన తొలి పెద్ద రాష్ట్రంగా తెలంగాణ రికార్డు నెలకొల్పిందని వైద్యఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. తన ట్విట్టర్ ఖాతాలో ఈ వివరాలను వెల్లడించారు. వ్యాక్సినేషన్‌లో తెలంగాణ ఇప్పుడు మరో మైలు రాయిని చేరుకున్నదని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. రాష్ట్రంలో కోవిడ్ టీకా నేటితో 5 కోట్ల డోసులను అధిగమించిందన్నారు. టీకాల పంపిణీ 5 కోట్ల డోసులు దాటిన సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఉండి నిరంతరం వ్యాక్సినేషన్‌లో కృషి చేస్తున్న వైద్యసిబ్బందితోపాటు పంచాయతీ, మున్సిపల్, ఇతర శాఖల సిబ్బందిని అభినందించారు మంత్రి హరీష్ రావు.
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ రెండు డోసుల వాక్సినేషన్ తప్పనిసరిగా పూర్తి చేసుకొని, మీ కుటుంబాన్ని, సమాజాన్ని కరోనా నుండి సంరక్షించుకోవాలని మంత్రి హరీష్ రావు తన ట్విట్టర్‌లో సూచించారు. రాష్ట్రంలో కొవిడ్ టీకాల పంపిణీ 5 కోట్ల డోసులు పూర్తయింది. వైద్యసిబ్బంది కేవలం 35 రోజుల్లోనే కోటి టీకాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో గురువారం నాటికి మొదటి డోస్ 2.93 కోట్లు, రెండో డోస్ 2.06 కోట్లు, ప్రికాషన్ డోస్ లేదా బూస్టర్ డోస్ 1.13 లక్షల డోసులు పంపిణీ చేశారు. 15-17 ఏండ్ల వారికి 8.67 లక్షల డోసులు (47%) వేశారు. మొదటిడోస్ లక్ష్యానికి మించి దాదాపు 103 శాతం మందికి పంపిణీ చేయగా, రెండో డోస్ 74 శాతం మందికి వేశారు.
తొలి పెద్ద రాష్ట్రంగా రికార్డు..
కొవిడ్ వ్యాక్సినేషన్ మొదటి డోస్ 100% పూర్తి చేసిన తొలి పెద్ద రాష్ట్రంగా రికార్డు నెలకొల్పిన తెలంగాణ,ఇప్పుడు మరో మైలు రాయిని చేరుకున్నది. రాష్ట్రంలో కొవిడ్ వాక్సినేషన్ నేటితో 5 కోట్ల డోసులను అధిగమించింది. 1/2 pic.twitter.com/HjbOdHLhqz
— Harish Rao Thanneeru (@trsharish) January 13, 2022
వైద్యారోగ్య సిబ్బంది నిరంతర కృషి..
వ్యాక్సినేషన్ కార్యక్రమంలో నిరంతరం కృషి చేస్తున్న వైద్యారోగ్య సిబ్బందితోపాటు పంచాయతీ,మున్సిపల్,ఇతర శాఖల సిబ్బందికి అభినందనలు.రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ రెండు డోసుల వాక్సినేషన్ తప్పనిసరిగా పూర్తి చేసుకొని,మీ కుటుంబాన్ని,సమాజాన్ని కరోనా నుండి సంరక్షించండి. 2/2 #TSFightsCorona
— Harish Rao Thanneeru (@trsharish) January 13, 2022
టీకాలు, కొవిడ్ జాగ్రత్తలు మాత్రమే మనల్ని కరోనా బారి నుంచి కాపాడుతాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ రెండు డోసుల టీకాలు వేసుకోవాలని, ప్రభుత్వానికి సహకరించాలని, మాస్కు విధిగా ధరించాలని, చేతులను తరుచూ శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఇవి కూడా చదవండి: Train Ticket Lost: రైలు ప్రయాణానికి ముందు కన్ఫర్మ్ టికెట్ పోతే.. తిరిగి ఇలా తీసుకోండి..
AP Corona Cases: ఏపీలో మరోసారి పెరిగిన కొత్త కోవిడ్ కేసులు.. ఆ రెండు జిల్లాల్లో మాత్రం..