Minister KTR: ఏప్రిల్ 22 నాటికి ఫైబర్ గ్రిడ్ మొదటి దశ పనులు పూర్తి.. నెటిజన్ ప్రశ్నకు కేటీఆర్ ఆన్సర్..

Minister KTR: ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా తొలి దశ పనులు ఏప్రిల్ 22వ తేదీ నాటికి పూర్తవుతాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి తెలిపారు.

Minister KTR: ఏప్రిల్ 22 నాటికి ఫైబర్ గ్రిడ్ మొదటి దశ పనులు పూర్తి.. నెటిజన్ ప్రశ్నకు కేటీఆర్ ఆన్సర్..
Telangana Minister KTR
Follow us

|

Updated on: Jan 13, 2022 | 11:41 PM

Minister KTR: ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా తొలి దశ పనులు ఏప్రిల్ 22వ తేదీ నాటికి పూర్తవుతాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి తెలిపారు. గురువారం నాడు ఆస్క్ కేటీఆర్ అనే ట్యాగ్‌తో ట్విట్టర్‌లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్.. ఎప్పటిలోగా గ్రామాల్లోకి ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులోకి వస్తుందని ప్రశ్నించారు. దానికి స్పందించిన మంత్రి కేటీఆర్.. గ్రామాల్లో ఫైబర్ నెట్ కనెక్షన్లు తీసుకువచ్చే పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ఏప్రిల్ 22 నాటికి మొదటి దశ పనులు పూర్తవుతాయని చెప్పారు.

ఇదిలాఉంటే.. మరో కార్యక్రమంలో ఇదే అంశంపై మాట్లాడిన మంత్రి కేటీఆర్.. ఎలక్ట్రానిక్స్‌ సర్వీసుల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో దూసుకుపోతోందన్నారు. ఈ-పాలనకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఫైబర్‌ గ్రిడ్‌ పథకం (టి-ఫైబర్) ఇంటింటికీ ఇంటర్నెట్‌ అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకం. దేశంలోనే ప్రప్రథమంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ ఫైబర్‌ గ్రిడ్‌ పథకమిది.4000 కోట్ల రూపాయలు వ్యయం అవుతున్న ఈ పథకానికి భారత్‌ నెట్‌ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తోంది.

ఈ ప్రాజెక్ట్ 23 మిలియన్ల మంది ప్రజలను ప్రభుత్వంతో ప్రభుత్వానికి, ప్రభుత్వం నుండి పౌరులకు సేవలను, ఇతర అప్లికేషన్ల పరిధిని అనుసంధానం చేయడంలో సహాయపడుతుంది. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు 2017లో రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలంలో పైలట్ ప్రాజెక్ట్‌తో ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఎక్కువ మందికి టెలిమెడిసిన్, విద్యా అవకాశాలను అందించడం ద్వారా ఆరోగ్యం, విద్యను మెరుగుపరచడానికి ఇంటర్నెట్ సదుపాయాన్ని అందిస్తుంది. ఈ పథకం ద్వారా గృహాలకు 4-100 ఎంబిపిఎస్, సంస్థలు ఆన్-డిమాండ్ 20-100 ఎంబిపిఎస్ ఇంటర్నెట్ ను పంపిణీ చేస్తారు.

ఇవి కూడా చదవండి: Train Ticket Lost: రైలు ప్రయాణానికి ముందు కన్ఫర్మ్ టికెట్ పోతే.. తిరిగి ఇలా తీసుకోండి..

AP Corona Cases: ఏపీలో మరోసారి పెరిగిన కొత్త కోవిడ్ కేసులు.. ఆ రెండు జిల్లాల్లో మాత్రం..