Telangana Corona Cases: తెలంగాణలో కొద్దిగా పెరిగిన కరోనా కేసులు.. రికవరీ రేటు మాత్రం..
కొత్తగా 24 గంటల వ్యవధిలో 84,280 శాంపిల్స్ టెస్ట్ చేయగా 2,707 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,02,801కి చేరింది. కోవిడ్ కారణంగా ఇద్దరు మృతిచెందారు.
Telangana Covid 19 Cases: తెలంగాణలో కోవిడ్ (Telangana Covid 19 Cases) వ్యాప్తి తగ్గడం లేదు . కొత్తగా 24 గంటల వ్యవధిలో 84,280 శాంపిల్స్ టెస్ట్ చేయగా 2,707 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,02,801కి చేరింది. కోవిడ్ కారణంగా ఇద్దరు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 4,049కి చేరింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 582 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. కొత్తగా కోలుకున్నవారితో కలిపి రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 6,78,290కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 20,462 యాక్టివ్ కేసులున్నాయి. నేటివరకు రాష్ట్రంలో 3,04,52,039 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కాగా కొత్తగా నమోదైన కేసుల్లో.. జీహెచ్ఎంసీ పరిధిలోనే 1328,రంగారెడ్డి202,మేడ్చెల్ 248 కేసులు నమోదయ్యాయి.
అయితే రాష్ట్రంలో కరోనా ఆంక్షలను ఈనెల 20 వరకు పెంచడంతో రోజువారీ కేసుల సంఖ్య కాస్త తగ్గే అవకాశం కనిపిస్తోంది. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తే కేసుల సంఖ్యను అదుపులో ఉండే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కాగా.. దేశంలో థర్డ్‌వేవ్ ఉగ్రరూపం దాలుస్తోంది. వివిధ పార్టీ నాయకులకు, దేశంలోని ప్రముఖులను తాకింది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఆందోళనకరస్థాయిలో పెరిగిపోయింది. రోజురోజుకు కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. నిన్న రెండు లక్షల మార్క్‌కు చేరువైన కేసులు తాజాగా ఏకంగా రెండున్నర లక్షలకు చేరువ కావడం దేశంలో వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. గడిచిన 24 గంటల్లో (బుధవారం) దేశవ్యాప్తంగా కొత్తగా 2,47,417 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. బుధవారం నమోదైన కేసులతో పోలిస్తే 52,697 ( 27 శాతం) కోవిడ్ కేసులు అధికంగా పెరిగాయని కేంద్రవైద్యారోగ్య శాఖ పేర్కొంది.
ఇవి కూడా చదవండి: Train Ticket Lost: రైలు ప్రయాణానికి ముందు కన్ఫర్మ్ టికెట్ పోతే.. తిరిగి ఇలా తీసుకోండి..
AP Corona Cases: ఏపీలో మరోసారి పెరిగిన కొత్త కోవిడ్ కేసులు.. ఆ రెండు జిల్లాల్లో మాత్రం..