Trends: సంక్రాంతి పండుగకి ‘ట్రెండ్స్’ ముగ్గులపోటీ.. ఎంపికైన వారికి బహుమతులు

Trends: దేశంలోనే అతిపెద్ద‌మరియు శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్న దుస్తులు, ఇతర ఉపకరణాల రీటైల్ చైన్ అయిన రిల‌య‌న్స్ ట్రెండ్స్.. సంక్రాంతి ప‌ర్వ‌దినం

Trends: సంక్రాంతి పండుగకి ‘ట్రెండ్స్’ ముగ్గులపోటీ.. ఎంపికైన వారికి బహుమతులు
Rangoli
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 12, 2022 | 7:01 PM

Trends: దేశంలోనే అతిపెద్ద‌మరియు శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్న దుస్తులు, ఇతర ఉపకరణాల రీటైల్ చైన్ అయిన రిల‌య‌న్స్ ట్రెండ్స్.. సంక్రాంతి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌లోని చిన్న ప‌ట్ట‌ణాల్లో గ‌ల వినియోగ‌దారుల‌కు ఆస‌క్తిక‌ర‌మైన పోటీలు పెట్ట‌డం ద్వారా వారితో త‌న బంధాన్ని బ‌లోపేతం చేసుకుంటోంది. మ‌క‌ర సంక్రాంతి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా ముఖ్య‌మైన పండుగ‌. సంక్రాంతి అంటే మార్పు. ఈరోజే సూర్యుడు మ‌క‌ర‌రాశిలోకి ప్ర‌వేశిస్తాడ‌ని చెబుతారు. హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం ఉత్త‌ర‌దిశ‌గా క‌దిలే ఈ సూర్యుడిని దేవుడిగా పూజిస్తారు. సూర్యుడు మ‌క‌ర‌రాశిలోకి ప్ర‌వేశించే తొలిరోజే మ‌క‌ర సంక్రాంతి.

మ‌క‌ర సంక్రాంతిని రంగురంగుల అలంక‌ర‌ణ‌లతో సంబ‌రంగా చేసుకుంటారు. గ్రామాల్లో పిల్ల‌లు ఇంటింటికీ తిరిగి పాట‌లు పాడుతూ మిఠాయిలు అడుగుతారు. ఇక భోగి మంట‌లు, విందు వంట‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌లో చాలా ప్రాధాన్య‌మైన‌వి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌లో అనేక పట్టణాల్లోవిస్తరించి ఉన్న ట్రెండ్స్ మ‌క‌ర‌సంక్రాంతి సంద‌ర్భంగా చిన్న ప‌ట్ట‌ణాల్లోని వినియోగ‌దారుల‌కు ఆస‌క్తిక‌ర‌మైన పోటీ పెట్టింది.

“ట్రెండ్స్ సెల్ఫీ విత్ రంగోలి” పోటీ: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌లో ఉన్న ట్రెండ్స్ మ‌క‌ర సంక్రాంతి సంద‌ర్భంగా వినియోగదారుల‌తో బంధాన్ని పెంచుకుంటోంది. ఇందుకు “ట్రెండ్స్ సెల్ఫీ విత్ రంగోలి” అనే ఆస‌క్తిక‌ర‌మైన పోటీ పెడుతోంది. వినియోగ‌దారులు తాము త‌మ ఇంటి ప్రాంగ‌ణంలో వేసిన రంగురంగు ముగ్గుల‌తో ఓ సెల్ఫీ తీసుకోవాలి. దాన్ని ట్రెండ్స్ ఈ పోటీకోస‌మే ప్ర‌త్యేకంగా పెట్టిన వాట్సాప్ నంబ‌రుకు పంపాలి. అత్యుత్త‌మ ముగ్గుగా ఎంపికైన సెల్ఫీ/ఫొటోకు మొద‌టి బ‌హుమ‌తిగా సుమారు రూ. 1500/- ఇస్తారు. అంతేకాదు, పోటీలో పాల్గొన్న ప్ర‌తి ఒక్క‌రికీ ట్రెండ్స్ డిస్కౌంట్ కూప‌న్ ల‌భిస్తుంది. దీన్ని త‌మ‌కు స‌మీపంలోని ట్రెండ్స్ దుకాణం నుంచి పొంద‌చ్చు. ఈ పోటీ 2022 జ‌న‌వ‌రి 20న ముగుస్తుంది.

పోటీకి సంబంధించిన వివ‌రాల‌ను వినియోగ‌దారుల‌కు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయ‌డంతో పాటు ఇంటింటికీ వ‌చ్చే ట్రెండ్స్ పాంప్లెట్ల ద్వారా కూడా తెలుపుతారు. ట్రెండ్స్ దుకాణాల‌కు స‌మీపంలో ఉండే ప్ర‌ముఖులు విజేత‌ల‌ను ఎంపిక చేస్తారు. ఎంట్రీలు అందిన త‌ర్వాత వినియోగ‌దారులంద‌రికీ ట్రెండ్స్ వాట్సాప్ నుంచి వారి భాగ‌స్వామ్యానికి థాంక్యూ అనే సందేశం పంపుతుంది. విజేత‌లు ఎవ‌ర‌న్న విష‌యాన్నీ అంద‌రికీ వాట్సాప్ ద్వారా తెలియ‌జేస్తారు. మొద‌టి బ‌హుమ‌తి విజేత‌ను ఆయా న‌గ‌రాలు/ప‌ట్ట‌ణాల్లోని ట్రెండ్స్ దుకాణానికి ఆహ్వానిస్తారు. మొద‌టి బ‌హుమ‌తి సుమారు రూ.1500/- ను ఆయా న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లోని మునిసిపాలిటీ లేదా పోలీసు శాఖ‌ల‌లో ఉన్న సీనియ‌ర్ మ‌హిళా ప్ర‌భుత్వాధికారుల చేతుల మీదుగా బ‌హూక‌రిస్తారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌లో వినియోగ‌దారుల‌తో ట్రెండ్స్ అనుబంధం మ‌క‌ర సంక్రాంతి సంద‌ర్భంగా మ‌రోసారి రుజువైంది. వినియోగ‌దారుల రోజువారీ జీవితాల్లో భాగమైన ముఖ్య‌మైన పండుగ‌లు, సామాజిక సంద‌ర్భాల‌లో వారితో అనుబంధం ఏర్ప‌రుచుకుంటోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌లో మ‌క‌ర సంక్రాంతి స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకుని రెండు రాష్ట్రాల్లో వినియోగ‌దారుల కోసం ట్రెండ్స్ స‌రికొత్త వ‌స్త్రశ్రేణిని తీసుకొచ్చింది. పురుషులు, మ‌హిళ‌లు, పిల్ల‌ల కోసం తాజా డిజైన్ల‌లో వ‌స్త్రాల‌తో పాటు పాద‌ర‌క్ష‌లు, ఇత‌ర యాక్సెస‌రీలు అన్నీ అందుబాటులోకి తెచ్చింది.

హైహీల్స్ వేసుకునే మహిళలు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి..! ఏంటంటే..?

చికెన్, మొక్కజొన్న సూప్‌తో జలుబుకి చెక్..! ఇంట్లోనే ఇలా తయారుచేయండి..?

కొత్త ఫోన్ కొనేముందు ఒక్కసారి ఆలోచించండి.. ఈ 5 విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ