AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PF Transfer: రెండు, మూడు ఉద్యోగాలు మారారా..? పీఎఫ్‌ బదిలీ గురించి ముఖ్యమైన వివరాలు తెలుసుకోండి..

PF Transfer: మీరు తక్కువ సమయంలో రెండు, మూడు ఉద్యోగాలు మారారా.. మీ పీఎఫ్ అకౌంట్స్‌ అన్ని పెండింగ్‌లో ఉండిపోయాయా..? సాధారణంగా

PF Transfer: రెండు, మూడు ఉద్యోగాలు మారారా..? పీఎఫ్‌ బదిలీ గురించి ముఖ్యమైన వివరాలు తెలుసుకోండి..
uppula Raju
| Edited By: Ravi Kiran|

Updated on: Jan 15, 2022 | 7:20 AM

Share

PF Transfer: మీరు తక్కువ సమయంలో రెండు, మూడు ఉద్యోగాలు మారారా.. మీ పీఎఫ్ అకౌంట్స్‌ అన్ని పెండింగ్‌లో ఉండిపోయాయా..? సాధారణంగా ఉద్యోగాలు మారినప్పుడు అందరికి ఈ భయం ఉంటుంది. కానీ ఇప్పుడు అటువంటి ఇబ్బంది ఏది ఉండదు. అన్ని కొత్త కంపెనీకి బదిలీ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో సులభంగా చేసుకోవచ్చు. ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) తన ఖాతాదారుల సౌలభ్యం కోసం నిరంతరం చర్యలు తీసుకుంటోంది. EPFO చాలా సేవలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. దీని కోసం మీరు EPFO ​​వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.

యూనివర్సల్ అకౌంట్ నంబర్ లేదా UAN ప్రారంభించినప్పటి నుంచి PF బ్యాలెన్స్‌ని ఆన్‌లైన్‌లో బదిలీ చేసే ప్రక్రియ సులభమైంది. UANతో, డబ్బు వేర్వేరు ఖాతాలలో ఉన్నప్పటికీ, ఉద్యోగి అన్ని ఖాతాలు ఒకే చోట ఉంటాయి. కాబట్టి, మీరు మీ UANని మీ ప్రస్తుత యజమానులకి షేర్ చేయడం ద్వారా నిధులన్ని ఒక్కచోటికి బదిలీ చేసుకోవచ్చు. ఇది కాకుండా, EPFO ​​2020లో కోవిడ్-19 మహమ్మారి మధ్య తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఆన్‌లైన్‌లో మీ PF బ్యాలెన్స్‌ను బదిలీ చేయడానికి ఆరు సులభమైన దశలను సూచించింది.

1. ఉద్యోగి EPFO ​​https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ యూనిఫైడ్ పోర్టల్‌కి వారి UAN నంబర్, పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ కావాలి.

2. మీరు లాగిన్ అయినప్పుడు ఆన్‌లైన్ సేవల కింద అందుబాటులో ఉండే ‘సభ్యుడు – EPF ఖాతా (బదిలీ అభ్యర్థన)’పై క్లిక్ చేయాలి.

3.మీరు ప్రస్తుతం ఉద్యోగం కోసం వ్యక్తిగత సమాచారాన్నిధృవీకరించాలి.

4. మునుపటి ఉద్యోగానికి సంబంధించిన PF ఖాతాకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి మీరు దిగువన ఉన్న ‘వివరాలను పొందండి’పై క్లిక్ చేయాలి.

5. DSC లభ్యత ఆధారంగా క్లెయిమ్ ఫారమ్‌ను ధృవీకరించడం కోసం, మీరు మీ మునుపటి యజమాని లేదా ప్రస్తుత యజమానిని ఎంచుకోవడానికి ఎంపికలను పొందుతారు. మీరు యజమానులలో ఎవరినైనా ఎంచుకోవచ్చు.

6. మీరు UAN నమోదిత మొబైల్ నంబర్‌కు ‘OTP పొందండి’ దానిని నమోదు చేసి ఓకె బటన్‌పై క్లిక్ చేయాలి.

7. పైన పేర్కొన్న ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత యజమాని ఏకీకృత పోర్టల్, యజమాని ఇంటర్‌ఫేస్‌ను యాక్సెస్ చేయడం ద్వారా మీ EPF బదిలీ అభ్యర్థనను డిజిటల్‌గా ఆమోదిస్తారు. మీరు ఫారమ్ 13ని నింపాల్సి ఉంటుంది. PDF ఫార్మాట్‌లో ఉండే బదిలీ క్లెయిమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా పని సలువుగా చేసుకోవచ్చు.

Pakistan: భూకంపంతో వణికిపోయిన పాకిస్తాన్.. రిక్టర్‌ స్కేల్‌పై 5.6 తీవ్రత..

Indian Passport: పాస్‌పోర్ట్‌ ఉన్నవారికి శుభవార్త.. వీసా లేకుండా 59 దేశాలు తిరగవచ్చు.. ఎలాగంటే..?

Kia Carens: కియా కారెన్స్‌ కార్ల బుకింగ్‌ ప్రారంభం.. ధర, ఫీచర్ల గురించి తెలుసుకోండి..