AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: భూకంపంతో వణికిపోయిన పాకిస్తాన్.. రిక్టర్‌ స్కేల్‌పై 5.6 తీవ్రత..

Pakistan: పాకిస్థాన్‌లోని ఉత్తర ప్రాంతంలో శుక్రవారం రాత్రి 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని

Pakistan: భూకంపంతో వణికిపోయిన పాకిస్తాన్.. రిక్టర్‌ స్కేల్‌పై 5.6 తీవ్రత..
Earthquake 2
uppula Raju
|

Updated on: Jan 15, 2022 | 6:21 AM

Share

Pakistan: పాకిస్థాన్‌లోని ఉత్తర ప్రాంతంలో శుక్రవారం రాత్రి 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని పాకిస్తాన్ వాతావరణ శాఖ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్ -తజికిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో 100 కి.మీ లోతులో భూకంప కేంద్రం నమోదై ఉందని తెలిపింది. పెషావర్, మన్షేరా, బాలాకోట్, చర్సాడాతో సహా ఖైబర్-పఖ్తున్ఖ్వాలోని అనేక నగరాల్లో ప్రకంపనలు సంభవించాయి. ఉత్తరాదిలోని గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రాంతంలో కూడా భూకంపం సంభవించింది. ఎక్కడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

అంతకుముందు జనవరి 1న పాకిస్తాన్‌లో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. పాకిస్తాన్‌లోని ఉత్తర భాగంలో ఉన్న ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఈ ప్రకంపనలు ప్రావిన్స్ రాజధాని పెషావర్‌లో కూడా కనిపించాయి. దీంతో ఇక్కడ నివసిస్తున్న ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పాకిస్తాన్ వాతావరణ శాఖ ప్రకారం.. స్వాత్, పెషావర్, లోయర్ దిర్, స్వాబి, నౌషేరా, చిత్రాల్, మర్దాన్, బజౌర్, మలాకంద్, పబ్బి, అకోరా, ఇస్లామాబాద్‌లలో సాయంత్రం 6.15 గంటలకు ఆఫ్ఘనిస్తాన్-తజికిస్తాన్ సరిహద్దులో భూకంపం సంభవించింది. అదే సమయంలో డిసెంబర్ 8న కరాచీలోని కొన్ని ప్రాంతాలలో 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.

అమెరికాలోని అలస్కాలో మంగళవారం 6.8 తీవ్రతతో భూకంపం

మంగళవారం తెల్లవారుజామున అమెరికాలోని అలస్కాలో భూకంపం సంభవించింది. ఇక్కడి అలూటియన్ దీవుల్లో పలుచోట్ల భూకంపం సంభవించింది. ఇందులో అత్యంత బలమైన భూకంపం తీవ్రత 6.8గా నమోదైంది. ఈ భూకంపాల కేంద్రం ఉత్తర పసిఫిక్‌లోని సముద్రం కింద ఉందని, అలాస్కాలోని తక్కువ జనాభా ఉన్న ప్రాంతంలో ప్రకంపనలు సంభవించాయని అధికారులు తెలిపారు.

Indian Passport: పాస్‌పోర్ట్‌ ఉన్నవారికి శుభవార్త.. వీసా లేకుండా 59 దేశాలు తిరగవచ్చు.. ఎలాగంటే..?

Kia Carens: కియా కారెన్స్‌ కార్ల బుకింగ్‌ ప్రారంభం.. ధర, ఫీచర్ల గురించి తెలుసుకోండి..

ICC U19 ప్రపంచ కప్ షెడ్యూల్‌ విడుదల.. 16 జట్లు, 22 రోజులు ఒక టైటిల్