ICC U19 ప్రపంచ కప్ షెడ్యూల్‌ విడుదల.. 16 జట్లు, 22 రోజులు ఒక టైటిల్

ICC U19 World Cup: జనవరి 14 నుంచి ICC U19 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. యశ్ ధుల్ కెప్టెన్సీలో భారత జట్టు ఈ టోర్నీలో అడుగుపెట్టనుంది.

ICC U19 ప్రపంచ కప్ షెడ్యూల్‌ విడుదల.. 16 జట్లు, 22 రోజులు ఒక టైటిల్
U19 Wc
Follow us

|

Updated on: Jan 14, 2022 | 11:49 AM

ICC U19 World Cup: జనవరి 14 నుంచి ICC U19 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. యశ్ ధుల్ కెప్టెన్సీలో భారత జట్టు ఈ టోర్నీలో అడుగుపెట్టనుంది. టీమ్ ఇండియా (U19 భారత జట్టు) చరిత్రను పరిశీలిస్తే ఈ టోర్నమెంట్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. 2000, 2008, 2012, 2018 సంవత్సరాల్లో టీమ్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. గత మూడు సార్లు భారత జట్టు ఫైనల్స్‌కు చేరుకోవడంలో విజయవంతమైంది. వెస్టిండీస్‌లోని నాలుగు దేశాల్లో 48 మ్యాచ్‌లు నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది.

ఈ కీలక టోర్నీలో ఈసారి 16 జట్లు పాల్గొనబోతున్నాయి. ఈ 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. దక్షిణాఫ్రికా, ఐర్లాండ్‌, ఉగాండాలతో భారత్‌ గ్రూప్‌-బిలో నిలిచింది. భారత్‌, పాకిస్థాన్‌లు ఒకే గ్రూపులో కనిపిస్తాయని అభిమానులు ఊహించారు కానీ అది జరగలేదు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌, కెనడా, యూఏఈలు గ్రూప్‌ ఏలో ఉండగా, గ్రూప్‌ సీలో పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌, జింబాబ్వే, పపువా న్యూ గినియా ఉన్నాయి. కరోనా కారణంగా న్యూజిలాండ్ వైదొలిగిన తర్వాత స్కాట్లాండ్ ఈ గ్రూప్‌లో చేర్చారు. గ్రూప్-డిలో ఆతిథ్య వెస్టిండీస్, ఆస్ట్రేలియా, శ్రీలంకలు చోటు దక్కించుకున్నాయి.

జనవరి 14 నుంచి మ్యాచ్‌లు ప్రారంభం

గ్రూప్ దశ మ్యాచ్‌లు జనవరి 14 నుంచి ప్రారంభమై జనవరి 22 వరకు జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 5న జరగనుంది. జనవరి 15న దక్షిణాఫ్రికాతో భారత్ తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. గతసారి బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్‌లో జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది అయితే ఈసారి యష్ ధుల్ కెప్టెన్సీలో జట్టు మరోసారి భారత్‌ను ఛాంపియన్‌గా నిలుస్తుందని ఆశిస్తున్నారు. అన్ని మ్యాచ్‌లు 7:30 PM ISTకి ప్రారంభమవుతాయి.

14 జనవరి – వెస్టిండీస్ v ఆస్ట్రేలియా

శ్రీలంక vs స్కాట్లాండ్

15 జనవరి – జింబాబ్వే v పాపువా న్యూ గినియా

ఐర్లాండ్ vs ఉగాండా

భారత్ vs సౌతాఫ్రికా

కెనడా vs UAE

16 జనవరి – బంగ్లాదేశ్ v ఇంగ్లాండ్

17 జనవరి – వెస్టిండీస్ v స్కాట్లాండ్

ఆస్ట్రేలియా vs జింబాబ్వే

జనవరి 18 – ఆఫ్ఘనిస్తాన్ v పాపువా న్యూ గినియా

దక్షిణాఫ్రికా vs ఉగాండా

ఇంగ్లాండ్ vs కెనడా

19 జనవరి – ఆస్ట్రేలియా v స్కాట్లాండ్

ఇండియా vs ఐర్లాండ్

20 జనవరి – పాకిస్థాన్ v ఆఫ్ఘనిస్తాన్

బంగ్లాదేశ్ vs కెనడా

ఇంగ్లాండ్ vs UAE

జనవరి 21 – వెస్టిండీస్ v శ్రీలంక

దక్షిణాఫ్రికా vs ఐర్లాండ్

జనవరి 22 – బంగ్లాదేశ్ v UAE

భారత్ vs ఉగాండా

పాకిస్థాన్ vs పాపువా న్యూ గినియా

ఆఫ్ఘనిస్తాన్ vs జింబాబ్వే

25 జనవరి – ప్లేట్ క్వార్టర్ ఫైనల్స్ 1 మరియు 2

26 జనవరి – సూపర్ లీగ్ క్వార్టర్ ఫైనల్ 1

ప్లేట్ క్వార్టర్ ఫైనల్ 3

ప్లేట్ క్వార్టర్ ఫైనల్ 4

27 జనవరి – సూపర్ లీగ్ క్వార్టర్ ఫైనల్ 4

28 జనవరి – సూపర్‌లీగ్ క్వార్టర్-ఫైనల్ 3

తొమ్మిదో ప్లేస్ ప్లేఆఫ్ సెమీ-ఫైనల్

13వ స్థానం ప్లేఆఫ్ సెమీఫైనల్

29 జనవరి – సూపర్ లీగ్ క్వార్టర్ ఫైనల్ 2

13వ స్థానం ప్లేఆఫ్ సెమీఫైనల్

9వ స్థానం సెమీఫైనల్

30 జనవరి – ఐదవ స్థానం ప్లేఆఫ్

15వ స్థానం ప్లేఆఫ్

13వ స్థానం ప్లేఆఫ్

31 జనవరి – 11వ ప్లేస్ ప్లేఆఫ్

ఫైనల్స్

ఫిబ్రవరి 1 – మొదటి సెమీ-ఫైనల్

ఫిబ్రవరి 2 – రెండవ సెమీ-ఫైనల్

ఫిబ్రవరి 3 – ఐదవ స్థానం ప్లేఆఫ్

ఏడవ స్థానం ప్లేఆఫ్

ఫిబ్రవరి 4 – మూడవ స్థానం ప్లేఆఫ్

ఫిబ్రవరి 5 – ఫైనల్స్

Viral Photos: ప్రజలు ఈమెని దేవకన్యలా భావిస్తారు..! ఎందుకో తెలుసా..?

Ginger Pak: దగ్గు, సీజనల్‌ ఫ్లూ నివారించడానికి జింజర్ పాక్.. ఆయుష్ మంత్రిత్వ శాఖ సలహా..

WI vs IRE: వెస్టిండీస్‌ కొంపముంచిన వర్షం.. ఐర్లాండ్‌ సునాయస విజయం..