AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WI vs IRE: వెస్టిండీస్‌ కొంపముంచిన వర్షం.. ఐర్లాండ్‌ సునాయస విజయం..

WI vs IRE:వర్షం కారణంగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఐర్లాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ని 1-1తో సమం

WI vs IRE: వెస్టిండీస్‌ కొంపముంచిన వర్షం.. ఐర్లాండ్‌ సునాయస విజయం..
Wi Vs Ire
uppula Raju
|

Updated on: Jan 14, 2022 | 9:34 AM

Share

WI vs IRE:వర్షం కారణంగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఐర్లాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ని 1-1తో సమం చేసింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ ప్రకారం నిర్ణయం ఐర్లాండ్‌కు అనుకూలంగా మారింది. అంతకుముందు తొలి వన్డేలో ఆతిథ్య వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఇరు జట్ల మధ్య చివరి మ్యాచ్ జనవరి 16న జరుగుతుంది. రెండో వన్డేలో గెలుపు సాధించడంతో ఐర్లాండ్ జట్టుకు కాస్త ఊరట లభించింది. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. దీంతో నిర్ణయాత్మక మూడో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుందని అంచనా.

రెండో వన్డేలో వెస్టిండీస్ ఓటమికి ప్రధాన కారణం వారి బ్యాటింగ్‌ తీరు. రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు రెండో వన్డేలో 50 ఓవర్లు కూడా ఆడలేకపోయింది. ఐర్లాండ్ బౌలర్ల ముందు 48 ఓవర్లలో 229 పరుగులకే చాపచుట్టేసింది. ఇందులో కూడా ఒక్కరు కూడా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఆడలేదు. లోయర్ ఆర్డర్‌లో రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్ వేగవంతమైన ఇన్నింగ్స్‌లు ఆడటం ద్వారా కరేబియన్ జట్టు 200 పరుగుల మార్కును దాటగలిగింది. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రొమారియో షెపర్డ్ జట్టు టాప్ స్కోరర్. హాఫ్ సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్. 41 బంతుల్లో 50 పరుగులు చేశాడు. మరోవైపు తొమ్మిదో నెంబర్ బ్యాట్స్‌మెన్ ఒడియన్ స్మిత్‌ కేవలం 19 బంతుల్లోనే 46 పరుగులు చేశాడు. మిగతావారెవ్వరూ ఐరిష్ బౌలింగ్ ను ధీటుగా ఎదుర్కోలేదు.

ఐర్లాండ్ తరఫున 28 ఏళ్ల ఆల్ రౌండర్ ఆండీ మెక్‌బ్రైన్ జట్టులో అత్యంత విజయవంతమైన బౌలర్. 10 ఓవర్లలో 36 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఈ నాలుగు వికెట్లు కరీబియన్ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లవే. అతనికి తోడు క్రేగ్ యంగ్ 8 ఓవర్లలో 42 పరుగులిచ్చి 3 వికెట్లు, జోష్ లిటిల్ 2 వికెట్లు తీశారు. 230 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఐర్లాండ్‌ వెనుదిరగగానే వర్షం మొదలైంది. వర్షం ఆగిన తర్వాత జట్లు మైదానంలోకి దిగడంతో లక్ష్యంలో మార్పు వచ్చింది. డక్‌వర్త్ లూయిస్ నియమం ప్రకారం ఐర్లాండ్ జట్టు గెలవాలంటే 36 ఓవర్లలో 168 పరుగులు చేయాల్సి ఉంది. వారు 33వ ఓవర్‌లో 5 వికెట్లు కోల్పోయి సాధించారు. ఐర్లాండ్ తరఫున హ్యారీ టెక్టర్ 54 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. బంతితో 4 వికెట్లు తీసిన ఆండీ మెక్‌బ్రైన్ 35 పరుగులు చేసి జట్టులో విజయవంతమైన రెండో స్కోరర్‌గా నిలిచాడు.

ప్లాట్లు లేదా అపార్ట్మెంట్లలో పెట్టుబడి పెడుతున్నారా..! కచ్చితంగా ఈ విషయాలను గమనించండి..?

Srilanka: కిలో పచ్చిమిర్చి రూ.710, టమోటా 200.. దివాళా అంచున శ్రీలంక..

WHO గుడ్‌న్యూస్.. మరో రెండు కొత్త కరోనా మందులకు ఆమోదం.. అవేంటంటే..?