AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్లాట్లు లేదా అపార్ట్మెంట్లలో పెట్టుబడి పెడుతున్నారా..! కచ్చితంగా ఈ విషయాలను గమనించండి..?

Realty Sector‌: రియాల్టీ సెక్టార్‌లో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నారా.. ఫ్లాట్ లేదా రెసిడెన్షియల్ ప్లాట్ తీసుకోవాలా..? అర్థం కావడం లేదా అప్పుడు

ప్లాట్లు లేదా అపార్ట్మెంట్లలో పెట్టుబడి పెడుతున్నారా..! కచ్చితంగా ఈ విషయాలను గమనించండి..?
Home
uppula Raju
|

Updated on: Jan 14, 2022 | 9:14 AM

Share

Realty Sector‌: రియాల్టీ సెక్టార్‌లో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నారా.. ఫ్లాట్ లేదా రెసిడెన్షియల్ ప్లాట్ తీసుకోవాలా..? అర్థం కావడం లేదా అప్పుడు ఈ విషయాలు తెలుసుకుంటే కొంచెం క్లారీటి వస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్లాట్‌లో డబ్బు పెట్టుబడి పెట్టడం (రెసిడెన్షియల్ ప్లాట్‌లో రాబడి) లాభదాయకంగా నిరూపణ అయింది. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలలోఈ బిజినెస్ జరుగుతుంది. 2015 నుంచి ధరలలో నిత్యం మార్పులు ఉంటున్నాయి. 2015 నుంచి రెసిడెన్షియల్ ప్లాట్ల ధరలు ఏటా సగటున ఏడు శాతం చొప్పున పెరిగాయి. అయితే ఈ కాలంలో అపార్ట్‌మెంట్లు ఏటా రెండు శాతం మాత్రమే పెరిగాయి.

ఇండియా హౌసింగ్.కామ్, U.S. యాజమాన్యంలోని యూనిట్, ఒక ప్రకటనలో.. “దేశంలో పెట్టుబడి పరంగా అపార్ట్‌మెంట్ కొనుగోలు కంటే రెసిడెన్షియల్ ప్లాట్‌లు మెరుగ్గా ఉన్నాయి, 2015 నుంచి అపార్ట్‌మెంట్‌ల కంటే ప్లాట్‌ల నుంచి రాబడి ఎక్కువగా ఉంది.” అని తేల్చింది. జాతీయ రాజధాని ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్‌లలో ఈ బిజినెస్ ఎక్కువగా జరుగుతుంది. విశేషమేమిటంటే ఈ కాలంలో కరోనా మహమ్మారి ప్రభావం కూడా ఎక్కువగానే ఉంది. రెసిడెన్షియల్ ప్లాట్లు పెట్టుబడిపై అధిక రాబడిని ఇస్తున్నాయి. పెద్ద నగరాల్లో ప్లాట్ల కొరత పరిమిత భూమి ఉండటం దీనికి పెద్ద కారణం. అందుకే పెద్ద పెద్ద నగరాల శివార్లలో ఇటువంటి ప్రాజెక్ట్‌లను ప్రారంభించడం ద్వారా కంపెనీలు ఎక్కువగా ఆర్జిస్తున్నాయి.

హౌసింగ్.కామ్ ఈ ఎనిమిది నగరాల్లోని ప్రజలు రెసిడెన్షియల్ ప్లాట్లు తీసుకునే బదులు అపార్ట్‌మెంట్లు కొనేందుకు మొగ్గు చూపుతున్నారని తెలిపింది. భద్రత, ప్రత్యామ్నాయ విద్యుత్, కార్ పార్కింగ్, క్లబ్, జిమ్, స్విమ్మింగ్ పూల్, గార్డెన్ ఏరియా ఇతర సౌకర్యాల మెరుగైన సౌకర్యల వల్ల వీరు ఇటువైపున మొగ్గు చూపారు. దీనికి తోడు పెరిగిన ప్లాట్ల ధరలు కూడా ఒక కారణం. దక్షిణ భారతదేశంలోని ప్రధాన పెద్ద నగరాల్లో ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో నివాస స్థలాల ధరలు విపరీతంగా పెరిగాయి. 2018 నుంచి ఈ నగరాల్లో భూముల ధరలు 13-21 శాతం శ్రేణిలో పెరగగా గత మూడేళ్లలో అపార్ట్‌మెంట్ ధరలు 2-6 శాతం రేంజ్‌లో మాత్రమే ఉన్నాయి.

Srilanka: కిలో పచ్చిమిర్చి రూ.710, టమోటా 200.. దివాళా అంచున శ్రీలంక..

WHO గుడ్‌న్యూస్.. మరో రెండు కొత్త కరోనా మందులకు ఆమోదం.. అవేంటంటే..?

Corona: కరోనా టెర్రర్‌.. ఢిల్లీ, ముంబైలలో త్వరలో పీక్ స్టేజ్..! 8 రోజులుగా దేశంలో రోజుకు లక్షకు పైగా కొత్త కేసులు..