Update: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 800 మందికి తండ్రి అయిన మిల్క్ డెలివరీ బాయ్! కేవలం కల్పిత కథ మాత్రమే..

Update: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 800 మందికి తండ్రి అయిన మిల్క్ డెలివరీ బాయ్! అని ఇంతకముందు మేము చేసిన పోస్ట్ పూర్తి అవాస్తవమని తెలియజేస్తున్నాం. ‘డైలీ న్యూస్ రిపోర్టడ్’ అనే ఒక వ్యంగ్యపు వార్తలు రాసే వెబ్ సైట్ దీనిని 24 డిసెంబర్ 2021న పబ్లిష్ చేసింది. ఇదొక కల్పిత కథగా పేర్కొంది. ఇలాంటి కథలను హాస్యం, వ్యంగ్యం కోసం ప్రచురిస్తుందని ఆ వెబ్ సైట్ వివరణలో పేర్కొంది. అలాగే తమ ఆర్టికల్ […]

Update: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 800 మందికి తండ్రి అయిన మిల్క్ డెలివరీ బాయ్! కేవలం కల్పిత కథ మాత్రమే..
Milk Man
Follow us
Balaraju Goud

| Edited By: Ravi Kiran

Updated on: Jan 17, 2022 | 5:00 PM

Update: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 800 మందికి తండ్రి అయిన మిల్క్ డెలివరీ బాయ్! అని ఇంతకముందు మేము చేసిన పోస్ట్ పూర్తి అవాస్తవమని తెలియజేస్తున్నాం. ‘డైలీ న్యూస్ రిపోర్టడ్’ అనే ఒక వ్యంగ్యపు వార్తలు రాసే వెబ్ సైట్ దీనిని 24 డిసెంబర్ 2021న పబ్లిష్ చేసింది. ఇదొక కల్పిత కథగా పేర్కొంది. ఇలాంటి కథలను హాస్యం, వ్యంగ్యం కోసం ప్రచురిస్తుందని ఆ వెబ్ సైట్ వివరణలో పేర్కొంది. అలాగే తమ ఆర్టికల్ లో ప్రచురితమైన పేర్లు కూడా నిజమైనవి కావని స్పష్టం చేసింది. అటు ఆర్టికల్ లో ఇచ్చిన ఫోటో కూడా ‘రాండాల్ జెఫ్రీస్’ అనే వ్యక్తిది కాదని ఓ ఇండిపెండెంట్ ఫ్యాక్ట్ చెక్ టీం ధృవీకరించింది. ఆ ఫోటో ఒక స్టాక్ ఫోటో వెబ్ సైట్ నుండి తీసుకున్నదిగా పేర్కొంది. కావున  ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 800 మందికి మిల్క్ డెలివరీ బాయ్ తండ్రయ్యాడని మేము చేసిన పోస్ట్ తప్పు(నిరాధారమైంది) అని గమనించగలరు.

California Milkman Fathered: ఒకరు కాదు.. ఇద్దరు కాదు..ఏకంగా 800 మందికి తండ్రయ్యాడు.. అతడేమీ అందగాడు కాదు.. కేవలం మిల్క్‌ డెలివరీ బాయ్‌.. అలా ఆడాళ్లు దగ్గరయ్యాడు.. అప్పట్లో డీఎన్‌ఏ లాంటి టెస్టులు లేవు.. అమెరికా కాలిఫోర్నియా స్టేట్‌లో మిల్క్‌ మ్యాన్‌ లీలలు వెలుగులోకి వచ్చి అంతా అవాక్కక్కైపోయారు..

దక్షిణ కాలిఫోర్నియా శాన్ డియాగో ప్రాంతంలో 1950 60 నాటి ముచ్చట ఇది.. రాండాల్ జెఫ్రీస్ ఈ ప్రాంతంలో మిల్క్‌ డెలివరీ బాయ్‌గా పని చేస్తాడు.. అందరూ రాండీ అని ముద్దుగా పిలుస్తారు.. అప్పట్లో ఇప్పుడు ఉన్నట్లుగా పాల ప్యాకెట్లు లేవు.. నేరుగా క్యాన్లలో లేదా పాల సీసాల ద్వారా ఇంటింటికీ తిరిగి ఇవ్వాల్సిందే.. రాండాల్ జెఫ్రీస్‌కు ఇదో ప్లస్‌ పాయింట్‌ అయింది..

రాండాల్‌ సహజంగానే అందగాడు.. అలా తన కస్టమర్లందరికీ దగ్గరయ్యాడు.. ముఖ్యంగా అక్కడి గృహిణులు అతనికి సన్నిహితులైపోయారు.. పాలు సరఫరా చేసేందుకు వచ్చిన రాండీకి స్నాక్స్‌ ఇచ్చేవారు.. ఈ సంబంధం కాస్తా వంటింటి నుంచి పడక గదిలోకి దారి తీసింది.. అలా విచ్ఛలవిడి శృంగార పురుషుడుగా మారిపోయాడు..

రాండాల్‌ జెఫ్రీస్‌ కారణంగా ఈ ప్రాంతంలో ఎంతో మంది గర్భం దాల్చారు.. అయితే ఆరోజుల్లో డీఎన్‌ఏలాంటి టెస్టులు లేవు.. భర్తలకు అనుమానాలు వచ్చినా వ్యవహారం బయట పడకుండా గుట్టుగానే ఉండిపోయింది.. రాండీకి దగ్గరైనవారిలో ఎక్కువగా మాజీ సైనికుల భార్యలే ఉన్నారు..

ఇటీవలి కాలంలో శాండియాగో ప్రాంతాంలో కొన్ని కేసుల పరిశోధనల సందర్భంగా చాలా డీఎన్‌ఏల మధ్య పోలికలు కనిపించాయి.. వీటన్నింటి మీద అధికారులు దృష్టి సారిస్తే.. అవన్నీ రాండాల్‌ జఫ్రీస్‌వేనని తేలింది.. దాదాపు 800 వరకూ డీఎన్‌ఏలు ఒకేలా ఉన్నాయని తెలింది..

మరో విచిత్రం ఏమింటే రాండాల్‌ జఫ్రీస్‌కు భార్యా పిల్లలు లేరట.. 97 ఏళ్ల వయసులో ఇలాంటి వార్త వినడం సంతోషమా? కాదా? అనేది కూడా తేల్చుకోలేక ఉక్కిరిబిక్కివరవుతున్నారు.. మొత్తానికి మిల్క్‌ డెలివరీ బాయ్‌ ఎంత పని చేశాడు అంటూ ఇక్కడి మగాళ్లంతా గుసగుసలాడుకుంటున్నారట..

Disclaimer: (ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాలు, పలు ప్రాంతీయ, జాతీయ డిజిటల్ మీడియాలో ప్రచురితమైన కథనాలు ఆధారంగా పబ్లిష్ చేయబడింది. ఈ వార్త వెనుక ఉన్న నిజానిజాలపై టీవీ9 తెలుగు డిజిటల్ టీమ్ ఎలాంటి ఫ్యాక్ట్ చెక్ నిర్వహించలేదు. దీనిని పాఠకులు గమనించగలరు)

Read Also…  చిచ్చరపిడుగు..వరల్డ్‌ రికార్డ్‌ బ్రేక్‌ చేసిన కడప చిన్నారి.. ఎట్రాక్ట్ చేస్తున్న వీడియో..