AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Vs South Africa 3rd Test Live: దక్షిణాఫ్రికా విజయం.. టీమిండియాకు భంగపాటు..

సిరీస్ నిర్ణయాత్మక మూడో టెస్టు మ్యాచ్‌లో నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. విజయం కోసం ఇరు జట్లు ప్రయత్నిస్తున్నాయి...

India Vs South Africa 3rd Test Live: దక్షిణాఫ్రికా విజయం.. టీమిండియాకు భంగపాటు..
Ind Vs Sa
Ravi Kiran
|

Updated on: Jan 14, 2022 | 6:18 PM

Share

దక్షిణాఫ్రికా గడ్డపై తొలి సిరీస్‌ విజయాన్ని సాధించి చరిత్ర సృష్టింద్దామనుకున్న టీమిండియాకు భంగపాటు ఎదురైంది. నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. టీమిండియా నిర్ధేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా జట్టు కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది.

టీమిండియా ప్లేయింగ్ XI: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్యా రహానే, రిషబ్ పంత్(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్

దక్షిణాఫ్రికా ప్లేయింగ్ XI: డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్‌రామ్, కీగన్ పీటర్‌సన్, రాస్సీ వాన్ డెర్ డుస్సెన్, టెంబా బావుమా, కైల్ వెర్రెయిన్నే (కీపర్), మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, డువాన్ ఒలివియర్, లుంగి ఎంగిడి.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 14 Jan 2022 06:13 PM (IST)

    సఫారీల విజయం

    దక్షిణాఫ్రికా గడ్డపై తొలి సిరీస్‌ విజయాన్ని సాధించి చరిత్ర సృష్టింద్దామనుకున్న టీమిండియాకు భంగపాటు ఎదురైంది. నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. టీమిండియా నిర్ధేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా జట్టు కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది.

  • 14 Jan 2022 04:07 PM (IST)

    లంచ్ బ్రేక్..

    మూడో టెస్ట్ భారత్ చేయి దాటిపోతోంది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా విజయానికి 41 పరుగుల దూరంలో ఉంది.

  • 14 Jan 2022 03:24 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా..

    దక్షిణాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. కీలక ఇన్నింగ్స్‌ ఆడుతోన్న పీటర్సన్(82) ఠాకూర్ బౌలింగ్‌లో బౌల్డ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. దీనితో సఫారీలు 155 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం బవుమా(౦), డుస్సేన్(18) క్రీజులో ఉన్నారు.

  • 14 Jan 2022 03:06 PM (IST)

    డ్రింక్స్ బ్రేక్.. 64 పరుగుల దూరంలో సఫారీలు..

    దక్షిణాఫ్రికా బ్యాటర్లు అద్భుతంగా ఆడుతున్నారు. భారత బౌలర్ల పదునైన బంతులను సమర్ధవంతంగా ఎదుర్కుంటూ టార్గెట్‌కు చేరువ అవుతున్నారు. ప్రస్తుతం డ్రింక్స్ బ్రేక్ కాగా.. విజయానికి సఫారీలకు ఇంకా 64 పరుగులు కావాల్సి ఉంది. ప్రస్తుతం పీటర్సన్(77), డుస్సేన్(16) క్రీజులో ఉన్నారు.

  • 14 Jan 2022 02:25 PM (IST)

    100 దిగువకు వచ్చిన టార్గెట్..

    సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లను సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్లు సమర్ధవంతంగా ఎదుర్కుంటున్నారు. మంచి బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోర్ బోర్డును ముందుకు కదిలిస్తున్నారు. ఈ క్రమంలోనే టార్గెట్‌ను 100 పరుగుల దిగువకు తీసుకొచ్చారు. ప్రస్తుతం 35 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. పీటర్సన్(53), డుస్సేన్(11)తో క్రీజులో ఉన్నారు.

  • 14 Jan 2022 02:21 PM (IST)

    పీటర్సన్ అర్ధ శతకం..

    ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన పీటర్సన్ మరోసారి అదరగొట్టాడు. 212 పరుగుల లక్ష్యచేధనలో భాగంగా భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కుంటూ అర్ధ సెంచరీ పూర్తీ చేశాడు. 65 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు ఉన్నాయి.

  • 14 Jan 2022 02:16 PM (IST)

    నాలుగో రోజు ఆట ప్రారంభం..

    సిరీస్ నిర్ణయాత్మక మూడో టెస్టు మ్యాచ్‌లో నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. విజయం కోసం ఇరు జట్లు ప్రయత్నిస్తున్నాయి. త్వరగా వికెట్లు పొందేందుకు భారత్ పదునైన బౌలింగ్ చేస్తుండగా.. సఫారీలు ఆ బంతులను సమర్ధవంతంగా ఎదుర్కుంటూ టార్గెట్ ను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

Published On - Jan 14,2022 2:14 PM