- Telugu News Photo Gallery Viral photos Ukraine woman named alona kravchenko called real life rapunzel because her hair is so long
Viral Photos: ప్రజలు ఈమెని దేవకన్యలా భావిస్తారు..! ఎందుకో తెలుసా..?
Viral Photos: మీరు చిన్నతనంలో చాలా కథలు విని ఉంటారు. అందులో దేవకన్యల కథలు కూడా వినే ఉంటారు. అయితే నిజజీవితంలో దేవకన్యలు
Updated on: Jan 14, 2022 | 11:34 AM

మీరు చిన్నతనంలో చాలా కథలు విని ఉంటారు. అందులో దేవకన్యల కథలు కూడా వినే ఉంటారు. అయితే నిజజీవితంలో దేవకన్యలు ఉంటారో లేదో ఎవ్వరికీ తెలియదు. కానీ ఉక్రెయిన్‌లో నిజంగా దేవకన్యలా అనిపించే ఒక యువతి ఉంది.

ఉక్రెయిన్‌కు చెందిన అలోనా క్రావ్‌చెంకో జుట్టు 6న్నర అడుగుల పొడవు, ఎంతో అందంగా, పొడవుగా, సిల్కీగా ఉంటుంది. ఆమె ఉంగరాల జుట్టును చూసి ప్రజలు ఆమెను దేవకన్యాలా భావిస్తారు.

ప్రజలందరు తనని రాపుంజెల్ అని పిలుస్తారని అలియోనా క్రావ్‌షెంకో స్వయంగా చెప్పింది. వాస్తవానికి రాపుంజెల్ అంటే జర్మన్‌కి చెందిన ఒక పొడవాటి జుట్టు కలిగిన ఒక యువతి కథ.

అలోనా వృత్తిరీత్యా వ్యాపారవేత్త. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మీడియా కథనాల ప్రకారం, గత 30 సంవత్సరాలుగా ఆమె జుట్టుని కత్తిరించలేదు. ఎప్పటికప్పుడు జుట్టుని ట్రిమ్మింగ్ చేస్తుంది. తద్వారా జుట్టు బాగా పెరుగుతూ ఉంటుంది.

అలోనాకి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మహిళలు జుట్టు కత్తిరించుకోకూడదని ఆమె తల్లి చెప్పింది. అప్పటి నుంచి ఆమె తన జుట్టును ఎప్పుడూ కత్తిరించుకోలేదు.



