AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Insurance: కొవిడ్‌ నుంచి కోలుకున్నవారు ఇన్సూరెన్స్‌ పాలసీ పొందడం కష్టమే..! ఎందుకో తెలుసా..?

Term Insurance: కరోనా థర్డ్‌ వేవ్‌ వల్ల బీమా కంపెనీలు మళ్లీ తమ పాత వైఖరిని ప్రదర్శిస్తున్నాయి. కరోనా రోగులకు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వడానికి విముఖత

Insurance: కొవిడ్‌ నుంచి కోలుకున్నవారు ఇన్సూరెన్స్‌ పాలసీ పొందడం కష్టమే..! ఎందుకో తెలుసా..?
Insurance
uppula Raju
|

Updated on: Jan 15, 2022 | 8:35 AM

Share

Term Insurance: కరోనా థర్డ్‌ వేవ్‌ వల్ల బీమా కంపెనీలు మళ్లీ తమ పాత వైఖరిని ప్రదర్శిస్తున్నాయి. కరోనా రోగులకు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వడానికి విముఖత చూపుతున్నాయి. ఇటీవల ఓ వ్యక్తి Omicron వేరియంట్‌తో బారిన పడ్డాడు. అతను ఒక వారంలో కోలుకున్నాడు. కానీ ఈ ఒక్క వారంలో అతను తన కుటుంబ భవిష్యత్తు గురించి చాలా ఆందోళన చెందాడు. కోలుకున్న వెంటనే బీమా ఏజెంట్ కు ఫోన్ చేసి కోటి రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనే కోరికను వ్యక్తం చేశాడు. కానీ సదరు బీమా కంపెనీ ఇప్పుడు ఇవ్వలేమని నిరాకరించింది. అతడు కనీసం మూడు నెలలైనా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ పొందలేనని తెలిసి ఆశ్చర్యపోయాడు.

కరోనా థర్డ్‌ వేవ్ రాకతో బీమా కంపెనీలు మళ్లీ తమ పాత వైఖరిని ప్రదర్శించడం ప్రారంభించాయి. ముఖ్యంగా కరోనా పేషెంట్లకు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇవ్వడం లేదు. కొత్త పాలసీ తీసుకునేవారికి ఒకటి నుంచి మూడు నెలల వెయిటింగ్ పీరియడ్, అదనపు మెడికల్ టెస్ట్ మొదలైన షరతులు విధిస్తున్నారు. ఒక వ్యక్తి కరోనా నుంచి కోలుకున్నట్లయితే అతనికి తత్కాల్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వరు. అతను ఒకటి నుంచి కనీసం ఆరు నెలల వరకు వేచి ఉండవలసి ఉంటుంది. ఇదొక్కటే కాదు అటువంటి రోగులలో ఇన్ఫెక్షన్ స్థాయి ఎక్కువగా ఉంటే ఆస్పత్రిలో అడ్మిట్ కావాల్సిన అవసరం ఉంటే అప్పుడు ఛాతీ ఎక్స్-రే వంటి అనేక అదనపు వైద్య పరీక్షలు నిర్వహించాలనే డిమాండ్ ఉంటుంది.

గత సంవత్సరం కరోనా సెకండ్‌ వేవ్‌లో లక్షల మంది ప్రజలు కరోనాతో బాధపడుతున్నప్పుడు అటువంటి రోగులకు టర్మ్ పాలసీలు ఇవ్వడానికి బీమా కంపెనీలు విముఖత చూపడం మొదటిసారిగా కనిపించింది. ఇది మాత్రమే కాదు టర్మ్ పాలసీలను కొనడం కష్టంగా మారుతోంది, వాటి ప్రీమియంలు, కవరేజీ తక్కువై పోయింది. కోవిడ్‌కు ముందు 40 సంవత్సరాల వయసు ఉన్నవారు 25 లక్షల బీమా కవరేజీని సులభంగా పొందారు. ఇప్పుడు కోవిడ్ బారిన పడిన తర్వాత వారు 10 లక్షల కంటే ఎక్కువ పొందడం కష్టంగా మారింది. కంపెనీల ఈ ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా రెగ్యులేటర్ కూడా ఎటువంటి చర్య తీసుకోలేరని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే కంపెనీలు తమ వ్యాపార అవకాశాలకు అనుగుణంగా షరతులు విధించే హక్కును కలిగి ఉంటాయి. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ IRDA (IRDAI) లేదా ఏదైనా అంబుడ్స్‌మన్ కూడా మీరు బీమా కంపెనీకి కస్టమర్ అయినప్పుడు మాత్రమే ఏదైనా చేయగలరు.

Mutual Fund: మ్యూచువల్ ఫండ్స్‌ ద్వారా డబుల్‌ ప్రాఫిట్‌.. పిక్స్‌డ్‌ డిపాజిట్ల కంటే చాలా రెట్లు ఎక్కువ.. ఎలాగంటే..?

Diabetes: మధుమేహ వ్యాధిగ్రస్తులకు శుభవార్త.. 30 నిమిషాల్లో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించవచ్చు..!

PF Transfer: రెండు, మూడు ఉద్యోగాలు మారారా..? పీఎఫ్‌ బదిలీ గురించి ముఖ్యమైన వివరాలు తెలుసుకోండి..