AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wikipedia: ఆవకాయ నుంచి అణు బాంబు వరకూ ఒక్క క్లిక్ తో విశ్వసమాచారం.. వీకీపీడియా.. దీనిని ఎవరు ఎప్పుడు ప్రారంభించారో తెలుసా?

వికీపీడియా.. ఈ పేరు తెలీని నెటిజన్ ఉండరు. మనకు ప్రపంచంలో ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా సరే ఇందులో సమాచారం(Information) కచ్చితంగా దొరుకుతుంది.

Wikipedia: ఆవకాయ నుంచి అణు బాంబు వరకూ ఒక్క క్లిక్ తో విశ్వసమాచారం.. వీకీపీడియా.. దీనిని ఎవరు ఎప్పుడు ప్రారంభించారో తెలుసా?
Wikipedia
KVD Varma
|

Updated on: Jan 15, 2022 | 8:59 AM

Share

వికీపీడియా.. ఈ పేరు తెలీని నెటిజన్ ఉండరు. మనకు ప్రపంచంలో ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా సరే ఇందులో సమాచారం(Information) కచ్చితంగా దొరుకుతుంది. వికీపీడియా(Wikipedia) అనేది ఒకరకంగా చెప్పాలంటే ప్రపంచ సంగతుల్ని డిజిటల్(Digital) గా ఒడిసిపట్టిన ఒక బృహత్తర గ్రంధం. మామూలుగా ఏదైనా పుస్తకం ప్రచురిస్తే.. తరువాత దాని ప్రచురణ జరిగేదాకా అందులో మార్పులు.. చేర్పులు చేయలేము. పైగా దానిలో వచ్చే తప్పొప్పులను సరిచేసే అవకాశం రచయితకు తప్ప మరొకరికి ఉండదు. కానీ, వీకీపీడియా ప్రపంచంలో ఏమూలనున్న వారైనా ఎక్సెస్ చేయవచ్చు. అందులోని విషయాలకు సవరణలు లేదా కొనసాగింపులు యాడ్ చేయవచ్చు. ఇది ప్రజల శోధన ఫలితాల్లో ముఖ్యమైన భాగంగా మారిపోయింది అనడంలో సందేహం లేదు. ఇప్పుడు వీకీపీడియా గురించి ఈ పరిచయం ఎందుకంటే.. ఈరోజు (జనవరి 15) వీకీపీడియా పుట్టినరోజు. ఇప్పటికి సరిగ్గా 21 ఏళ్ల క్రితం అంటే 2001 సంవత్సరంలో జిమ్మీ వేల్స్ .. లారీ సాంగర్ ప్రారంభించారు. వీరిద్దరూ వికీపీడియాను ఎవరైనా సవరించవచ్చు అనే ఆలోచనతో ప్రారంభించారు. సాంకేతిక ప్రపంచంలో, అలా సేకరించిన సమాచారాన్ని క్రౌడ్ సోర్సింగ్ అంటారు.

300 భాషలలో.. 2 బిలియన్లకు పైగా నెలవారీ వినియోగదారులు

వికీపీడియా మొదట ఆంగ్ల భాషలో మాత్రమే ప్రారంభించారు. కానీ, ఇప్పుడు 300 భాషలలో అందుబాటులో ఉంది. వికీపీడియా 2003లో హిందీలో ప్రారంభామైంది. తరువాత కొద్ది సంవత్సరాల్లోనే దాదాపుగా అన్ని భారతీయ భాషల్లో ఇది పరిచయం అయింది. వికీపీడియాలో 55 మిలియన్ కంటే ఎక్కువ వ్యాసాలు ఉన్నాయి .. ప్రతి నెలా 2 బిలియన్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులు వికీపీడియా పేజీని సందర్శిస్తారు.

వికీపీడియాను ప్రారంభించడానికి ముందు, జిమ్మీ వేల్స్ .. లారీ సాంగర్ న్యూపీడియా అనే ఎన్సైక్లోపీడియాను ప్రారంభించారు. నిపుణులు ఇందులో వ్యాసాలు వ్రాసేవారు .. వాటిని సమీక్షించిన తర్వాత మాత్రమే ప్రచురించారు. తరువాత, వికీపీడియా ప్రారంభించినప్పుడు, ప్రతి వినియోగదారుని దానిలో సవరించడానికి అనుమతి ఇవ్వలేదు. కానీ కొన్ని నెలల తర్వాత, వినియోగదారులందరూ దానిలో సవరించడానికి అనుమతిని పొందారు.

వికీపీడియాను ఎవరైనా సవరించవచ్చు

వికీపీడియా సృష్టికర్తలు దానిలోని కంటెంట్‌ను ఎవరైనా సవరించగలిగే విధంగా తయారు చేసారు. అంటే, ఒక వ్యక్తి కావాలనుకుంటే, అతను వికీపీడియా పేజీలోని ఏదైనా సమాచారంలో మార్పులు చేయవచ్చు. దీని కోసం వికీపీడియా పై విమర్శలు కూడా చెలరేగాయి. ఈ కారణంగా చాలా సార్లు వీకీపీడియాను విశ్వసనీయ సమాచార వనరుగా పరిగణించలేదు. వికీపీడియా బృందం ఈ ప్రక్రియను నిరంతరం మెరుగుపరుస్తూ వస్తోంది. వీకీపీడియా తన పేజీలోని ప్రతి తాజా సమాచారాన్ని తక్షణమే నవీకరించడమే కాకుండా, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తారుమారు చేయడం ద్వారా పేజీని సవరించినట్లయితే, వికీపీడియా బృందం ఆ తప్పును కూడా త్వరగా సరిదిద్దుతుంది.

ఇవి కూడా చదవండి: PF Transfer: రెండు, మూడు ఉద్యోగాలు మారారా..? పీఎఫ్‌ బదిలీ గురించి ముఖ్యమైన వివరాలు తెలుసుకోండి..

PM Narendra Modi: స్టార్టప్‌లకు ఊతమిచ్చేందుకు ప్రధాని మోదీ కీలక నిర్ణయం.. నేడు 150 మంది ప్రతినిధులతో భేటీ.