- Telugu News Photo Gallery Spiritual photos Vastu tips in telugu do not keep these things on roof it can be inauspicious
Vastu Tips: ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారా.. మీ ఇంటి పై కప్పుపై ఈ వస్తువులు ఉన్నాయేమో చెక్ చేసుకోండి..
Vastu Tips:ఎక్కువమంది తమ ఇంట్లో పెట్టుకునే వస్తువుల పై చూపే శ్రద్దను ఇంటి పై ఉంచే వస్తువులపై చూపారు. అయితే వాస్తు ప్రకారం.. అలాంటి నిర్లక్ష్యం కొంత నష్టానికి కారణమతుంది. అంతేకాదు కొన్ని సార్లు ఆర్ధిక ఇబ్బందులకు కూడా గురి చేస్తాయి. ఈరోజు ఇంటి పైకప్పుపై ఏ వస్తువులు ఉంచకూడదో తెలుసుకోండి.
Updated on: Jan 15, 2022 | 9:27 AM

చీపురు: లక్ష్మీదేవికి చిహ్నం చీపురు అని నమ్మకం. అయితే చీపురుని నిటారుగా ఎప్పుడు పెట్టకూడదు. ఇలా పెట్టడం వలన లక్ష్మికి కోపం వస్తుందని.. జీవితంలో ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయని నమ్మకం.

తుప్పుపట్టిన ఇనుము: తుప్పుపట్టిన ఇనుము, పాత సామాను ఇంటి పైకప్పుపై పెట్టడం అశుభకరంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వలన ఆర్థికంగానే కాదు శారీరకంగా కూడా ఇబ్బందులు పడతారని నమ్ముతారు. తుప్పు పట్టిన వస్తువులను వెంటనే ఇంటి నుంచి బయవేయాల్సి ఉంటుంది.

పగిలిన కుండలు: కుండలు పగలడం సాధారణ విషయం. అయితే ఇంటిపై పగిలిన కుండ ఉంచడం వాస్తు ప్రకారం శుభప్రదం కాదు. పైకప్పుపై విరిగిన కుండలో మొక్కను నాటడం కూడా మంచిది కాదు.

వెదురు: ఇంటి పైకప్పుపై కొంత పని పూర్తయిన తర్వాత, ప్రజలు తరచుగా వెదురును పైకప్పుపై వేసి.. పనులను మధ్యలో వదిలేస్తారు. ఇలా చేయడానికి వెనుక కారణం ఏదైనా కారణం ఉండి ఉండొచ్చు. అయితే ఇలా చేయడం వలన జీవితంలో అనేక సమస్యలను ఏర్పడతాయి

ఆకులు: ఇంటి పైకప్పుపై చెట్ల నుండి రాలిన ఆకులు, వాటిని శుభ్రం చేయడం అవసరం. పైకప్పుపై ఆకులు పేరుకుపోయినట్లయితే... శుభప్రదంగా పరిగణించబడదు. ఈ వాస్తు చిట్కాలు నమ్మకానికి సంబందిచినవి.





























