PM Narendra Modi: స్టార్టప్‌లకు ఊతమిచ్చేందుకు ప్రధాని మోదీ కీలక నిర్ణయం.. నేడు 150 మంది ప్రతినిధులతో భేటీ..

PM Narendra Modi interact with startups: కేంద్ర ప్రభుత్వం స్టార్టప్‌లపై దృష్టిసారించింది. దీనిలో భాగంగా స్టార్టప్ ఇండియా నినాదంతో

PM Narendra Modi: స్టార్టప్‌లకు ఊతమిచ్చేందుకు ప్రధాని మోదీ కీలక నిర్ణయం.. నేడు 150 మంది ప్రతినిధులతో భేటీ..
Pm Narendra Modi
Follow us
Shaik Madar Saheb

| Edited By: Ravi Kiran

Updated on: Jan 15, 2022 | 7:23 AM

PM Narendra Modi interact with startups: కేంద్ర ప్రభుత్వం స్టార్టప్‌లపై దృష్టిసారించింది. దీనిలో భాగంగా స్టార్టప్ ఇండియా నినాదంతో అన్నిరంగాలకు సహాయసహకారాలు అందిస్తోంది. పలు రంగాల్లోని స్టార్టప్‌లకు ఊతమిచ్చేందుకు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే రంగంలోకి దిగారు. దీనిలో భాగంగా ప్రధాని మోదీ శనివారం (జనవరి 15) అనగా నేడు 150 స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ భేటీ కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ఎంటర్‌ప్రైజ్ సిస్టమ్స్, స్పేస్, ఇండస్ట్రీ 4.0, సెక్యూరిటీ, ఫిన్‌టెక్, వ్యవసాయం, ఆరోగ్యం, పర్యావరణం పలు రంగాలకు చెందిన స్టార్టప్‌ల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. 150కి పైగా స్టార్టప్‌ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని వెల్లడించింది. స్టార్టప్‌ల అభివృద్ధి, ఆర్థికపరమైన విషయాలు, ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు, భవిష్యత్తు సాంకేతికత, ప్రపంచస్థాయిలో భారతదేశాన్ని అగ్రగ్రామిగా నిలిపే అంశాల ఆధారంగా ఆరు వర్కింగ్ గ్రూపులుగా స్టార్టప్‌లను విభజించారు.

ప్రతి బృందం ఇంటరాక్షన్‌లో కేటాయించిన థీమ్‌పై ప్రధాని మోడీ ఎదుట ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దేశంలో నూతన ఆవిష్కరణలను నడపడం ద్వారా స్టార్టప్‌లు జాతీయ అవసరాలకు ఎలా దోహదపడతాయో అర్థం చేసుకునేందుకు ఈ భేటీ లక్ష్యం అని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా జనవరి 10-16 తేదీలలో DPIIT, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ద్వారా “సెలబ్రేటింగ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్” అనే వారం రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ‘స్టార్టప్ ఇండియా’ ఆరవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్నారు.

“దేశ వృద్ధికి స్టార్టప్‌లు గణనీయంగా దోహదపడతాయని ప్రధాన మంత్రి అనేకసార్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా పలు కార్యక్రమాలను సైతం నిర్వహించారు. అంతేకాకుండా.. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం 2016లో స్టార్టప్ ఇండియా ఫ్లాగ్‌షిప్ ఇనిషియేటివ్‌ను సైతం ప్రారంభించారు. దీనిని ప్రోత్సహించడానికి స్టార్టప్‌లకు అనుకూలమైన వాతావరణాన్ని అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. స్టార్టప్‌ల వృద్ధి, అభివృద్ధి కోసం ప్రణాళికను సైతం రూపొందించింది. ఇది దేశంలోని స్టార్టప్ రంగం పర్యావరణ వ్యవస్థపై, అదేవిధంగా అస్థిరమైన వృద్ధికి బాటలువేసింది.

Also Read:

CDS Rawat Helicopter Crash: బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై వెలువడిన నివేదిక.. కీలక వివరాలు వెల్లడి..

Flights: భారత్‌కు వస్తుండగా.. ఒకే రన్‌వే పైకి రెండు విమానాలు.. అప్పుడేమైందంటే..?

చలనం లేకుండా పుట్టిన శిశువు.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా !!
చలనం లేకుండా పుట్టిన శిశువు.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా !!
కొబ్బరి చెట్టు మొదలులో శివలింగం ప్రత్యక్షం !!
కొబ్బరి చెట్టు మొదలులో శివలింగం ప్రత్యక్షం !!
క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత