AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CDS Rawat Helicopter Crash: బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై వెలువడిన నివేదిక.. కీలక వివరాలు వెల్లడి..

బిపిన్ రావత్ (CDS General Bipin Rawat)హెలికాప్టర్ ప్రమాదంపై  (Helicopter Crash) త్రివిధ దళాల కోర్టు ఆఫ్ ఎంక్వైరీ నివేదికను వెల్లడించింది. ఈ నివేదికలో పలు కీలక విషయాలను బయట..

CDS Rawat Helicopter Crash: బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై వెలువడిన నివేదిక.. కీలక వివరాలు వెల్లడి..
Cds Gen Bipin Rawat Helicopter Crash
Sanjay Kasula
|

Updated on: Jan 14, 2022 | 8:59 PM

Share

బిపిన్ రావత్ (CDS General Bipin Rawat)హెలికాప్టర్ ప్రమాదంపై  (Helicopter Crash) త్రివిధ దళాల కోర్టు ఆఫ్ ఎంక్వైరీ నివేదికను వెల్లడించింది. ఈ నివేదికలో పలు కీలక విషయాలను బయట పెట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి కుట్ర కోణం లేదని తేల్చింది. సాంకేతిక సమస్యల కారణంగానే హెలికాప్టర్ కూలిపోయిందని తెలిపింది. కేవలం వాతావరణంలో వచ్చిన మార్పులే ఈ ప్రమాదానికి కారణమని వెల్లడించింది. సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ సహా 14 మంది మృతి చెందిన హెలికాప్టర్ ప్రమాదంపై దర్యాప్తు అనంతరం ప్రాథమిక సమాచారం వెలుగులోకి వచ్చిందని భారత వైమానిక దళం ఈ వివరాలను తెలిపింది . 2021 డిసెంబర్ 8న జరిగిన Mi-17 V5 హెలికాప్టర్ క్రాష్‌పై ట్రై-సర్వీస్ ఇన్వెస్టిగేషన్ దాని ప్రాథమిక ఫలితాలలో ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను విశ్లేషించిందని IAF తెలిపింది. ఈ హెలికాప్టర్ ప్రమాదానికి మెకానికల్ వైఫల్యం, కుట్ర లేదా నిర్లక్ష్యం కారణం కాదని పేర్కొంది.

ప్రాథమిక ఫలితాల ప్రకారం.. లోయలో వాతావరణ పరిస్థితులలో అనూహ్య మార్పు వచ్చింది. దీని కారణంగా హెలికాప్టర్ మేఘాలలో కూరుకుపోయి కూలిపోయింది. మేఘాల కారణంగా పైలట్ కంగారు పడి హెలికాప్టర్ అదుపు తప్పి నేలను ఢీకొట్టింది.

ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు బృందం అందుబాటులో ఉన్న సాక్షులందరినీ విచారించింది. ఇవే కాకుండా ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లను విశ్లేషించారు. దాని ఫలితాల ఆధారంగా, కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ కొన్ని సిఫార్సులు చేసింది. అవి సమీక్షించబడుతున్నాయి.

అదుపులో ఉన్న తర్వాత కూడా హెలికాప్టర్ కుప్పకూలింది

ఎయిర్‌ చీఫ్‌ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరి, ఎయిర్‌ మార్షల్‌ మన్వేంద్ర సింగ్‌ నేతృత్వంలోని ట్రై-సర్వీసెస్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ ఈ ప్రమాదానికి గల కారణాలను అధికారికంగా వెల్లడించింది. జనవరి 5న ఆయన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు విచారణలో వెల్లడైన అంశాలను తెలియజేశారు. తమిళనాడులోని కూనూర్‌లో కుప్పకూలిన హెలికాప్టర్‌ పూర్తిగా పైలట్‌ ఆధీనంలో ఉన్నట్లు సమాచారం.

కానీ మేఘాల కారణంగా అది అతని ఆధీనంలో ఉన్నప్పటికీ కూలిపోయింది. US ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, అటువంటి ప్రమాదాలలో పైలట్లు లేదా సిబ్బందికి ప్రమాదం గురించి ముందుగా ఊహించలేరని వెల్లడించింది.

డిసెంబర్ 8న ప్రమాదం జరిగింది

డిసెంబర్ 8న, CDS రావత్, అతని భార్య మధులికా రావత్, మరో 12 మంది ఆర్మీ సిబ్బంది సూలూర్ ఎయిర్‌బేస్ నుండి వెల్లింగ్టన్ ఎయిర్‌బేస్‌కు హెలికాప్టర్‌లో బయలుదేరారు. హెలికాప్టర్ గమ్యస్థానానికి చేరుకోవడానికి కొన్ని నిమిషాల ముందు సూలూరు ఎయిర్‌బేస్ కంట్రోల్ రూమ్‌కు హెలికాప్టర్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీని తర్వాత హెలికాప్టర్ కుప్పకూలినట్లు సమాచారం. ప్రమాదానికి ముందు హెలికాప్టర్ తక్కువ ఎత్తులో ఎగురుతున్నట్లు, మేఘాల మధ్య ఉన్నట్లు స్థానికులు రికార్డు చేసిన హెలికాప్టర్ వీడియోలో తేలింది. ఈ ప్రమాదంలో బ్రిగేడియర్ ఎల్ఎస్ లిద్దర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జీందర్ సింగ్, గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ సహా మరో 13 మంది మరణించారు.

ఇవి కూడా చదవండి: Video: యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ‘బేబీ షార్క్’ వీడియో..10 మిలియన్ల వ్యూస్ క్రాస్.. మీరు చూశారా..

Gmailలో ఈ ఫీచర్‌ని ఎప్పుడైనా ఉపయోగించారా.. ఇందులో నుంచి సీక్రెట్ ఇమెయిల్ పంపవచ్చు తెలుసా..