AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card Lock: క్రెడిట్, డెబిట్ కార్డుల‌కు లాక్‌ ఎలా చేయాలి.. కార్డును ఎలా సెట్‌ చేసుకోవాలి..!

Credit Card Lock:ప్రస్తుతం డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను ఉపయోగించే వారి సంఖ్య పెరిగిపోతోంది. అలాగే క్రెడిట్‌ కార్డుల ఉపయోగంలో పరిమితికి మించి..

Credit Card Lock: క్రెడిట్, డెబిట్ కార్డుల‌కు లాక్‌ ఎలా చేయాలి.. కార్డును ఎలా సెట్‌ చేసుకోవాలి..!
Subhash Goud
|

Updated on: Jan 14, 2022 | 8:37 PM

Share

Credit Card Lock:ప్రస్తుతం డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను ఉపయోగించే వారి సంఖ్య పెరిగిపోతోంది. అలాగే క్రెడిట్‌ కార్డుల ఉపయోగంలో పరిమితికి మించి ఖర్చు చేసేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఎక్కువగా ఖర్చు చేయడమే కాదు.. ఆన్‌లైన్‌ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. మీరు కార్డు నుంచి చేస్తున్న ఖ‌ర్చుల‌ను అదుపులో పెట్టుకోవ‌డానికి మీ క్రెడిట్, డెబిట్ కార్డుల లావాదేవీల‌పై ప‌రిమితిని మీరే సెట్ చేసుకోవ‌చ్చు. ఎలాగంటే.. ఉదాహ‌ర‌ణ‌కి మీరు కార్డు ఉప‌యోగించిన ప్రతిసారి రూ.5 వేలు లేదా రూ.10 వేలు మించి లావాదేవీలు చేయ‌కూడ‌దు అనుకుంటే, దానికి తగినట్లుగా పరిమితిని ఏర్పాటు చేసుకునేలా చేసుకోవచ్చు. అంత‌కు మించి చేసే లావాదేవీలు విఫ‌ల‌మ‌వుతాయి. అంత‌ర్జాతీయ లావాదేవీలను నియంత్రించుకునే అవ‌కాశం కూడా అందుబాటులో ఉంది.

కార్డును ఎలా సెట్ చేయాలి? కార్డు పరిమితిని ఏర్పర్చుకునే విధానం బ్యాంకు నుంచి బ్యాంకుకు మారుతూ ఉంటుంది. కొన్ని బ్యాంకులు కార్డుపై ఉన్న బటన్‌ను స్విచ్‌ ఆన్‌ చేయడం ద్వారా అనుమతిస్తే, చాలా బ్యాంకులు నెట్ బ్యాంకింగ్ ద్వారా ప‌రిమితిని ఏర్పాటు చేసుకునే సదుపాయాన్ని క‌ల్పిస్తున్నాయి. మీరు కార్డు ఆప్షన్‌కు వెళ్లి ప‌రిమితి విధించాల‌నుకుంటున్న కార్డు వివ‌రాల‌ను న‌మోదు చేయాల్సి ఉంటుంది. దేశీయ లావాదేవీల కోసం లేదా అంత‌ర్జాతీయ లావాదేవీల కోసం ప‌రిమితి ఏర్పాటు చేయాల‌నుకుంటున్నారా? లేదా ఇత‌ర మార్పులు ఏమైనా చేయాల‌నుకుంటున్నారా? అన్న ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో మీకు కావ‌ల‌సిన ఆప్షన్‌ ఎంచుకుని లిమిట్‌ను సెట్ చేసుకోవ‌చ్చు. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కూడా లిమిట్‌ను సెట్ చేసుకునే సదుపాయాన్ని కొన్ని బ్యాంకులు క‌ల్పిస్తున్నాయి. ఒకసారి ఆప్షన్ ఎనేబుల్ చేసిన త‌ర్వాత బ్యాంకు పరిమితి విధించిన సంగతి మీకు తెలియజేస్తుంది. తర్వాత లావాదేవీలు ప‌రిమితికి మించితే బ్యాంకు మీకు సమాచారం అందజేస్తుంది.

ప‌రిమితి ఎందుకు సెట్‌ చేసుకోవాలి..? డెబిట్, క్రెడిట్ కార్డుల మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇలాంటి మోసాల‌ను అరిక‌ట్టేందుకు బ్యాంకులతో పాటు మ‌నం కూడా త‌గిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ప్రత్యేకించి మీ పాస్‌వర్డ్‌, పిన్ వంటి వివ‌రాల‌ను ఎవ‌రితోనూ పంచుకోకపోవడం మంచిది. మీ కార్డు విత్‌డ్రా లిమిట్‌ను ప‌రిమితం చేయండి. ఉదాహ‌ర‌ణ‌కు మీ కార్డు అంత‌ర్జాతీయ లావాదేవీల‌ను రద్దు చేసి, దేశీయంగా ఒక‌సారి చేసే లావాదేవీల‌ను రూ.5 వేల‌కు ప‌రిమితం చేశార‌నుకుందాం. అంత‌ర్జాతీయంగా మోసాల‌కు పాల్పడే వారు మీ కార్డు వివ‌రాల ద్వారా లావాదేవీలు నిర్వహించే వీలు ఉండదు. అలాగే దేశీయంగా మోసాల‌కు పాల్పడితే రూ.5 వేలకు మించి న‌ష్టపోకుండా జాగ్రత్త పడవచ్చు అంటున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి:

Modi Government: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రయాణికులకు మరింత భద్రత

Post Office Scheme: నెలకు రూ.1000తో చేతికి రూ.8 లక్షలు.. పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌..!

LIC Adharshila Plan: ఆధార్‌ కార్డు ఉన్న ప్రతి మహిళకు అదిరిపోయే బెనిఫిట్‌.. ఈ స్కీమ్‌లో చేరితే లక్షల్లో ఎంతో ప్రయోజనం