Post Office Scheme: నెలకు రూ.1000తో చేతికి రూ.8 లక్షలు.. పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్..!
Post Office Scheme: ప్రస్తుత ఆదాయం పెంచుకునేందుకు రకరకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా..
Post Office Scheme: ప్రస్తుత ఆదాయం పెంచుకునేందుకు రకరకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు రకరకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. పలు రకాల స్కీమ్‌లో చేరితే పిల్లల చదువులు, పెళ్లిళ్ల నిమిత్తం డబ్బులు భారీగా ఆదా చేసుకోవచ్చు. డబ్బులు దాచుకునే తర్వాత ఎక్కువ మొత్తంలో పొందేందుకు మంచి అవకాశం ఉంటుంది. వివిధ రకాల పథకాలలో పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ ఒకటి. పీపీఎఫ్‌లో డబ్బులు పెట్టుబడిగా పెట్టి మంచి లాభాలు పొందవచ్చు.
పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్‌లో డబ్బులు పెడితే ఎలాంటి రిస్క్ లేకుండా ప్రయోజనం పొందవచ్చు. పీపీఎఫ్‌లో ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.ప్రస్తుతం పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ స్కీమ్‌పై 7.1 శాతం వడ్డీ రేటు ఉంది. పీపీఎఫ్ మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు. 15 ఏళ్ల పాటు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. అవసరం అనుకుంటే మెచ్యూరటీ కాలాన్ని సైతం పెంచుకోవచ్చు.
పీపీఎఫ్ స్కీమ్‌లో రుణ సదుపాయం:
పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్‌లో డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ చేసేవారికి రుణ సదుపాయం కూడా ఉంటుంది. ఇందులో వడ్డీ రేట్లను ప్రతి మూడు నెలలకోసారి సవరిస్తూ ఉంటారు. పోస్టాఫీసు లేదా బ్యాంకుకు వెళ్లి పీపీఎఫ్ అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు. ఒక ఏడాదిలో రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. రూ.500 డిపాజిట్ చేసి కొనసాగుతుంది.
పీపీఎఫ్ స్కీమ్ ద్వారా రూ.8 లక్షలు:
ఈ పీపీఎఫ్ స్కీమ్ ద్వారా రూ.8 లక్షల వరకు పొందవచ్చు. మీరు నెలకు రూ.1000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటే.. రోజుకు రూ.35 వరకకు పొదుపు చేయాల్సి ఉంటుంది. ఈ డబ్బులు ఈ స్కీమ్‌లో 25 సంవత్సరాల పాటు డిపాజిట్ చేయల్సి ఉంటుంది. ఇక మెచ్యూరిటీ సమయంలో చేతికి రూ.8.24 లక్షలు పొందవచ్చు. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే పోస్టాఫీసు లేదా బ్యాంకులను సంప్రదిస్తే సరిపోతుంది.