Flights: భారత్‌కు వస్తుండగా.. ఒకే రన్‌వే పైకి రెండు విమానాలు.. అప్పుడేమైందంటే..?

India Flights: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. భారత్‌కు వచ్చే రెండు విమానాలు టేకాఫ్‌ సమయంలో

Flights: భారత్‌కు వస్తుండగా.. ఒకే రన్‌వే పైకి రెండు విమానాలు.. అప్పుడేమైందంటే..?
International Flights
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 14, 2022 | 7:59 PM

India Flights: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. భారత్‌కు వచ్చే రెండు విమానాలు టేకాఫ్‌ సమయంలో ఒకే రన్‌వేపైకి వచ్చాయి. ఈ క్రమంలో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ATC) అప్రమత్తం కావడంతో ఆ రెండు విమానాలు ఢీకొనే ముప్పు నుంచి తృటిలో తప్పించుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో రెండు విమానాల్లోని వందలాది మంది ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని వెల్లడించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన గత ఆదివారం (జనవరి 9న) జరిగింది.

దబాయ్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్లే ఎమిరేట్స్ విమానం ఈకే-524 టేకాఫ్‌కు బయలుదేరింది. ఈ క్రమంలో రన్‌ వే 30ఆర్‌ పైకి అది సమీపిస్తోంది. ఇంతలో దుబాయ్‌ నుంచి బెంగళూరు వెళ్లే మరో ఎమిరేట్స్ విమానం ఈకే-568 అదే రన్‌వేపై టేకాఫ్‌ కోసం వేగంగా దూసుకువచ్చింది. ఈ సమయంలో ఎయిర్‌పోర్ట్‌ ఏటీసీ అప్రమత్తమై వెంటనే చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ వెళ్లే విమానం టేకాఫ్‌ను వెంటనే నిలిపివేసినట్లు తెలిపారు.

అయితే.. ఏటీసీ గుర్తించకపోతే పెను ప్రమాదం జరిగేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విమానయాన సంస్థలు కూడా స్పందించాయి. దీనిపై విచారణకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.

Also Read:

Modi Government: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రయాణికులకు మరింత భద్రత

Omicron Variant: కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ పిల్లలపై ప్రభావం ఎక్కువ: ఢిల్లీ ఎయిమ్స్‌ ప్రొఫెసర్‌..!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?