Omicron Variant: కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పిల్లలపై ప్రభావం ఎక్కువ: ఢిల్లీ ఎయిమ్స్ ప్రొఫెసర్..!
Omicron Variant: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పడుతుందనుకునేలోపే కొత్త వేరియంట్‌తో పాటు..
Omicron Variant: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పడుతుందనుకునేలోపే కొత్త వేరియంట్‌తో పాటు కరోనా థర్డ్ వేవ్ తీవ్ర స్థాయిలో ముంచుకొస్తుంది. తాజాగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పుడు అనేక దేశాల్లో థర్డ్‌వేవ్ మొదలైంది. ఇప్పటికే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలకు చుట్టుముట్టింది. కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో కఠిన ఆంక్షలు విధించాల్సిన పరిస్థితి వస్తోంది. అయితే ఈ కొత్త వేరియంట్ ప్రభావ పిల్లలపై అధికంగా ఉంటుందని భయాందోళన కలిగిస్తోంది. మొదటి, రెండు దశల సమయంలో పిల్లలపై పెద్దగా ప్రభావం చూపని కరోనా.. ఈ థర్డ్‌వేవ్ మరింతగా ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
ఢిల్లీ ఎయిమ్స్ నిర్వహించిన ఓ సెమినార్‌లో ఎయిమ్స్ పీడీయాట్రరి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ హెడ్ ప్రొఫెస్ డాక్టర్ రాకేష్ లోధా పలు విషయాలను వెల్లడించారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ త్వరగా వ్యాప్తి చెందే లక్షణాలు ఉండటంతో పిల్లలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. అయితే ప్రజలు సరైన నిబంధనలు పాటించకపోవడం ఓ కారణమైతే.. మాస్క్‌లు, భౌతిక దూరం పాటించకపోవడం మరో కారణమని చెబుతున్నారు.
పలు రకాల సమస్యలతో బాధపడుతున్న వారు మినహా ఇప్పటి వరకు పిల్లలు వైరస్‌కు మెరుగైన రీతిలో కలిగి ఉండటంతో పాటు డెల్టా కంటే ఒమిక్రాన్ తీవ్ర వ్యాప్తి ఉండటంతో పాటు ఆర్-వాల్యూ పెరిగిపోవడం తో పిల్లలపై అధికంగా ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. అయితే అమెరికాలో కోవిడ్ కారణంగా పిల్లలు ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య పెరిగిపోతోందని నివేదికలు వెలువడుతున్నాయి. పిల్లల్లో కోవిడ్ లక్షణాలు.. జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ముఖం, ఛాతి నొప్పి తదితర లక్షణలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి: