Education: పదో తరగతి చదివేవారికి శుభవార్త.. ఇకపై వారు కూడా ఫైనల్ పరీక్షలు రాయచ్చు..

ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు తెలంగాణ రాష్ట్ర విద్య శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ప‌దో త‌ర‌గ‌తి తుది ప‌రీక్షలు రాయ‌డానికి వయసు పరిమితిలో

Education: పదో తరగతి చదివేవారికి శుభవార్త.. ఇకపై వారు కూడా ఫైనల్ పరీక్షలు రాయచ్చు..
Follow us
Basha Shek

|

Updated on: Jan 15, 2022 | 9:33 AM

ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు తెలంగాణ రాష్ట్ర విద్య శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ప‌దో త‌ర‌గ‌తి తుది ప‌రీక్షలు రాయ‌డానికి వయసు పరిమితిలో వెసులుబాటు కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తాజా నిర్ణ‌యంతో ఇక నుంచి తెలంగాణలో 12 ఏళ్ల వ‌య‌సున్న వారు కూడా ప‌దో త‌ర‌గతి చ‌ద‌వ వ‌చ్చు. ప‌దో త‌ర‌గ‌తి ఫైన‌ల్ ప‌రీక్షలను హాజరుకావచ్చు. గ‌తంలో ఉన్న నిబంధ‌న‌ల ప్ర‌కారం ప‌దో త‌ర‌గతి చ‌ద‌వాల‌న్నా.. ఫైన‌ల్ ప‌రీక్షలు రాయాల‌న్నా.. విద్యార్థి త‌ప్ప కుండా 14 ఏళ్ల వ‌య‌స్సు క‌లిగి ఉండాలి. తాజా గా విద్యార్థులకు రెండు సంవ‌త్స‌రాలు మిన‌హాయింపు ఇస్తూ నిబంధనలను సవరించింది.

ఏయే సర్టిఫికెట్లు సమర్పించాలంటే..

కాగా 2022 లో జరిగే ఎస్‌ఎస్‌సీ పరీక్షల ఫీజు చెల్లింపులకు సంబందించి ఇటీవల షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 3 వరకు ఫీజు చెల్లించవచ్చు. వయసు మినహాయింపుకోరే విద్యార్థులు రూ. 300 చలనా కట్టి, మెడికల్ సర్టిఫికెట్‌, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలను సమర్పించవలసి ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న వారికి సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ప్రైవేట్ స్కూల్‌ విద్యార్థులకు జిల్లా విద్యాశాఖాధికారి వయసు మినహాయింపు ఇచ్చే అధికారం కలిగి ఉంటారని ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారులు తెలిపారు.

మరికొన్ని మినహాయింపులివే.. *ఎస్సీ, ఎస్టీ, బీసీ, గ్రామీణ ప్రాంత విద్యార్థుల వార్షికాదాయం రూ. 24 వేల లోపు ఉన్నట్లయితే పరీక్ష ఫీజులో రాయితీ పొందవచ్చు. ఇందుకోసం ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది.

*డిస్‌ లెక్సియాతో సతమతమయ్యే విద్యార్థులు( మెదడు సంబంధిత సమస్యలుండి చదవడం, రాయడం, నేర్చుకోవడంలో ఇబ్బందిపడేవారు) మూడో భాష నుంచి మినహాయింపు పొందవచ్చు. వీరు పరీక్షల్లో స్క్రైబ్‌ (పరీక్షలో సహాయకుడిగా మరొకరిని) ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఇలాంటి విద్యార్థులకు ప్రతి పరీక్షా పేపర్‌కు 60 నిమిషాల అదనపు సమయం కేటాయించారు.

*మూగ, చెవుడు, అంధత్వం ఉన్న విద్యార్థులు కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. వీరికి ఉత్తీర్ణత మార్కులు 35 నుంచి 20 మార్కులకు తగ్గించారు. స్క్రైబ్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. వీరు ప్రతి పేపర్‌కు 30 నిమిషాలు అదనంగా ఉపయోగించుకోవచ్చు.

*ఈ సౌలభ్యాన్ని వినియోగించుకోవాలనుకునే వారు ముందుగా ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. అదేవిధంగా నామినల్ రోల్స్ లో పూర్తి వివరాలు నమోదు చేయాలి. Also Read: సీరియల్‌ ఎఫెక్ట్‌ !! గుర్రమెక్కి..కత్తిపట్టి.. పెళ్లిమండపానికి నవ వధువు !! వీడియో

Srisailam: ఎట్టకేలకు బోనులో చిక్కిన ఎలుగుబంటి.. ఊపిరి పీల్చుకున్న శ్రీశైలం వాసులు, భక్తులు..

KTR: భారత ప్రభుత్వంపై టెస్లా అధినేత ఆరోపణలు.. కేటీఆర్‌ ఆసక్తికర ట్వీట్‌..