AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB NTPC Exam 2021 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

RRB NTPC 2021 Result: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) NTPC పరీక్ష 2021 ఫలితాలను ప్రకటించింది. RRB అధికారిక ప్రాంతీయ వెబ్‌సైట్‌లలో

RRB NTPC Exam 2021 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
Rrb Ntpc 1
uppula Raju
|

Updated on: Jan 15, 2022 | 12:10 PM

Share

RRB NTPC 2021 Result: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) NTPC పరీక్ష 2021 ఫలితాలను ప్రకటించింది. RRB అధికారిక ప్రాంతీయ వెబ్‌సైట్‌లలో మీ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్ష మొదటి దశకు హాజరైన అభ్యర్థులు (cbt1) RRB అధికారిక ప్రాంతీయ వెబ్‌సైట్‌లలో సంబంధిత ప్రాంతాల ప్రకారం ఫలితాలను తనిఖీ చేసుకోవచ్చు. CBT-1 కోసం షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు రెండో దశ పరీక్షకు హాజరవుతారు. NTPC II పరీక్ష ఫిబ్రవరి 14 నుంచి 18, 2022 వరకు నిర్వహిస్తారు.

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు కూడా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. శాఖలో ఖాళీగా ఉన్న30 వేలకు పైగా పోస్టుల భర్తీకి బోర్డు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద 30 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తారు. CBT 2 పరీక్ష 14 ఫిబ్రవరి 2022 నుంచి 18 ఫిబ్రవరి 2022 వరకు నిర్వహిస్తారు. CBT 2 కోసం అడ్మిట్ కార్డ్ త్వరలో జారీ చేస్తారు. దీని సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో తెలియజేస్తారు.

ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి..?

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ rrbcdg సంబంధిత ప్రాంతీయ వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. వెబ్‌సైట్‌ ఓపెన్ చేసి హోమ్‌ పేజీలో ‘RRB NTPC ఫలితం 2021’ లింక్‌పై క్లిక్ చేయండి. అభ్యర్థి లాగిన్ ఆధారాలను ఉపయోగించి డౌన్‌లోడ్ చేసుకోగలిగే PDF ఫైల్ కనిపిస్తుంది. ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి, మీ ఫలితాన్ని తెలుసుకోండి.

రైల్వే విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, టైమ్ కీపర్, ట్రైన్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ టెస్ట్ వంటి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీల కింద 35281 ఖాళీల కోసం మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం అభ్యర్థులు వెబ్‌సైట్‌ను సందర్శించండి.

విద్యార్థులకు శుభవార్త.. ఆన్‌లైన్ జర్నలిజం కోర్సును ప్రారంభించిన ఇగ్నో.. జనవరి 31 చివరి తేదీ..

U19 World Cup: 27 పరుగులకే 5 వికెట్లు పడగొట్టాడు.. ఫలితంగా తొలి మ్యాచ్‌లో ఘన విజయం..

Cricket News: పేరు తెలియని వ్యాధితో చనిపోయిన ఫేమస్ క్రికెటర్.. 25 సెంచరీలు, 14 వేల పరుగులు..